Priyanka Chopra | ఆస్కార్ బరిలో ప్రియాంక చోప్రా షార్ట్ ఫిల్మ్ – ఏఐ వల్ల ఉద్యోగాలు పోతే!
ప్రియాంక చోప్రా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన వీ వర్ హియన్ అనే షార్ట్ ఫిల్మ్ ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది. ఉద్యోగాలు, మానవ శ్రమపై ఏఐ ప్రభావం అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ షార్ట్ ఫిల్మ్ లైవ్ యాక్షన్ కేటగిరీలో ఆస్కార్ రేసులో నిలిచింది. ప్రణవ్ భాసిన్ ఈ షార్ట్ ఫిల్మ్ కు దర్శకత్వం వహించాడు.
Entertainment | Published On Nov 1, 2026, 4.09 pm IST
Priyanka Chopra | ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అంతే నష్టాలు ఎదురవుతున్నాయి. ఏఐ కారణంగా లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. భవిష్యత్తులో ఏఐ ప్రభావం అన్ని రంగాలపై పడబోతుందనే భయాలు వ్యక్తమవుతోన్నాయి. మానవ శ్రమ, ఉద్యోగాలు ఏఐ ప్రభావంతో వీ వర్ హియర్ పేరుతో ఓ షార్ట్‌ఫిల్మ్ రూపొందింది. ప్రణవ్ భాసిన్ దర్శకత్వం వహించిన ఈ షార్ట్ ఫిల్మ్ ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది. వచ్చే ఏడాది ఆస్కార్ అవార్డుల కోసం లైవ్ యాక్షన్ షార్ట్ కేటగిరీలో ఎంపికైంది.
ఆస్కార్ ప్రమోషన్స్...
ఈ ఆస్కార్ నామినేట్ షార్ట్‌ఫిల్మ్‌లో ప్రియాంక చోప్రా భాగమైంది. అయితే నటిగా కాదు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించింది. ఈ షార్ట్ ఫిల్మ్ ఆస్కార్ ప్రమోషన్స్ బాధ్యతను ప్రియాంక చోప్రా చేపట్టబోతున్నది. సెటైరికల్ కామెడీ కథతో ప్రణవ్ భాసిన్ తెరకెక్కించిన ఈ షార్ట్ ఫిల్మ్ ఇప్పటివరకు ఎనభైకిపైగా వివిధ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో స్క్రీనింగ్‌కు ఎంపికైంది. ఇరవైకిపైగా అవార్డులను దక్కించుకుంది.
ఏఐ ప్రభావం...
ఏఐ ప్రభావం ఉద్యోగాలపై ఎలా పడుతుందనే కాన్సెప్ట్‌తో వీ వర్ హియర్ షార్ట్‌ఫిల్మ్ రూపొందింది. ఏఐ వాడకాన్ని నిషేధించాలని, మానవ శ్రమనే వాడుకోవాలని ముగ్గురు వృద్ధులు వినూత్న నిరసన చేపడుతారు. అదే టైమ్‌లో ఓ వృద్ధుడి కొడుకుకు ఏఐ కంపెనీలో ఉద్యోగం వస్తుంది. తండ్రి చేత నిరసన మాన్పిస్తేనే కొడుకు ఉద్యోగం కన్ఫామ్ అయ్యే పరిస్థితి నెలకొంటుంది. ఆ తర్వాత ఏమైంది? వృద్ధుల నిరసన ఆగిపోయిందా? లేదా అనే అంశాలను వ్యంగ్యంగా ఈ షార్ట్ ఫిల్మ్ లో ఆవిష్కరించారు డైరెక్టర్. ది న్యూయార్కర్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో ఈ షార్ట్ ఫిల్మ్ ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Amit Shah | బాధితుల గాయాలపై కారం చల్లడమేనా?
- ●Harish Rao | పీటీ స్వామి సేవలు చిరస్మరణీయం
- ●Vande Bharat Sleeper | బెంగళూరు–ముంబయి మధ్య వందే భారత్ స్లీపర్
- ●Godavari Maha Aarti Nashik | నాసిక్‌లో సరికొత్త చరిత్ర: 6,233 మంది గిరిజనుల గోదావరి మహా హారతి.. రాష్ట్రపతి సమక్షంలో గిన్నిస్ రికార్డ్!
- ●Malayalam OTT | ఇరుముడి టీచర్ మలయాళం సర్వైవల్ థ్రిల్లర్ మూవీ - ఒక్క రాత్రిలో జరిగే కథ
- ●India GST Collection October | రికార్డు సృష్టించిన అక్టోబర్ జీఎస్టీ కలెక్షన్లు: రూ.2.31 లక్షల కోట్లు వసూలు.. తెలంగాణ వాటా ఇదే!

Amit Shah | బాధితుల గాయాలపై కారం చల్లడమేనా?

Harish Rao | పీటీ స్వామి సేవలు చిరస్మరణీయం

Vande Bharat Sleeper | బెంగళూరు–ముంబయి మధ్య వందే భారత్ స్లీపర్

Godavari Maha Aarti Nashik | నాసిక్‌లో సరికొత్త చరిత్ర: 6,233 మంది గిరిజనుల గోదావరి మహా హారతి.. రాష్ట్రపతి సమక్షంలో గిన్నిస్ రికార్డ్!






