త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

YouTube | యూట్యూబ్‌లో వీడియోలకు కొత్త లేబుల్స్.. ఏఐ కంటెంట్ అయితే వెంట‌నే చెప్పేస్తుంది..

YouTube | టెక్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ త‌న యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌లో ప‌లు కీల‌క మార్పుల‌ను చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. కొత్త‌గా ఏఐ డిస్క్లోజర్ అనే మార్పును ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్లు తెలిపింది. యూట్యూబ్‌లో వీడియోల‌ను చూసే ప్రేక్ష‌కుల‌కు మ‌రింత పార‌ద‌ర్శ‌క‌త అందించ‌డంతోపాటు క్రియేట‌ర్ల‌కు సుల‌భ‌మైన డిస్క్లోజర్ విధానం క‌ల్పించేందుకే ఈ కొత్త అప్‌డేట్ల‌ను ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు గూగుల్ తెలిపింది.

S

Technology | Published On May 28, 2026, 12.50 pm IST

YouTube | యూట్యూబ్‌లో వీడియోలకు కొత్త లేబుల్స్.. ఏఐ కంటెంట్ అయితే వెంట‌నే చెప్పేస్తుంది..
Advertisement

YouTube | టెక్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ త‌న యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌లో ప‌లు కీల‌క మార్పుల‌ను చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. కొత్త‌గా ఏఐ డిస్క్లోజర్ అనే మార్పును ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్లు తెలిపింది. యూట్యూబ్‌లో వీడియోల‌ను చూసే ప్రేక్ష‌కుల‌కు మ‌రింత పార‌ద‌ర్శ‌క‌త అందించ‌డంతోపాటు క్రియేట‌ర్ల‌కు సుల‌భ‌మైన డిస్క్లోజర్ విధానం క‌ల్పించేందుకే ఈ కొత్త అప్‌డేట్ల‌ను ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు గూగుల్ తెలిపింది. 2024లో మొదటిసారిగా యూట్యూబ్ ఏఐ డిస్క్లోజర్ లేబుల్స్‌ను ప్రవేశపెట్టింది. రియలిస్టిక్ ఏఐ టూల్స్ ఉపయోగించి సృష్టించిన వీడియోలు లేదా ఏఐతో మార్పులు చేసిన కంటెంట్‌పై క్రియేటర్లు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాల్సి వచ్చింది. అయితే వినియోగదారుల అభిప్రాయాల ప్రకారం, ఏఐతో రూపొందించిన లేదా మార్చిన వీడియోలకు సంబంధించిన సమాచారం మరింత స్పష్టంగా, సులభంగా కనిపించాలని ప్రేక్షకులు కోరుతున్నట్లు కంపెనీ తెలిపింది.

మ‌రింత స్ప‌ష్టంగా లేబుల్స్‌..

కొత్త మార్పుల వ‌ల్ల ఫోటోరియలిస్టిక్ లేదా గణనీయంగా ఏఐతో రూపొందించిన కంటెంట్‌కు సంబంధించిన లేబుల్స్ ఇప్పుడు మరింత స్పష్టంగా కనిపించే ప్రదేశానికి మారుతాయి. లాంగ్-ఫార్మ్ వీడియోల్లో ఈ లేబుల్ ఇకపై వీడియో ప్లేయర్ కింద, డిస్క్రిప్షన్ సెక్షన్ పైన కనిపిస్తుంది. ఇక యూట్యూబ్ షార్ట్స్ వీడియోల్లో ఈ లేబుల్ వీడియోపైనే ఓవర్‌లేగా కనిపించనుంది. ఇకపై ప్లాట్‌ఫామ్‌లో రియలిస్టిక్ ఏఐ జనరేటెడ్ లేదా భారీగా ఏఐతో మార్చిన కంటెంట్‌కు ఇదే స్టాండర్డ్ డిస్క్లోజర్ ఫార్మాట్‌ అమలులో ఉండనుందని యూట్యూబ్ పేర్కొంది. అయితే పూర్తిగా అవాస్తవిక, యానిమేటెడ్ లేదా స్వల్పంగా మాత్రమే మార్పులు చేసిన కంటెంట్‌కు సంబంధించిన ఏఐ డిస్క్లోజర్లు పాత విధంగానే ఎక్స్‌పాండెడ్ డిస్క్రిప్షన్ సెక్షన్‌లోనే కనిపిస్తాయి. యూట్యూబ్ మరో కీలక అప్‌డేట్‌గా కొత్త ఇంటర్నల్ డిటెక్షన్ సిగ్నల్స్‌ను కూడా ప్రవేశపెడుతోంది. ఇవి ఫోటోరియలిస్టిక్ ఏఐ జనరేటెడ్ వీడియోలను ఆటోమేటిక్‌గా గుర్తించేందుకు ఉపయోగపడతాయి.

