త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Youtube | నిలిచిపోయిన యూట్యూబ్ సేవ‌లు.. ప‌నిచేయ‌ని యాప్‌, వెబ్‌సైట్‌..

Youtube | టెక్ దిగ్గ‌జం గూగుల్‌కు చెందిన యూట్యూబ్ సేవ‌లు ప్ర‌పంచ వ్యాప్తంగా నిలిచిపోయాయి. భార‌త కాల‌మానం ప్ర‌కారం బుధ‌వారం (ఫిబ్ర‌వ‌రి 18, 2026) తెల్ల‌వారుజాము నుంచే యూట్యూబ్ ప‌నిచేయట్లేదు. యూట్యూబ్‌కు చెందిన యాప్‌, వెబ్‌సైట్‌ల‌ను ఓపెన్ చేస్తే ఖాళీ పేజీ లేదా Something Went Wrong అనే ఎర్ర‌ర్ మెసేజ్ ద‌ర్శ‌న‌మిస్తోంది.

S

Technology | Published On Feb 18, 2026, 7.16 am IST

Youtube | నిలిచిపోయిన యూట్యూబ్ సేవ‌లు.. ప‌నిచేయ‌ని యాప్‌, వెబ్‌సైట్‌..
Advertisement

Youtube | టెక్ దిగ్గ‌జం గూగుల్‌కు చెందిన యూట్యూబ్ సేవ‌లు ప్ర‌పంచ వ్యాప్తంగా నిలిచిపోయాయి. భార‌త కాల‌మానం ప్ర‌కారం బుధ‌వారం (ఫిబ్ర‌వ‌రి 18, 2026) తెల్ల‌వారుజాము నుంచే యూట్యూబ్ ప‌నిచేయట్లేదు. యూట్యూబ్‌కు చెందిన యాప్‌, వెబ్‌సైట్‌ల‌ను ఓపెన్ చేస్తే ఖాళీ పేజీ లేదా Something Went Wrong అనే ఎర్ర‌ర్ మెసేజ్ ద‌ర్శ‌న‌మిస్తోంది. అమెరికా స‌హా ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ప్ర‌స్తుతం యూట్యూబ్ రావ‌ట్లేద‌ని యూజ‌ర్లు సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. గ‌త 2-3 గంట‌ల నుంచి యూట్యూబ్ ప‌నిచేయ‌డం లేద‌ని వారు ఎక్స్‌తోపాటు డౌన్ డిటెక్ట‌ర్ వెబ్ సైట్‌లోనూ కామెంట్లు పెడుతున్నారు. కేవ‌లం అమెరికాలోనే యూట్యూబ్‌పై డౌన్ డిటెక్ట‌ర్‌లో ఏకంగా 2.80 ల‌క్ష‌ల మంది ఫిర్యాదు చేశారు.

అయితే త‌మ సేవ‌లు నిలిచిపోయిన విష‌యంపై యూట్యూబ్ లేదా దాని మాతృసంస్థ గూగుల్ ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. ఇక ఫిర్యాదులు చేస్తున్న చాలా మంది యూజ‌ర్లు త‌మ‌కు హోమ్ పేజీ ఖాళీగా క‌నిపిస్తుందని, త‌మ ఫోన్ల‌లో యూట్యూబ్ అకౌంట్ లాగౌట్ అయింద‌ని చెబుతుండ‌గా, కొంద‌రు మాత్రం త‌మ‌కు ఎర్ర‌ర్ మెసేజ్ క‌నిపిస్తుంద‌ని, రీఫ్రెష్ చేసినా రావ‌డం లేద‌ని చెప్పారు. ఇక కొంద‌రు మాత్రం వీడియోల‌ను చూడ‌డంలో ఇబ్బందులు ఏర్ప‌డుతున్నాయ‌ని తెలిపారు. కాగా ఇటీవ‌లే సోష‌ల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ సేవ‌ల‌కు కూడా కాసేపు అంత‌రాయం ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇప్పుడు తాజాగా యూట్యూబ్ సేవ‌లు నిలిచిపోవ‌డం గ‌మ‌నార్హం.

Advertisement

తాజావార్తలు

Advertisement