Meta | పెయిడ్ ప్లాన్లను ప్రకటించిన మెటా.. ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్‌బుక్‌లకు ప్రీమియం ఫీచర్లు..
Meta | సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) తన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ సేవల కోసం కొత్త పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్‌ను ప్రకటించింది. ప్రీమియం ఫీచర్లు, ఏఐ ఆధారిత సర్వీసులను విస్తరించే దిశగా కంపెనీ ఈ అడుగు వేసింది. కొత్తగా తీసుకొచ్చిన ప్లాన్స్‌కు ఇన్‌స్టాగ్రామ్ ప్లస్, ఫేస్‌బుక్ ప్లస్, వాట్సాప్ ప్లస్ అనే పేర్లు పెట్టింది.
Technology | Published On May 28, 2026, 1.22 pm IST
Meta | సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) తన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ సేవల కోసం కొత్త పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్‌ను ప్రకటించింది. ప్రీమియం ఫీచర్లు, ఏఐ ఆధారిత సర్వీసులను విస్తరించే దిశగా కంపెనీ ఈ అడుగు వేసింది. కొత్తగా తీసుకొచ్చిన ప్లాన్స్‌కు ఇన్‌స్టాగ్రామ్ ప్లస్, ఫేస్‌బుక్ ప్లస్, వాట్సాప్ ప్లస్ అనే పేర్లు పెట్టింది. ఇవి మెటా తీసుకొస్తున్న మెటా వన్ బ్రాండింగ్‌లో భాగంగా ఉంటాయని కంపెనీ తెలిపింది. భవిష్యత్తులో అన్ని సబ్‌స్క్రిప్షన్ సర్వీసులను మెటా వన్ పేరుతో ఒకే ప్లాట్‌ఫామ్‌లోకి తీసుకువస్తామని మెటా హెడ్ ఆఫ్ ప్రొడక్ట్ నయోమీ గ్లైట్ వెల్లడించారు. కాలక్రమేణా మరిన్ని ఫీచర్లు కూడా అందిస్తామని చెప్పారు.
ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ప్లస్‌లో..
ఇన్‌స్టాగ్రామ్ ప్లస్, ఫేస్‌బుక్ ప్లస్ ప్లాన్స్ ప్రధానంగా ప్రొఫైల్, స్టోరీ కస్టమైజేషన్, ఎంగేజ్‌మెంట్ ఫీచర్లపై దృష్టి పెట్టాయి. ఇందులో అడ్వాన్స్‌డ్ స్టోరీ ఇన్‌సైట్స్, రీవాచ్ కౌంట్స్, స్టోరీలకు అదనపు ఆడియన్స్ కంట్రోల్స్, క్లోజ్ ఫ్రెండ్స్‌కు మించి అన్‌లిమిటెడ్ స్టోరీ లిస్ట్స్, కస్టమ్ యాప్ ఐకాన్స్, ప్రొఫైల్ బయోకు ప్రత్యేక ఫాంట్స్, యానిమేటెడ్ స్టోరీ రియాక్షన్స్, అదనపు ప్రొఫైల్ పిన్స్ వంటి ఫీచర్లను ఇస్తున్నారు. అలాగే మెటా కొన్ని కొత్త ఫీచర్లను కూడా తీసుకొస్తోంది. వాటిలో 24 గంటల కన్నా ఎక్కువసేపు స్టోరీలను కొనసాగించే అవకాశం, వ్యూవర్‌గా కనిపించకుండా స్టోరీ ప్రీవ్యూ చూడటం, స్టోరీ వ్యూవర్ లిస్ట్‌లో సెర్చ్ ఆప్షన్, ఫాలోవర్ల ఫీడ్‌లో కనిపించకుండా ప్రొఫైల్, హైలైట్స్‌లో పోస్టులు పెట్టడం, అదనపు విజిబిలిటీ కోసం వీక్లీ స్టోరీ స్పాట్‌లైటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
వాట్సాప్ ప్లస్‌లో..
వాట్సాప్ ప్లస్ ప్లాన్‌లో మెసేజింగ్ పర్సనలైజేషన్‌కు సంబంధించిన ఫీచర్లు ఇవ్వనున్నారు. వాటిల్లో కస్టమ్ థీమ్స్, కస్టమ్ రింగ్‌టోన్స్, 20 వరకు అదనపు పిన్న్డ్ చాట్స్, ప్రీమియం స్టికర్ ప్యాక్స్, విస్తృత లిస్ట్ కస్టమైజేషన్ ఆప్షన్స్ ఉన్నాయి. మెటా తెలిపిన ప్రకారం ఈ కొత్త ప్లాన్స్ ప్రస్తుతం ఉన్న మెటా వెరిఫైడ్ సేవను భర్తీ చేయవు. మెటా వెరిఫైడ్‌లో వెరిఫికేషన్, ఇంపర్సనేషన్ ప్రొటెక్షన్, సపోర్ట్ ఫీచర్లు యథావిధిగా కొనసాగుతాయి. అంటే ఈ వెరిఫైడ్ ప్లాన్ తో సంబంధం లేకుండా ఈ ప్లాన్‌లను విడిగా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట.