క్రియేట‌ర్లు మాన్యువ‌ల్‌గా తెల‌పాలి..

ప్రస్తుతం క్రియేటర్లు తమ వీడియోల్లో ఏఐ వినియోగాన్ని మాన్యువల్‌గా ప్రకటించాల్సి ఉంటుంది. అయితే యూట్యూబ్ సిస్టమ్‌లు గణనీయమైన ఏఐ కంటెంట్‌ను గుర్తించి, క్రియేటర్ డిస్క్లోజర్ ఇవ్వకపోతే ప్లాట్‌ఫామ్ స్వయంగా లేబుల్ జత చేస్తుంది. అయినా ఎక్కువ సందర్భాల్లో డిస్క్లోజర్ సెట్టింగ్స్‌పై క్రియేటర్లకే నియంత్రణ ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. ఒకవేళ వీడియోను తప్పుగా ఏఐ జనరేటెడ్‌గా గుర్తించారని భావిస్తే, యూట్యూబ్ స్టూడియో ద్వారా క్రియేటర్లు మాన్యువల్‌గా డిస్క్లోజర్ స్టేటస్‌ను మార్చుకోవచ్చు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం ఏఐ డిస్క్లోజర్లు శాశ్వతంగా కొనసాగుతాయని యూట్యూబ్ తెలిపింది. అందులో ముఖ్యంగా యూట్యూబ్ ఏఐ టూల్స్ అయిన వియో లేదా డ్రీమ స్క్రీన్ ఉపయోగించి రూపొందించిన కంటెంట్, వీడియో పూర్తిగా ఏఐతో తయారైందని సూచించే సీ2పీఏ మెటాడేటా కలిగిన కంటెంట్ లాంటి వీడియోలకు లేబుల్స్ తొలగించే అవకాశం ఉండదు.

ఆదాయం, విజిబిలిటీపై ప్రభావం ఉండ‌దు..

ఏఐ డిస్క్లోజర్ లేబుల్స్ వల్ల వీడియోల రికమెండేషన్లు లేదా ఆదాయంపై ఎలాంటి ప్రభావం ఉండదని యూట్యూబ్ స్పష్టం చేసింది. క్రియేటర్లు సంపాదించే రెవెన్యూ లేదా వీడియోల విజిబిలిటీపై ఈ లేబుల్స్ ప్రభావం చూపవని తెలిపింది. వీక్షకులకు స్పష్టమైన సమాచారం అందించడంతోపాటు క్రియేటర్లకు నియంత్రణ కొనసాగించేలా ఈ మార్పులు రూపొందించామని కంపెనీ పేర్కొంది. వీడియోలు, షార్ట్స్‌లో కొత్త డిస్క్లోజర్ లేబుల్ ప్లేస్‌మెంట్ ఇప్పటికే దశలవారీగా అమలులోకి వస్తోందని యూట్యూబ్ తెలిపింది. అలాగే ఆటోమేటిక్ ఏఐ కంటెంట్ డిటెక్షన్, ఆటో-లేబెలింగ్ టూల్స్ మ‌రో వారం రోజుల్లో దశలవారీగా అందుబాటులోకి వస్తాయని కంపెనీ వెల్లడించింది.

Advertisement
Advertisement