త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sridharbabu, Ponguleti | ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు గ్రోత్ ఇంజిన్‌లా ఫ్యూచ‌ర్ సిటీ: మంత్రులు దుద్దిళ్ల‌, పొంగులేటి

Sridharbabu, Ponguleti | రాబోయే రోజుల్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు "భారత్ ఫ్యూచర్ సిటీ" ఒక గ్రోత్ ఇంజన్ లా మారనుందని.. ఇందులో ఎలాంటి సందేహం లేదని మంత్రులు దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. ఫ్యూచర్ సిటీ దేశానికి తలమానికంగా నిలవబోతుందని పేర్కొన్నారు.

S

Hyderabad | Published On May 28, 2026, 12.59 pm IST

Sridharbabu, Ponguleti | ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు గ్రోత్ ఇంజిన్‌లా ఫ్యూచ‌ర్ సిటీ: మంత్రులు దుద్దిళ్ల‌, పొంగులేటి
Advertisement

Sridharbabu, Ponguleti | త్రినేత్ర‌.న్యూస్: రాబోయే రోజుల్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు "భారత్ ఫ్యూచర్ సిటీ" ఒక గ్రోత్ ఇంజన్ లా మారనుందని.. ఇందులో ఎలాంటి సందేహం లేదని మంత్రులు దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. ఫ్యూచర్ సిటీలో నిర్మాణంలో ఉన్న ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) కార్యాలయ భవనం, స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులను గురువారం వారు పరిశీలించారు. స్కిల్ యూనివర్సిటీ పనుల పరోగతిపై ఆరా తీశారు. అనంత‌రం వారు మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీ దేశానికి తలమానికంగా నిలవబోతుందని పేర్కొన్నారు.

భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తెలంగాణ బ్రాండ్ ను మరింత విశ్వవ్యాప్తం చేసేలా ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రణాళికాబద్ధంగా ఈ భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తోంది. ఫ్యూచర్ సిటీ దేశానికే ఆదర్శంగా నిలిచే విధంగా రూపుదిద్దుకుంటోంది. నిర్మాణ పనులను నాణ్యతతో, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలి అని అధికారులకు మంత్రులు సూచించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఫ్యూచర్ సిటీని అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తోంది. విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్రంగా స్కిల్ యూనివర్సిటీ నిలవబోతోంది. ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయం ద్వారా నగర అభివృద్ధి పనులకు మరింత వేగం చేకూరుతుంది అని మంత్రులు శ్రీ‌ధ‌ర్‌బాబు, పొంగులేటి పేర్కొన్నారు.

Advertisement
Advertisement