ఏఐ ప్లాన్స్ కూడా సిద్ధం..
మెటా వినియోగదారుల కోసం ప్రత్యేక ఏఐ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్‌ను కూడా సిద్ధం చేస్తోంది. వాటిలో అధిక ఏఐ యూసేజ్ లిమిట్స్, క్లిష్టమైన టాస్క్‌లకు డీపర్ రీజనింగ్ సామర్థ్యం, ఇమేజ్, వీడియో జనరేషన్‌లో అధిక సామర్థ్యాలు ఇవ్వనున్నారు. అధిక వినియోగం చేసే యూజర్ల కోసం ఎక్కువ కంప్యూట్ కెపాసిటీ అందిస్తామని మెటా తెలిపింది. భవిష్యత్తులో ఏఐ గ్లాసెస్ యూజర్లకు కూడా కొన్ని ప్రీమియం ఏఐ ఫీచర్లు అందించే అవకాశం ఉందని పేర్కొంది.
క్రియేటర్స్, బిజినెస్‌ల కోసం కొత్త టూల్స్..
మెటా క్రియేటర్స్, బిజినెస్ అకౌంట్స్ కోసం కూడా ప్రత్యేక సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్‌ను టెస్ట్ చేస్తోంది. వాటిలో వెరిఫైడ్ బ్యాడ్జెస్, మెరుగైన ప్రొఫైల్ లింక్‌షీట్స్, అడ్వాన్స్‌డ్ అనలిటిక్స్, ఆడియన్స్ ఇన్‌సైట్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో మెరుగైన డిస్కవరీ, ప్రొఫైల్ ప్రమోషన్ టూల్స్, పోస్టుల షెడ్యూలింగ్ ఫీచర్లు, టీమ్, మోడరేటర్ అకౌంట్ మేనేజ్‌మెంట్, ఇతరులు ఒరిజినల్ కంటెంట్‌ను రీయూజ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్, మెటా వన్ అడ్వాన్స్‌డ్ సబ్‌స్క్రైబర్స్‌కు ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు, రీల్స్‌లో క్లిక్ చేయగలిగే లింక్స్ ఇచ్చే అవకాశాన్ని కూడా పరిశీలిస్తోంది.
ధరలు ఎలా ఉన్నాయి?
మెటా ప్రకటించిన ధరలు ఇలా ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్ ప్లస్, ఫేస్‌బుక్ ప్లస్ కు నెలకు 3.99 డాలర్లు (సుమారు రూ.384) చొప్పున అవుతాయి. వాట్సాప్ ప్లస్ కు నెలకు 2.99 డాలర్లు (సుమారు రూ.288) అవుతుంది. మెటా వన్ ఏఐ ప్లాన్స్ లో భాగంగా మెటా వన్ ప్లస్ ప్లాన్‌ను 7.99 డాలర్లు (సుమారు రూ.770)కు ఇస్తున్నారు. మెటా వన్ ప్రీమియం ప్లాన్ 19.99 డాలర్లు (సుమారు రూ.1,920)గా ఉంది. క్రియేటర్, బిజినెస్ ప్లాన్స్ వివరాలు ఇలా ఉన్నాయి. మెటా వన్ ఎసెన్షియల్ ప్లాన్ 14.99 