Oppo A6c | బడ్జెట్ ధరకే ఒప్పో నుంచి కొత్త ఫోన్.. భారీ బ్యాటరీతో..
Oppo A6c | మొబైల్స్ తయారీ సంస్థ ఒప్పో తన నూతన స్మార్ట్ ఫోన్ ఒప్పో ఎ6సిని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఎ సిరీస్‌లో కొత్తగా వచ్చిన స్మార్ట్ ఫోన్ ఇదే కాగా బడ్జెట్ ఫోన్ విభాగంలో ఇది అందరినీ ఆకర్షిస్తోంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందించారు. ఈ ఫోన్‌ను రెండు ర్యామ్, స్టోరేజ్ వేరియెంట్లలో లాంచ్ చేశారు.
Technology | Published On May 26, 2026, 10.50 am IST
Oppo A6c | మొబైల్స్ తయారీ సంస్థ ఒప్పో తన నూతన స్మార్ట్ ఫోన్ ఒప్పో ఎ6సిని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఎ సిరీస్‌లో కొత్తగా వచ్చిన స్మార్ట్ ఫోన్ ఇదే కాగా బడ్జెట్ ఫోన్ విభాగంలో ఇది అందరినీ ఆకర్షిస్తోంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందించారు. ఈ ఫోన్‌ను రెండు ర్యామ్, స్టోరేజ్ వేరియెంట్లలో లాంచ్ చేశారు. రెండు కలర్ ఆప్షన్‌లలో లభిస్తోంది. ఈ ఫోన్‌లో యూనిసోక్ చిప్ సెట్, 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌లను అందించారు. డ్యుయల్ రియర్ కెమెరా సెటప్‌ను వెనుక వైపు ఇచ్చారు. 13 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో ప్రధాన హైలైట్ దీని బ్యాటరీ. ఇందులో 7000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ కలిగిన బ్యాటరీని ఇచ్చారు. అందువల్ల బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా వస్తుంది. అలాగే 15 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ అందించినందున ఫోన్‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు.
స్పెసిఫికేషన్ల వివరాలు..
ఇందులో డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. 6.75 ఇంచుల ఎల్‌డీసీ డిస్‌ప్లే ఉంది. ఇది హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను ఇచ్చారు. అందువల్ల డిస్‌ప్లే క్వాలిటీగా ఉంటుంది. ఔట్ డోర్ విజిబిలిటీ కోసం 900 నిట్స్ పీక్ బ్రైట్ నెస్‌ను ఇచ్చారు. ఐపీ64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ సైతం ఉంది. 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లను ఇచ్చారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ముందు వైపు 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను అందించారు. యూఎస్‌బీ టైప్ సి ద్వారా చార్జింగ్ చేసుకోవచ్చు. 4జీ, వైఫై 5, బ్లూటూత్ 5.2 కనెక్టివిటీ సదుపాయాలు ఉన్నాయి.
ధర ఎంతంటే..
ఒప్పో ఎ6సి ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.13,999గా ఉంది. 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.16,999గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ను ఒప్పో ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు రిటెయిల్ భాగస్వామ్య ఆఫ్ లైన్ స్టోర్స్ లో విక్రయిస్తున్నారు.
సంబంధిత వార్తలు

realme 16x 5G | 7000 ఎంఏహెచ్ బ్యాటరీ, పవర్ఫుల్ డిస్‌ప్లే.. రియల్‌మి 16ఎక్స్ 5జి ఫోన్ లాంచ్..
ఆగస్టు 12, 2026

Infinix Smart 20 | పవర్ఫుల్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో లాంచ్ అయిన ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 ఫోన్.. ధర ఎంతంటే..?
జూన్ 8, 2026

moto g37 and g37 Power | భారత్‌లో లాంచ్ అయిన మోటో జి37 సిరీస్.. భారీ బ్యాటరీతో అదిరిపోయిన ఫీచర్లు..
మే 19, 2026
తాజావార్తలు
- ●Padi Kaushik Reddy | బెదిరిస్తే బెదరడానికి సిద్ధంగా లేను.. పొంగులేటికి పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరిక
- ●Ayushman Card | ఇంటి నుంచే ఆయుష్మాన్ కార్డు.. వాట్సాప్‌లో ఇలా పొందండి..
- ●Hospital Room Cost | ప్రైవేట్ ఆసుపత్రి గది అద్దె త్రీస్టార్ హోటల్ రేటుకు మించకూడదు.. పార్లమెంటరీ కమిటీ కీలక సిఫార్సు
- ●Khushi Kapoor | బాలీవుడ్ హీరోయిన్ ఆ వీడియోలపై ఢిల్లీ హైకోర్టు సీరియస్.. వెంటనే తొలగించాలంటూ ఆదేశాలు
- ●Telangana | బీసీ మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లు.. రేపే పథకం ప్రారంభం
- ●Amit Shah | నీట్ అంశంపై చర్చ.. స్పీకర్ ఓం బిర్లాకు అమిత్ షా లేఖ

Padi Kaushik Reddy | బెదిరిస్తే బెదరడానికి సిద్ధంగా లేను.. పొంగులేటికి పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరిక

Ayushman Card | ఇంటి నుంచే ఆయుష్మాన్ కార్డు.. వాట్సాప్‌లో ఇలా పొందండి..

Hospital Room Cost | ప్రైవేట్ ఆసుపత్రి గది అద్దె త్రీస్టార్ హోటల్ రేటుకు మించకూడదు.. పార్లమెంటరీ కమిటీ కీలక సిఫార్సు

Khushi Kapoor | బాలీవుడ్ హీరోయిన్ ఆ వీడియోలపై ఢిల్లీ హైకోర్టు సీరియస్.. వెంటనే తొలగించాలంటూ ఆదేశాలు



