త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Infinix Smart 20 | ప‌వ‌ర్‌ఫుల్ డిస్‌ప్లే, భారీ బ్యాట‌రీతో లాంచ్ అయిన ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 ఫోన్.. ధ‌ర ఎంతంటే..?

Infinix Smart 20 | ఇన్ఫినిక్స్ భారత మార్కెట్‌లో తన ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ పోర్ట్‌ఫోలియోను విస్తరించుతూ కొత్త ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 ఫోన్ ను అధికారికంగా విడుదల చేసింది. గతంలో వచ్చిన స్మార్ట్ 10కు కొన‌సాగింపుగా వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో డిస్‌ప్లే, బ్యాటరీ సామర్థ్యం, ప్రాసెసర్ వంటి విభాగాల్లో పలు అప్‌గ్రేడ్‌లు అందించింది.

S

Technology | Published On Jun 8, 2026, 4.31 pm IST

Infinix Smart 20 | ప‌వ‌ర్‌ఫుల్ డిస్‌ప్లే, భారీ బ్యాట‌రీతో లాంచ్ అయిన ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 ఫోన్.. ధ‌ర ఎంతంటే..?
Advertisement

Infinix Smart 20 | ఇన్ఫినిక్స్ భారత మార్కెట్‌లో తన ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ పోర్ట్‌ఫోలియోను విస్తరించుతూ కొత్త ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 ఫోన్ ను అధికారికంగా విడుదల చేసింది. గతంలో వచ్చిన స్మార్ట్ 10కు కొన‌సాగింపుగా వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో డిస్‌ప్లే, బ్యాటరీ సామర్థ్యం, ప్రాసెసర్ వంటి విభాగాల్లో పలు అప్‌గ్రేడ్‌లు అందించింది. ముఖ్యంగా బడ్జెట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ డివైస్‌ను రూపొందించింది. ఫోన్ వెనుక భాగంలో ఫ్లాట్ 3డి టెక్స్చర్ కాంపోజిట్ డిజైన్‌ను అందించారు. కేవలం 7.7 మిల్లీమీటర్ల మందంతో స్లిమ్ ప్రొఫైల్‌ను కలిగి ఉంది. ముందుభాగంలో 6.78 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. ఇది 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. గత మోడల్‌లో ఉన్న 6.67 ఇంచుల స్క్రీన్‌తో పోలిస్తే ఇది పెద్దదిగా ఉండటంతోపాటు మరింత స్మూత్ విజువల్ అనుభవాన్ని అందిస్తుంది. డిస్‌ప్లే మధ్యలో పంచ్-హోల్ కట్‌అవుట్ ఉండగా, నోటిఫికేషన్లు, స్టేటస్ సమాచారాన్ని చూపించే “డైనమిక్ బార్” ఫీచర్‌ను కూడా పొందుపరిచారు.

భారీ బ్యాట‌రీ..

పెర్ఫార్మెన్స్ పరంగా ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జి81 అల్టిమేట్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది 4జీబీ ర్యామ్‌తో ప‌నిచేస్తుంది. అలాగే ఇన్ఫినిక్స్ మెమ్‌ఫ్యూజన్ టెక్నాలజీ ద్వారా మరో 4జీబీ వరకు వర్చువల్ ర్యామ్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉంది. 64జీబీ, 128జీబీ స్టోరేజ్ వేరియెంట్లు అందుబాటులో ఉండగా, ప్రత్యేక మైక్రోఎస్‌డీ కార్డ్ స్లాట్ ద్వారా 2టీబీ వరకు మెమరీని విస్తరించుకోవచ్చు. ఫోన్‌కు 5,200 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని అందించారు. ఇది ఎక్కువసేపు స్టాండ్‌బై బ్యాకప్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. 15 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‌తోపాటు 5 వాట్ల రివర్స్ వైర్డ్ చార్జింగ్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. ఫోటోగ్రఫీ కోసం వెనుక భాగంలో 8 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతోపాటు సహాయక లెన్స్, డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్‌ను ఇచ్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. సూపర్ నైట్ మోడ్, డ్యూయల్ వీడియో, ప్రత్యేక వీలాగ్ మోడ్ వంటి సాఫ్ట్‌వేర్ ఆధారిత ఫీచర్లు కూడా అందించారు.

ప‌వ‌ర్ ఫుల్ డిస్‌ప్లే..

కనెక్టివిటీ పరంగా ఈ డివైస్ 4జీ నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇన్ఫినిక్స్ ప్రవేశపెట్టిన అల్ట్రాలింక్ ఫీచర్ ద్వారా అనుకూల ఇన్ఫినిక్స్ డివైస్‌ల మధ్య సుమారు 1 కిలోమీటర్ దూరం వరకు ఇంటర్నెట్ లేకుండానే వాకీ-టాకీ తరహా కమ్యూనికేషన్ చేయవచ్చు. అదనంగా స్మార్ట్ నాయిస్ క్యాన్సిలేషన్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ64 డస్ట్, వాటర్ స్ప్లాష్ రెసిస్టెన్స్ రేటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 6.78 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 700 నిట్స్ బ్రైట్‌నెస్, మీడియాటెక్ హీలియో జీ81 అల్టిమేట్ ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64జీబీ, 128జీబీ స్టోరేజ్, 2టీబీ వరకు మెమరీ విస్తరణ, ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఎక్స్‌ఓఎస్ 16, 8ఎంపీ రియర్ కెమెరా, 8ఎంపీ సెల్ఫీ కెమెరా, స్టీరియో స్పీకర్లు, డీటీఎస్ సపోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్, 5200 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్ల చార్జింగ్ సపోర్ట్, ఐపీ64 రేటింగ్ వంటి ఫీచ‌ర్ల‌ను ఇచ్చారు.

ధ‌ర వివ‌రాలు..

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ.12,499 ఉండ‌గా, 4జీబీ ర్యామ్‌, 128జీబీ వేరియంట్ ధర రూ.13,999గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ జూన్ 12 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్, ఇన్ఫినిక్స్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్ ద్వారా విక్రయానికి అందుబాటులో ఉంటుంది. సన్‌లైట్ ఆరెంజ్, క్లౌడ్‌లైన్ బ్లూ, షాడో బ్లాక్, పోలారిస్ టైటానియం రంగుల్లో లభిస్తుంది. లాంచ్ ఆఫర్ కింద అన్ని ప్రధాన బ్యాంక్ కార్డులపై రూ.500 తక్షణ తగ్గింపు అందిస్తున్నారు. దీంతో బేస్ వేరియంట్‌ను రూ.11,999 ధరకు కొనుగోలు చేయవచ్చు.

Advertisement
Advertisement