BSNL JTO Recruitment | బీఎస్ఎన్ఎల్‌లో జూనియర్ టెలికాం ఆఫీసర్ పోస్టులు.. తెలంగాణలోనూ ఖాళీలు
BSNL JTO Recruitment | ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL) జూనియర్ టెలికాం ఆఫీసర్ కేడర్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 100 జేటీవో (BSNL JTO Recruitment) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది.
BSNL JTO Recruitment | త్రినేత్ర.న్యూస్: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL) జూనియర్ టెలికాం ఆఫీసర్ కేడర్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 100 జేటీవో (BSNL JTO Recruitment) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. ఇందులో తెలంగాణ సర్కిల్‌లో 2 పోస్టులు, ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో 1 పోస్టు ఉన్నాయి. అత్యధికంగా కర్ణాటక సర్కిల్‌లో 26 పోస్టులు ఉన్నాయి. బీఈ, బీటెక్, ఎమ్ఎస్సీ చేసినవారు ఆన్‌లైన్ విధానంలో జూన్ 4 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ప్రతినెల రూ.16,400 నుంచి రూ.40,500 వరకు వేతనం లభిస్తుంది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నది. అయితే ఎంపికైన అభ్యర్థులు కనీసం 5 సంవత్సరాల పాటు సంస్థలో సేవలు అందిస్తామని రూ. 6 లక్షల బాండ్ రాసి ఇవ్వాలి. రెండేండ్లు ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 100
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి టెలీకమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, రేడియో, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఐటీ విభాగాల్లో ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉండాలి. లేదంటే ఎంఎస్సీ, ఎంటెక్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు 2026 జూలై 3 నాటికి 20 ఏండ్ల నుంచి 30 ఏండ్ల మధ్యలో ఉండాలి.
ఎంపిక ప్రక్రియ
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా భర్తీ చేస్తారు. సీబీటీ పరీక్ష మూడు విభాగాలుగా ఉంటుంది. అందులో ఇంజినీరింగ్ స్ట్రీమ్-1, ఇంజినీరింగ్ స్ట్రీమ్-2, జనరల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటాయి. మొత్తం 480 మార్కులకు పరీక్ష ఉంటుంది.
సెక్షన్-1: 50 ప్రశ్నలు అడుగుతారు. 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రతీ సరైన సమాధానికి 4 మార్కులు, తప్పు ఆన్సర్‌కు 1 నెగిటివ్ మార్క్ ఉంటుంది. ఇందులో మెటీరియల్ కాంపోనెంట్స్, ఫిజికల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రాన్ డివైస్, నెట్వర్క్ థియరీ, పవర్ ఎలక్ట్రానిక్స్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.
సెక్షన్-2: ఇది 50 ప్రశ్నలు 200 మార్కులకు ఉంటుంది. ఇందులో అనలాగ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్, డిజిటల్ ఎలక్ర్టానిక్ సర్క్యూట్, కంట్రోల్ సిస్టమ్, కమ్యూనికేషన్ సిస్టమ్, మెక్రోవేవ్ ఇంజినీరింగ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
సెక్షన్-3: ఇందులో 20 ప్రశ్నలకు 80 మార్కులకు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. జనరల్ ఇంగ్లీష్, భారతదేశ చరిత్ర, జాగ్రఫీ, జనరల్ నాల్జెడ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
- దేశవ్యాప్తంగా 27 సెంటర్లలో పరీక్ష నిర్వహించనున్నారు. హైదరాబాద్, విజయవాడలో కూడా పరీక్ష కేంద్రాలు ఉంటాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
ఆన్‌లైన్ అప్లికేషన్స్: జూన్ 4 నుంచి
దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 3
పరీక్ష తేదీ: ఆగస్టు నెలలో
వెబ్‌సైట్: bsnl.co.in.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sridharbabu, Ponguleti | ఆర్థిక వ్యవస్థకు గ్రోత్ ఇంజిన్‌లా ఫ్యూచర్ సిటీ: మంత్రులు దుద్దిళ్ల, పొంగులేటి
మే 28, 2026

Oil palm plantation destroyed in fire | తిరుమలగిరిలో అగ్ని ప్రమాదం.. 8 ఎకరాల పామాయిల్ తోట దగ్ధం
మే 28, 2026

Grey Jungle fowl | అరుదైన అడవి కోడి.. తిన్నారో జైలు పాలే.. ఇంతకి అదెక్కడుంటుందంటే..
మే 28, 2026
తాజావార్తలు
- ●India Student | కెనడాలో భారతీయ విద్యార్థిని దారుణ హత్య.. కత్తితో పొడిచి
- ●Ghoshamahal Police | మానవత్వంతో స్పందించారు.. దివ్యాంగురాలిని రక్షించి అప్పగించారు..
- ●CBSE OSM controversy | నేను బాధ్యత వహిస్తున్నా.. సీబీఎస్ఈ ఆన్‌స్క్రీన్ మార్కింగ్ వివాదంపై కేంద్ర మంత్రి
- ●Meta | పెయిడ్ ప్లాన్లను ప్రకటించిన మెటా.. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్‌బుక్‌లకు ప్రీమియం ఫీచర్లు..
- ●Ironing Prices | బెంగళూరులో ఇస్త్రీ ధరలు చూసి షాకైన నోయిడా వ్యాపారి
- ●Sridharbabu, Ponguleti | ఆర్థిక వ్యవస్థకు గ్రోత్ ఇంజిన్‌లా ఫ్యూచర్ సిటీ: మంత్రులు దుద్దిళ్ల, పొంగులేటి

India Student | కెనడాలో భారతీయ విద్యార్థిని దారుణ హత్య.. కత్తితో పొడిచి

Ghoshamahal Police | మానవత్వంతో స్పందించారు.. దివ్యాంగురాలిని రక్షించి అప్పగించారు..

CBSE OSM controversy | నేను బాధ్యత వహిస్తున్నా.. సీబీఎస్ఈ ఆన్‌స్క్రీన్ మార్కింగ్ వివాదంపై కేంద్ర మంత్రి

Meta | పెయిడ్ ప్లాన్లను ప్రకటించిన మెటా.. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్‌బుక్‌లకు ప్రీమియం ఫీచర్లు..



