YouTube | ఏఐ కంటెంట్ పోస్ట్ చేసినా మానిటైజేషన్.. యూట్యూబ్ ఇండియా ఎండీ కీలక వ్యాఖ్యలు..
YouTube | యూట్యూబ్‌లో కృత్రిమ మేధస్సు ఆధారంగా రూపొందించిన కంటెంట్‌కు మానిటైజేషన్ కొనసాగుతుందని యూట్యూబ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ గుంజన్ సోని స్పష్టం చేశారు. అయితే అలాంటి కంటెంట్ యూట్యూబ్ మానిటైజేషన్ నిబంధనలు, కమ్యూనిటీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలని తెలిపారు.
Technology | Published On Sep 30, 2026, 3.28 pm IST
YouTube | యూట్యూబ్‌లో కృత్రిమ మేధస్సు ఆధారంగా రూపొందించిన కంటెంట్‌కు మానిటైజేషన్ కొనసాగుతుందని యూట్యూబ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ గుంజన్ సోని స్పష్టం చేశారు. అయితే అలాంటి కంటెంట్ యూట్యూబ్ మానిటైజేషన్ నిబంధనలు, కమ్యూనిటీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలని తెలిపారు. ఏఐని ఉపయోగించినప్పటికీ, కంటెంట్‌లో దానిని రూపొందించిన వ్యక్తి సృజనాత్మక దృష్టి ప్రతిబింబించాలని పేర్కొన్నారు. మీడియాకు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో గుంజన్ సోని మాట్లాడుతూ.. ఏఐ కంటెంట్‌కు మానిటైజేషన్ కొనసాగుతుందని తెలిపారు. అయితే వినియోగదారుల ప్రయోజనాలను రక్షించేందుకు మానిటైజేషన్ మార్గదర్శకాలు, కమ్యూనిటీ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఏఐని ఉపయోగిస్తున్న వ్యక్తి సృజనాత్మక దృష్టి నుంచి వెలువడే ఒరిజినల్ కంటెంట్ అయి ఉండాలని అన్నారు.
ఉద్యోగాల కల్పనలో యూట్యూబ్ కీలకపాత్ర..
ఏఐ ఆధారిత కంటెంట్ కారణంగా ఒరిజినల్ కంటెంట్‌కు ముప్పు ఏర్పడుతుందనే ఆందోళనలపై కూడా సోని స్పందించారు. ఏఐని కంటెంట్ సృష్టిని మరింత అందుబాటులోకి తీసుకువచ్చే ఒక సాధనంగా అభివర్ణించారు. దీని ద్వారా మరింత మంది క్రియేటర్లు సృజనాత్మక రంగంలోకి ప్రవేశించేందుకు అవకాశం లభిస్తుందని, కంటెంట్ సృష్టి మరింత ప్రజాస్వామ్యబద్ధంగా మారుతోందని తెలిపారు. ఉద్యోగాల కల్పనలో యూట్యూబ్ పోషిస్తున్న విస్తృత పాత్రను కూడా గుంజన్ సోని వివరించారు. క్రియేటర్లు తమ కంటెంట్‌ను పూర్తిస్థాయి ఉద్యోగాలుగా మార్చుకునే అవకాశం యూట్యూబ్ ద్వారా లభిస్తోందని తెలిపారు. ఈ గణాంకాల వెనుక ఉన్న విషయాలను పరిశీలిస్తే, యువతకు ఏర్పడుతున్న ఆర్థిక, ఉద్యోగ కల్పన ప్రభావం తమకు మరింత ఉత్సాహాన్ని ఇస్తోందని, దాదాపు 10 లక్షల పూర్తి కాల సమాన ఉద్యోగాలు ఉన్నాయని, వీటితోపాటు క్రియేటర్లు మరో 3 లక్షల మందికి శిక్షణార్థులుగా అవకాశాలు కల్పించారని, ఇవన్నీ కొలవగలిగిన గణాంకాలే అని తెలిపారు.
భవిష్యత్తులో యూట్యూబ్ ఈ క్రియేటర్ ఎకోసిస్టమ్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు పెట్టుబడులు కొనసాగిస్తుందని సోని తెలిపారు. కంటెంట్ సృష్టికి మద్దతు ఇవ్వడంతోపాటు, క్రియేటర్లకు మరిన్ని మానిటైజేషన్ మార్గాలను అందించడంపై దృష్టి సారిస్తామని, తద్వారా ఈ సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ మరింత పెద్ద స్థాయికి చేరేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం






