YouTube | పీసీలలో యూట్యూబ్‌ను వాడుతున్నారా.. దీన్ని గమనించకపోతే నష్టమే..
YouTube | స్మార్ట్ ఫోన్లు ఉన్నవారందరూ యూట్యూబ్‌ను యాప్‌లోనే ఓపెన్ చేస్తారు. కానీ డెస్క్ టాప్ లేదా ల్యాప్ టాప్ కంప్యూటర్లు ఉన్నవారు మాత్రం కచ్చితంగా ఏదైనా ఒక ఇంటర్నెట్ బ్రౌజర్‌లోనే యూట్యూబ్‌ను ఓపెన్ చేయాలి.
Technology | Published On May 4, 2026, 3.27 pm IST
YouTube | స్మార్ట్ ఫోన్లు ఉన్నవారందరూ యూట్యూబ్‌ను యాప్‌లోనే ఓపెన్ చేస్తారు. కానీ డెస్క్ టాప్ లేదా ల్యాప్ టాప్ కంప్యూటర్లు ఉన్నవారు మాత్రం కచ్చితంగా ఏదైనా ఒక ఇంటర్నెట్ బ్రౌజర్‌లోనే యూట్యూబ్‌ను ఓపెన్ చేయాలి. అయితే ఇలా యూట్యూబ్ ను బ్రౌజర్‌లలో వాడుతున్న పీసీ యూజర్లకు భారీ ఎత్తున సమస్యలు వస్తున్నాయని, యూట్యూబ్‌లో ఉన్న బగ్స్ కారణంగానే ఇలా జరుగుతుందని డెవలపర్లు చెబుతున్నారు. యూట్యూబ్‌లో ఉన్న బగ్స్ కారణంగా ఆ ప్లాట్‌ఫామ్‌ను బ్రౌజర్‌లో వాడితే కొంత సమయం అయ్యాక పీసీ సీపీయూ, ర్యామ్ వినియోగం గణనీయంగా పెరుగుతుందని, దీంతో పీసీ పనితీరుపై ప్రభావం పడుతుందని డెవలపర్లు గుర్తించారు. అలాగే ల్యాప్ టాప్‌లు అయితే బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుందని నిర్దారించారు. ఈ మేరకు మొజిల్లాకు చెందిన బగ్ జిల్లా థ్రెడ్ డెవలపర్లు ఈ విషయాలను సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు.
మందగిస్తున్న బ్రౌజర్‌ల పనితీరు..
యూట్యూబ్‌ను బ్రౌజర్లలో వాడితే దాని కారణంగా బ్రౌజర్ సాఫ్ట్‌వేర్ల పనితీరు మందగిస్తోందని చాలా మంది యూజర్లు ఇప్పటికే భారీ ఎత్తున సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఫిర్యాదు చేశారు. యూట్యూబ్‌ను బ్రౌజర్‌లో ఓపెన్ చేసి వీడియోలను వీక్షించే సమయంలో వీడియోలు సరిగ్గా ప్లే అవకుండా హ్యాంగ్ అవడం, ల్యాగ్ పెరగడం, బఫరింగ్, అసాధారణ రీతిలో సీపీయూ, ర్యామ్ వినియోగం అవడం వంటి సమస్యలు వస్తున్నాయని యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ సమస్య ఎక్కువగా పీసీల్లో ఫైర్ ఫాక్స్, బ్రేవ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వంటి బ్రౌజర్లలో ఉత్పన్నమవుతోందని, కొన్ని సందర్భాల్లో కేవలం ఒకే ఒక్క ట్యాబ్ ఏకంగా 7జీబీకి పైగా ర్యామ్‌ను వినియోగిస్తుందని యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు. చిన్న ఇంటర్ ఫేస్ లోపంలా కనిపించిన ఈ సమస్య, సీపీయూ వినియోగాన్ని పూర్తిగా పెంచుతోందని, దీంతో బ్రౌజర్ పనిచేయకుండా సడెన్‌గా హ్యాంగ్ అవుతుందని తెలిపారు.
గణనీయంగా సీపీయూ, ర్యామ్ వినియోగం..
మొజిల్లాకు చెందిన బగ్ జిల్లా థ్రెడ్ తెలిపిన ప్రకారం ఈ సమస్య యూట్యూబ్ వీడియో ప్లేయర్ కింద ఉండే ఫ్లెక్సిబుల్ మెనూలో ఉత్పన్నమవుతుందని డెవలపర్లు గుర్తించారు. అందులో లైక్, డిస్ లైక్, షేర్ తదితర బటన్స్ ఉంటాయి. అయితే ఈ మెనూ స్క్రీన్ సైజ్‌ను బట్టి ఆటోమేటిక్‌గా మారుతుంది. కానీ పీసీల్లో వీడియో ప్లేయర్ సైజ్‌ను ఎలా కావాలంటే అలా పలు విధంగా మార్చుకోవచ్చు. దీంతో పీసీల్లో యూట్యూబ్‌ను వీక్షించే సమయంలో ఆయా బటన్లు పదే పదే సైజ్ మారుతూ, స్థానాన్ని సర్దుబాటు చేసుకుంటూ ఉంటాయి. దీని వల్ల ర్యామ్, సీపీయూ వినియోగం గణనీయంగా పెరుగుతుంది. దీంతో బ్రౌజర్ మాత్రమే కాకుండా, పీసీ కూడా హ్యాంగ్ అవుతుంది. ఇలా చాలా మంది యూజర్లు తాము సమస్యను ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. గత కొద్ది రోజులుగా ఈ సమస్య ఉందని పలు హెల్ప్ ఫోరమ్స్‌లో వారు ఫిర్యాదులను పోస్ట్ చేస్తున్నారు.
యూట్యూబ్‌లోనే లోపం..
అయితే ఈ సమస్యను మొదట్లో బ్రౌజర్ అప్ డేట్ లేదా యాడ్ బ్లాకర్ వచ్చిందని భావించారు. కానీ ఇతర బ్రౌజర్లలోనూ ఇలాంటి సమస్యే రావడంతో అసలు లోపం యూట్యూబ్ కోడ్‌లోనే ఉందని నిర్దారించారు. ఇక ఈ సమస్యను ప్రస్తుతం మొజిల్లా డెవలపర్లు పరిశీలిస్తుండగా, దీనిపై యూట్యూబ్ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. యూట్యూబ్ ద్వారా అధికారిక అప్ డేట్ వస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని వారు తెలియజేస్తున్నారు. అయితే పీసీల్లో ఆయా బ్రౌజర్లలో యూట్యూబ్‌ను వీక్షించేవారు మాత్రం తమ కంప్యూటర్ రీసోర్స్‌లపై కన్నేసి ఉంచాలని, తేడా వస్తే వెంటనే బ్రౌజర్‌ను క్లోజ్ చేయాలని, దీని వల్ల పీసీలకు దీర్ఘకాలంలో నష్టం కలగకుండా నివారించవచ్చని సూచిస్తున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






