Suriya | సూర్య స్ట్రెయిట్ తెలుగు మూవీపై క్రేజీ అప్‌డేట్ – విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ డేట్ ఫిక్స్
సూర్య తెలుగు స్ట్రెయిట్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది. ఆగస్ట్ 14న వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఫ్యామిలీ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు.
Entertainment | Published On May 28, 2026, 12.54 pm IST
Suriya | కరుప్పు మూవీతో హీరోగా అదిరిపొయే కమ్‌బ్యాక్ ఇచ్చాడు సూర్య. ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ థియేటర్లలో 200 కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. తెలుగులోనూ వీరభద్రుడు పేరుతో డబ్ అయిన ఈ సినిమా నిర్మాతలకు భారీగా లాభాలను తెచ్చిపెట్టింది. కరుప్పు మూవీతో లాంగ్ గ్యాప్ తర్వాత సూర్యకు పెద్ద హిట్టు దక్కడంతో అతడి అభిమానులు ఖుషి అవుతున్నారు. ఈ సక్సెస్ జోష్‌లోనే సూర్య తెలుగు మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్‌పై క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమా రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది.
స్టైలిష్ లుక్‌లో...
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న విశ్వనాథ్ అండ్ సన్స్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 14న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలోకి రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఓ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. వర్షంలో గొడుగు పట్టుకొని మొబైల్ చెక్ చేస్తూ స్టైలిష్ లుక్‌లో సూర్య కనిపిస్తున్నారు.
వెంకీ అట్లూరి డైరెక్టర్...
విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. లక్కీ భాస్కర్ తర్వాత వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో వస్తోన్న మూవీ కావడం...సూర్య హీరోగా నటిస్తోండటంతో విశ్వనాథ్ అండ్ సన్స్‌పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. మాస్ ఎలిమెంట్స్ లేకుండా కంప్లీట్ హ్యూమరస్ టచ్‌తో ఇందులో సూర్య రోల్ సాగుతుందని సమాచారం. గత సినిమాలకు భిన్నంగా ఫ్యామిలీ మ్యాన్‌గా దర్శకుడు వెంకీ అట్లూరి ఈ కోలీవుడ్ హీరోను ఆవిష్కరించబోతున్నట్లు చెబుతోన్నారు. ఈ సినిమాను సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
మమితా బైజు హీరోయిన్...
విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీలో సూర్యకు జోడీగా మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జీవీ. ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. రామ్‌గోపాల్ వర్మ రక్త చరిత్ర 2 తర్వాత సూర్య హీరోగా నటిస్తోన్న స్ట్రెయిట్ తెలుగు మూవీ ఇదే కావడం గమనార్హం.
సంబంధిత వార్తలు

Agadha Movie | బోనమెత్తిన హీరోయిన్.. బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన కామాక్షి భాస్కర్ల
జులై 26, 2026

Ram Charan | రామ్‌చరణ్‌కు సర్జరీ – కోయంబత్తూరుకు మెగా ఫ్యామిలీ – ఆర్సీ 17 షూటింగ్ ఆలస్యం?
జులై 26, 2026

Chiranjeevi | మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్ – గబ్బర్‌సింగ్ నటుడికి ఆర్థిక సాయం
జులై 26, 2026
తాజావార్తలు
- ●Mumbai Cop Vinod Kalukhe | సీజేపీ ఆందోళనల్లో స్పెషల్ అట్రాక్షన్: ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ముంబై 'పూకీ' కాప్.. ఇతని స్టోరీ ఇదే!
- ●Agadha Movie | బోనమెత్తిన హీరోయిన్.. బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన కామాక్షి భాస్కర్ల
- ●Serial Actress | మోడ్రన్ లుక్‌లో గుండె నిండా గుడి గంటలు మీనా
- ●PM Modi Exam Reforms | ఎగ్జామ్ పేపర్ లీక్స్‌కు చెక్: రంగంలోకి నందన్ నిలేకని.. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ!
- ●Vaibhav Suryavanshi | మళ్లీ చితక్కొట్టిన వైభవ్.. టీ20ల్లో అరుదైన చరిత్ర సృష్టించిన సూర్యవంశీ
- ●Rasha Thadani | అమ్మ స్టార్ హీరోయిన్ - నాన్న పెద్ద ప్రొడ్యూసర్ - శ్రీనివాస మంగాపురం హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ ఇదే!

Mumbai Cop Vinod Kalukhe | సీజేపీ ఆందోళనల్లో స్పెషల్ అట్రాక్షన్: ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ముంబై 'పూకీ' కాప్.. ఇతని స్టోరీ ఇదే!

Agadha Movie | బోనమెత్తిన హీరోయిన్.. బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన కామాక్షి భాస్కర్ల

Serial Actress | మోడ్రన్ లుక్‌లో గుండె నిండా గుడి గంటలు మీనా

PM Modi Exam Reforms | ఎగ్జామ్ పేపర్ లీక్స్‌కు చెక్: రంగంలోకి నందన్ నిలేకని.. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ!