డాలర్లు (సుమారు రూ.1,442) ఉండగా, మెటా వన్ అడ్వాన్స్‌డ్ ప్లాన్ 49.99 డాలర్లు (సుమారు రూ.4,810)గా ఉంది. ఇక ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ ప్లస్ ప్లాన్లను మాత్రం ప్రస్తుతం యూజర్లకు అందుబాటులోకి తెస్తుండగా, ఏఐ ప్లాన్లను మాత్రం ప్రస్తుతం సింగపూర్, గ్వాటెమాలా, బొలివియాలలో టెస్ట్ చేస్తున్నారు. అందువల్ల ఏఐ ప్లాన్లు అందుబాటులోకి వచ్చేందుకు సమయం పట్టనుంది. అలాగే క్రియేటర్, బిజినెస్ ప్లాన్లను కూడా ప్రస్తుతం పలు దేశాల్లో టెస్ట్ చేస్తున్నారు. సౌదీ అరేబియా, మొరాకో, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్‌లలో పరీక్షిస్తున్నారు. ఇవి కూడా కాస్త ఆలస్యంగా అందుబాటులోకి రానున్నాయి. ప్లస్ సబ్‌స్క్రిప్షన్లు గ్లోబల్‌గా అందుబాటులోకి వస్తుండగా, ఇతర మెటా వన్ ప్లాన్స్ ను దశలవారీగా అందించనున్నారు.
తాజావార్తలు
- ●KTR ERC Hearing | రేపు ఈఆర్సీ ముందుకు కేటీఆర్.. 'రైతు డిస్కం' వెనుక ఉన్న ఆ కుట్ర బట్టబయలు
- ●Google Search | గూగుల్ సెర్చ్‌లో భారీ మార్పులు.. ఇక ట్రస్టెడ్ వెబ్సైట్లకే ప్రాధాన్యత..
- ●DK Shivakumar | తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. ప్రతిపాదించిన సిద్ధరామయ్య
- ●Uttamkumar Reddy | హామీ ఇస్తున్నాం.. ప్రతి గింజనూ కొంటాం: రైతులకు మంత్రి ఉత్తమ్ భరోసా
- ●Eatala Rajender | రేవంత్‌పై ఈటల రాజేందర్ ఫైర్: ఆ తుగ్లక్ పాలసీలు వద్దు.. దమ్ముంటే రాజీనామా చేసి ఎలక్షన్స్‌కి రా!
- ●CM Revanth Reddy | ఇషా సింగ్‌కు సీఎం రేవంత్ అభినందనలు

KTR ERC Hearing | రేపు ఈఆర్సీ ముందుకు కేటీఆర్.. 'రైతు డిస్కం' వెనుక ఉన్న ఆ కుట్ర బట్టబయలు

Google Search | గూగుల్ సెర్చ్‌లో భారీ మార్పులు.. ఇక ట్రస్టెడ్ వెబ్సైట్లకే ప్రాధాన్యత..

DK Shivakumar | తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. ప్రతిపాదించిన సిద్ధరామయ్య

Uttamkumar Reddy | హామీ ఇస్తున్నాం.. ప్రతి గింజనూ కొంటాం: రైతులకు మంత్రి ఉత్తమ్ భరోసా






