SplashBI GCC Launch | జీసీసీలను సంప్రదాయ సేవలకే పరిమితం కానివ్వం.. ఆవిష్కరణ కేంద్రాలుగా తయారు చేస్తం
SplashBI GCC Launch | జీసీసీ (GCC) లను సంప్రదాయ సేవలకే పరిమితం కానివ్వమని.. ప్రపంచ స్థాయి ఉత్పత్తుల రూపకల్పన, పరిశోధన, సాంకేతిక ఆవిష్కరణలకు కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు (Sridhar Babu) తెలిపారు.
- డేటా ఇంటెలిజెన్స్, ఏఐ, బిజినెస్ అనలిటిక్స్ రంగాల్లో సేవలందించేలా ప్రోత్సహిస్తం
- కొత్తగా 275 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తయ్
- హైదరాబాద్‌లో స్ల్పాష్‌బీఐ జీసీసీ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు
SplashBI GCC Launch | త్రినేత్ర న్యూస్: జీసీసీ (GCC) లను సంప్రదాయ సేవలకే పరిమితం కానివ్వమని.. ప్రపంచ స్థాయి ఉత్పత్తుల రూపకల్పన, పరిశోధన, సాంకేతిక ఆవిష్కరణలకు కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు (Sridhar Babu) తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా డేటా ఇంటెలిజెన్స్ ప్లాట్ ఫామ్‌తో పాటు స్ల్పాష్ ఏఐ సామర్థ్యాలనూ అభివృద్ధి చేస్తుందని, ఇక్కడ కొత్తగా 275 మంది నిపుణులకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. డేటా ఇంటెలిజెన్స్, ఏఐ, బిజినెస్ అనలిటిక్స్ రంగాల్లో సేవలందించేలా ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో స్ల్పాష్‌బీఐ జీసీసీని సోమవారం ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
100 మిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి
అమెరికాలోని జార్జియా రాష్ట్రం డులూత్ కేంద్రంగా ఎంటర్‌ప్రైజ్ డేటా ఇంటెలిజెన్స్, బిజినెస్ అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో సేవలందిస్తున్న స్ల్పాష్‌బీఐ (SplashBI) హైదరాబాద్‌లో తన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను ఏర్పాటు చేసింది. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అభివృద్ధి కార్యాలయాన్ని ఏర్పాటు చేశాం. స్ల్పాష్‌బీఐ ప్రపంచవ్యాప్తంగా 39 దేశాల్లో 500కు పైగా ఎంటర్‌ప్రైజ్ సంస్థలకు సేవలందిస్తోంది. రాబోయే 5 నుంచి 7 ఏళ్లలో హైదరాబాద్‌లో 100 మిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.
ప్రస్తుతం నగరంలో 515కు పైగా జీసీసీలు ఉండగా, వాటిలో మూడు లక్షల మందికిపైగా నిపుణులు పనిచేస్తున్నారు. గతేడాది దేశంలోనే అత్యధికంగా 70కి పైగా కొత్త జీసీసీలు హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. వచ్చే ఏడాదిలో కొత్తగా 100 జీసీసీలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఏఐ, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ప్రొడక్ట్ ఇంజినీరింగ్ తదితర రంగాల్లోనూ కీలక పాత్ర పోషించేలా వాటిని ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నాం.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, స్ల్పాష్‌బీఐ సీఈవో నవీన్ మిగ్లానీ, ప్రెసిడెంట్, సీటీవో కిరణ్ రెడ్డి పాశం తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●Senegal Migrant Boat Sinking | సెనెగల్ తీరంలో విషాదం: యూరప్‌నకు వలస వెళ్తూ పడవ బోల్తా.. 34 మంది మృతి
- ●Hyderabad | హైదరాబాద్‌లో పేకాట శిబిరాలపై మెరుపుదాడి.. 16 మంది అరెస్టు
- ●Lifestyle Inflation | వేతనం పెరుగుతున్నా పొదుపు పెరగడం లేదా? మీ ఖర్చులే కారణమా..?
- ●Commercial Tax | రాష్ట్ర ఖజానాకు కాసుల వర్షం.. ఒక్క నెలలోనే రూ.7,735 కోట్ల ఆదాయం!
- ●Cancer drug | క్యాన్సర్ రోగులకు భారీ ఊరట.. 96.45 శాతం వరకు తగ్గిన మందుల ధరలు..!
- ●Deepavali | దీపావళి వేళ 48 మందికి గాయాలు.. సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో చికిత్స

Senegal Migrant Boat Sinking | సెనెగల్ తీరంలో విషాదం: యూరప్‌నకు వలస వెళ్తూ పడవ బోల్తా.. 34 మంది మృతి

Hyderabad | హైదరాబాద్‌లో పేకాట శిబిరాలపై మెరుపుదాడి.. 16 మంది అరెస్టు

Lifestyle Inflation | వేతనం పెరుగుతున్నా పొదుపు పెరగడం లేదా? మీ ఖర్చులే కారణమా..?

Commercial Tax | రాష్ట్ర ఖజానాకు కాసుల వర్షం.. ఒక్క నెలలోనే రూ.7,735 కోట్ల ఆదాయం!







