ZENO 300 | రూ.9,649కే జెనో 300 స్మార్ట్‌ఫోన్.. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ..
ZENO 300 | మొబైల్స్ తయారీ సంస్థ జెనో కొత్తగా జెనో 300 పేరుతో ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఈ ఏడాది ప్రారంభంలో జెనో 200 ఫోన్‌ను విడుదల చేసిన తరువాత ఇప్పుడు ఈ మోడల్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఇందులో అధిక బ్యాటరీ కెపాసిటీ, మన్నికైన నిర్మాణం, రోజువారీ అవసరాలకు సరిపోయే పనితీరు వంటి ఫీచర్లను అందించినట్లు సంస్థ తెలిపింది.
Technology | Published On Sep 26, 2026, 2.34 pm IST
ZENO 300 | మొబైల్స్ తయారీ సంస్థ జెనో కొత్తగా జెనో 300 పేరుతో ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఈ ఏడాది ప్రారంభంలో జెనో 200 ఫోన్‌ను విడుదల చేసిన తరువాత ఇప్పుడు ఈ మోడల్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఇందులో అధిక బ్యాటరీ కెపాసిటీ, మన్నికైన నిర్మాణం, రోజువారీ అవసరాలకు సరిపోయే పనితీరు వంటి ఫీచర్లను అందించినట్లు సంస్థ తెలిపింది. రూ.10వేల లోపు ధరతో ఈ ఫోన్‌ను లాంచ్ చేసినట్లు వెల్లడించింది. ఇందులో 6.56 ఇంచుల ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉండగా, దీనికి హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్, 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను ఇచ్చారు. దీని వల్ల డిస్‌ప్లే క్వాలిటీ బాగుంటుంది. ఈ ఫోన్ ముందు వైపు డిస్‌ప్లేలో వాటర్ డ్రాప్ తరహా నాచ్‌ను ఇచ్చారు. అందులో 5 మెగాపిక్సల్ కెమెరా ఉంది. వెనుక వైపు 8 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు.
భారీ బ్యాటరీ..
ఈ ఫోన్‌లో యూనిసాక్ టి7100 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఇచ్చారు. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియెంట్‌లో దీన్ని లాంచ్ చేశారు. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను మరింత పెంచుకోవచ్చు. 8జీబీ వరకు ర్యామ్‌ను వర్చువల్‌గా పెంచుకోవచ్చు. దీంతో ఫోన్ ల్యాగ్ లేకుండా పనిచేస్తుంది. ఇందులో ఆండ్రాయిడ్ 16 గో ఎడిషన్ ఓఎస్‌ను ఇచ్చారు. ఇది తక్కువ హార్డ్‌వేర్ కెపాసిటీ ఉన్న ఫోన్లలోనూ మెరుగైన ప్రదర్శనను ఇస్తుంది. తక్కువ ర్యామ్‌ను వాడుకుంటూ ఎక్కువ వేగంగా పనిచేస్తుంది. మెసేజింగ్, డిజిటల్ పేమెంట్లు, మీడియా స్ట్రీమింగ్ వంటి రోజువారీ అవసరాలకు అనుగుణంగా ఈ ఫోన్ మెరుగైన ప్రదర్శన ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఇందులో ప్రధాన ఆకర్షణ 6000 ఎంఏహెచ్ బ్యాటరీ. యూఎస్‌బీ టైప్ సి పోర్టు ద్వారా ఫోన్‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. ఈ ఫోన్‌ను మిలిటరీ గ్రేడ్ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించారు. అందువల్ల బిల్డ్ క్వాలిటీ దృఢంగా ఉంటుంది. ఫోన్‌ను కొనుగోలు చేసిన తేదీ నుంచి 100 రోజుల పాటు ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్ పాలసీని కూడా సంస్థ అందిస్తోంది.
ధర వివరాలు..
భద్రత కోసం ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫిజికల్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌తో పాటు ఫేస్ అన్‌లాక్ సదుపాయం ఉంది. కనెక్టివిటీ పరంగా 4జి ఎల్‌టీఈ, యూఎస్‌బీ టైప్ సి ఓటీజీ, వైఫై 802.11ఏసీ, బ్లూటూత్ 5.2, జీపీఎస్, గ్లోనాస్, బీడౌ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఇంట్లోని పరికరాలను నియంత్రించేందుకు ఇన్‌ఫ్రారెడ్ బ్లాస్టర్‌ను కూడా అందించారు. తక్కువ సెల్యులార్ సిగ్నల్ ఉన్న ప్రాంతాల్లో కనెక్టివిటీకి ఉపయోగపడే అల్ట్రాలింక్ ఫ్రీ కాల్ ఫీచర్ కూడా ఉంది. డ్యుయల్ సిమ్‌తో పాటు ప్రత్యేక మైక్రోఎస్‌డీ కార్డు స్లాట్, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి. ఆడియో కోసం డీటీఎస్ సౌండ్ ప్రాసెసింగ్‌కు సపోర్ట్ ఇచ్చారు. ఇక జెనో 300 ఫోన్‌ను లావెండర్ పర్పుల్, సిల్వర్ మిస్ట్, క్లాసిక్ బ్లాక్ రంగుల్లో లాంచ్ చేశారు. దీని ధరను రూ.9,649గా నిర్ణయించారు. ప్రస్తుతం అమెజాన్ ఇండియా ద్వారా ఈ ఫోన్ విక్రయానికి అందుబాటులో ఉంది.
సంబంధిత వార్తలు

