త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ironing Prices | బెంగ‌ళూరులో ఇస్త్రీ ధ‌ర‌లు చూసి షాకైన నోయిడా వ్యాపారి

Ironing Prices | బెంగ‌ళూరు (Bengaluru)లో బ‌ట్ట‌ల ఇస్త్రీ ధ‌ర‌లు (Ironing Prices) ఇప్పుడు నెట్టింట హాట్‌టాపిక్ అవుతున్నాయి. నోయిడాతో పోలిస్తే బెంగ‌ళూరులో ఇస్త్రీ ధ‌ర‌లు చాలా ఎక్కువ‌గా ఉన్నాయంటూ స‌జిత్ పాయ్ అనే వెంచ‌ర్ క్యాపిట‌లిస్ట్ పెట్టిన పోస్టు వైర‌ల్ అవుతోంది.

D

National | Published On May 28, 2026, 12.59 pm IST

Ironing Prices | బెంగ‌ళూరులో ఇస్త్రీ ధ‌ర‌లు చూసి షాకైన నోయిడా వ్యాపారి
Advertisement

Ironing Prices | దేశంలోని ప్ర‌ధాన మెట్రో న‌గ‌రాల్లో జీవ‌న వ్య‌యం నానాటికీ పెరిగిపోతోంది. ఇంటి అద్దెలు, నిత్యావ‌స‌ర ధ‌ర‌లు ఆకాశాన్నంటుతున్నాయి. ఆయా న‌గ‌రాల్లో ఏప‌నైనా ఖ‌ర్చుతో కూడుకున్న‌దే. తాజాగా బెంగ‌ళూరు (Bengaluru)లో బ‌ట్ట‌ల ఇస్త్రీ ధ‌ర‌లు (Ironing Prices) ఇప్పుడు నెట్టింట హాట్‌టాపిక్ అవుతున్నాయి.

స‌జిత్ పాయ్ అనే వెంచ‌ర్ క్యాపిట‌లిస్ట్ ఇటీవ‌లే నోయిడా నుంచి బెంగ‌ళూరుకు మారారు. ప్ర‌స్తుతం ఇందిరాన‌గ‌ర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. అయితే, అక్క‌డ లాండ్రీ సేవ‌ల ధ‌ర‌లు చూసి అత‌డు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశాడు. నోయిడాతో పోలిస్తే బెంగ‌ళూరులో ఇస్త్రీ ధ‌ర‌లు చాలా ఎక్కువ‌గా ఉన్నాయంటూ అత‌డు సోష‌ల్ మీడియాలో పెట్టిన పోస్టు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. తాను నోయిడాలో ఉన్న‌ప్పుడు ఒక క్లాత్ ఇస్త్రీ చేసేందుకు రూ.5 చెల్లించేవాడిన‌ని తెలిపాడు. అయితే, బెంగ‌ళూరులో మాత్రం రూ.20 ఉందని పేర్కొన్నాడు.

"నేను ఈ నెల ప్రారంభంలో బెంగళూరుకు మారాను. ఇక్కడ నన్ను అత్యంత ఆశ్చర్యపరిచిన విషయాల్లో లాండ్రీ సేవ‌లు ఒక‌టి. నోయిడాలో ఒక బట్ట ముక్క‌ను ఇస్త్రీ చేసేందుకు రూ.5 తీసుకునేవాళ్లు. అది త‌క్కువే. బెంగ‌ళూరులో దానికంటే కాస్త ఎక్కువ‌గానే ఉంటుంద‌ని ముందే ఊహించా. కానీ ఇంత ఎక్కువ‌గా ఉంటుంద‌ని అనుకోలేదు. బెంగ‌ళూరులోని ఇందిరా న‌గ‌ర్‌లో ఒక జ‌త డ్రెస్ ఐర‌న్ చేసేందుకు రూ.12 నుంచి రూ.20 తీసుకోవ‌డం న‌న్ను ఆశ్చర్యపరిచింది" అని అత‌డు త‌న పోస్టులో రాసుకొచ్చాడు. ప్ర‌స్తుతం ఈ పోస్టు నెట్టింట వైర‌ల్‌గా మారింది.

అంతేకాదు, ఈ పెరుగుద‌ల‌కు కార‌ణాల‌ను కూడా ఆయ‌న విశ్లేషించాడు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతాల్లో ఇస్త్రీ చేసేవారు ఎక్కువగా బొగ్గుతో నడిచే ఐరన్ బాక్సులను వాడతారని, కానీ బెంగళూరులో మాత్రం ఎల్పీజీ గ్యాస్‌తో నడిచే ఐరన్ బాక్సులను వినియోగిస్తున్నారని, బహుశా ఇదే అధిక ధరలకు కారణం కావచ్చని అభిప్రాయపడ్డారు. దీనిపై నెటిజ‌న్లు భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Advertisement
Advertisement