త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

YouTube Picture-in-Picture | యూట్యూబ్‌లో బిగ్ అప్‌డేట్‌.. ప్రీమియం పీఐపీ ఫీచ‌ర్ ఇక అంద‌రికీ..

YouTube Picture-in-Picture | టెక్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ త‌న యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌కు బిగ్ అప్‌డేట్‌ను తీసుకువ‌చ్చింది. ఇప్పటి వ‌ర‌కు కేవ‌లం ప్రీమియం యూజ‌ర్ల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉన్న పిక్చ‌ర్‌-ఇన్‌-పిక్చ‌ర్ (PiP) ఫీచ‌ర్‌ను ఫ్రీ యూజ‌ర్లంద‌రికీ ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

S

Technology | Published On May 1, 2026, 2.55 pm IST

YouTube Picture-in-Picture | యూట్యూబ్‌లో బిగ్ అప్‌డేట్‌.. ప్రీమియం పీఐపీ ఫీచ‌ర్ ఇక అంద‌రికీ..
Advertisement

YouTube Picture-in-Picture | టెక్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ త‌న యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌కు బిగ్ అప్‌డేట్‌ను తీసుకువ‌చ్చింది. ఇప్పటి వ‌ర‌కు కేవ‌లం ప్రీమియం యూజ‌ర్ల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉన్న పిక్చ‌ర్‌-ఇన్‌-పిక్చ‌ర్ (PiP) ఫీచ‌ర్‌ను ఫ్రీ యూజ‌ర్లంద‌రికీ ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా యూట్యూబ్‌ను ఎలాంటి స‌బ్‌స్క్రిప్ష‌న్ లేకుండా ఉచితంగా వాడుతున్న యూజ‌ర్లు కూడా దీన్ని ప్ర‌స్తుతం ఉప‌యోగించుకోవ‌చ్చు. ఈ ఫీచ‌ర్‌ను యూజ‌ర్ల‌కు ద‌శ‌లవారీగా అందుబాటులోకి తేనున్నామ‌ని యూట్యూబ్ ప్ర‌క‌టించింది. ఈ ఫీచ‌ర్ స‌హాయంతో యూజ‌ర్లు త‌మ ఫోన్‌లో ఇత‌ర యాప్‌ల‌ను ఉప‌యోగిస్తూనే యూట్యూబ్ వీడియోల‌ను చిన్న ఫ్లోటింగ్ విండోలో కొన‌సాగిస్తూ చూడ‌వ‌చ్చు.

యూట్యూబ్ యాప్‌ను మూసినా..

పిక్చ‌ర్‌-ఇన్‌-పిక్చ‌ర్ ఫీచ‌ర్ వ‌ల్ల యూట్యూబ్ యాప్‌ను మూసినా వీడియో ప్లే బ్యాక్ ఆగ‌కుండా చిన్న విండోలో కొన‌సాగుతూనే ఉంటుంది. ఈ విండోను ఫోన్ స్క్రీన్ పై ఎక్క‌డా క‌దిలించ‌వ‌చ్చు. అలాగే విండో సైజ్ ను మార్చుకోవ‌చ్చు. విండోపై ట్యాప్ చేస్తే ప్లే లేదా పాజ్ కంట్రోల్స్ అందుబాటులోకి వ‌స్తాయి. అలాగే మ‌ళ్లీ పూర్తి యాప్ కు తిరిగి వెళ్లే అవ‌కాశం ఉంటుంది. దీని వ‌ల్ల డివైస్‌లో ఇత‌ర యాప్ ల‌ను ఉప‌యోగిస్తున్న‌ప్ప‌టికీ వీడియోల‌ను ఎలాంటి అంత‌రాయం లేకుండా చూడ‌వ‌చ్చు. యాప్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన వెంట‌నే ఈ ఫీచ‌ర్ ఎనేబుల్ అయి ఉంటే ఆటోమేటిక్‌గా పీఐపీ యాక్టివేట్ అవుతుంది. దీంతో ఇత‌ర యాప్‌ల‌లో ప‌నిచేస్తూనే తెర‌పై మ‌రో చిన్న విండోలో యూట్యూబ్ వీడియోల‌ను వీక్షించ‌వ‌చ్చు.

నాన్ ప్రీమియం, ప్రీమియం యూజ‌ర్ల‌కు ఇలా..

ఈ ఫీచ‌ర్‌ను ప్ర‌స్తుతం యూట్యూబ్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న వినియోగ‌దారులంద‌రికీ ద‌శ‌ల‌వారీగా అందుబాటులోకి తెస్తోంది. అందువ‌ల్ల ఈ ఫీచ‌ర్‌ను యూట్యూబ్ యాప్‌లో ఎప్ప‌టిక‌ప్పుడు చెక్ చేసుకోవ‌డం మంచిది. ఇక ఐఫోన్‌, ఐప్యాడ్ యూజ‌ర్ల‌కు ఇది ప‌నిచేయాలంటే వారి డివైస్ ఓఎస్ వెర్ష‌న్ ఐఓఎస్ 15 లేదా అంత‌క‌న్నా ఎక్కువ ఉండాలి. ఇక అమెరికాలో ఉన్న నాన్ ప్రీమియం యూజ‌ర్లు ఇప్ప‌టికే ఈ ఫీచ‌ర్‌ను ఉప‌యోగిస్తున్నారు. అందువ‌ల్ల వారికి ఎలాంటి మార్పు లేదు. ఇత‌ర దేశాల యూజ‌ర్లు నాన్ ప్రీమియం అయితే వారు లాంగ్ ఫామ్‌, నాన్ మ్యూజిక్ కంటెంట్ కు పీఐపీ మోడ్ పొంద‌వ్చు. ఇక యూట్యూబ్ ప్రీమియం లైట్ ప్లాన్ ఉన్న‌వారికి కూడా ఇదే ఫీచ‌ర్ వ‌ర్తిస్తుంది. అలాగే ప్రీమియం యూజ‌ర్ల‌కు మ్యూజిక్‌, నాన్ మ్యూజిక్ కంటెంట్ రెండింటికీ పీఐపీ స‌పోర్ట్ ల‌భిస్తుంది. ప్రీమియం యూజ‌ర్లు పీఐపీ విండోను క్లోజ్ చేసిన తర్వాత కూడా బ్యాక్‌గ్రౌండ్ ప్లే మోడ్‌లో వీడియోకు చెందిన ఆడియోను వినవచ్చు.

మ్యూజిక్ కంటెంట్ అయితే..

నాన్-ప్రీమియం యూజర్లకు మ్యూజిక్‌కు సంబంధించిన కంటెంట్‌పై పీఐపీ అందుబాటులో ఉండదు. ఇందులో అధికారిక మ్యూజిక్ వీడియోలు, ఆర్ట్ ట్రాక్స్, పిల్లల పాటలు, యూజర్ జనరేటెడ్ మ్యూజిక్ కంటెంట్ కూడా ఉన్నాయి. పిక్చర్-ఇన్-పిక్చర్ విస్తరణతో యూట్యూబ్ త‌న యూజర్లకు మరింత సౌకర్యవంతమైన అనుభవాన్ని అందిస్తోంది. ముఖ్యంగా మల్టీటాస్కింగ్ చేసే యూజర్లకు ఇది ఉపయోగకరమైన ఫీచర్‌గా మారనుంది.

Advertisement
Advertisement