Infinix Smart 20 | పవర్ఫుల్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో లాంచ్ అయిన ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 ఫోన్.. ధర ఎంతంటే..?
జూన్ 8, 2026

Oppo A6c | బడ్జెట్ ధరకే ఒప్పో నుంచి కొత్త ఫోన్.. భారీ బ్యాటరీతో..
మే 26, 2026

moto g37 and g37 Power | భారత్‌లో లాంచ్ అయిన మోటో జి37 సిరీస్.. భారీ బ్యాటరీతో అదిరిపోయిన ఫీచర్లు..
మే 19, 2026
తాజావార్తలు
- ●Satyam Srirangam | జ్ఞానేశ్వర్ కుమార్ అక్రమాలపై రేపు రాష్ట్రవ్యాప్త ఆందోళనలు
- ●Ram Charan | దసరాకు రామ్‌చరణ్, సుకుమార్ మూవీ లాంఛ్ - గెస్ట్‌గా పవన్ కళ్యాణ్
- ●Kalwakuntla Kavitha | ఖైరతాబాద్ ఉప ఎన్నికలో బరిలో ఉంటాం: టీఆర్ఎస్ చీఫ్ కవిత
- ●Monkey | ఫుల్‌గా మందుకొట్టి పడుకున్న కోతి.. VIDEO
- ●Kayadu Lohar | స్టూడెంట్ లీడర్‌గా కయదు లోహర్ - నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్‌తో తమిళ సినిమా
- ●Gyanesh Kumar | సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు పద్మభూషణ్ ఇవ్వాల్సిందే.. బెంగాల్ బీజేపీ అధ్యక్షుడి డిమాండ్

Satyam Srirangam | జ్ఞానేశ్వర్ కుమార్ అక్రమాలపై రేపు రాష్ట్రవ్యాప్త ఆందోళనలు

Ram Charan | దసరాకు రామ్‌చరణ్, సుకుమార్ మూవీ లాంఛ్ - గెస్ట్‌గా పవన్ కళ్యాణ్

Kalwakuntla Kavitha | ఖైరతాబాద్ ఉప ఎన్నికలో బరిలో ఉంటాం: టీఆర్ఎస్ చీఫ్ కవిత

Monkey | ఫుల్‌గా మందుకొట్టి పడుకున్న కోతి.. VIDEO



