త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

YouTube | యూట్యూబ్‌లోనే చాట్.. 40 దేశాలకు కొత్త ఫీచర్..

YouTube | గూగుల్‌కు చెందిన ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ తన ఇన్-యాప్ వీడియో షేరింగ్, మెసేజింగ్ ఫీచర్‌ను మరిన్ని దేశాలకు విస్తరించింది. గతేడాది పరీక్షల దశలో ప్రారంభించిన ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు వీడియోలను షేర్ చేయడంతోపాటు వాటిపై నేరుగా యూట్యూబ్ యాప్‌లోనే చాట్‌లు చేయ‌గ‌లుగుతున్నారు.

S

Technology | Published On Jun 15, 2026, 1.12 pm IST

YouTube | యూట్యూబ్‌లోనే చాట్.. 40 దేశాలకు కొత్త ఫీచర్..
Advertisement

YouTube | గూగుల్‌కు చెందిన ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ తన ఇన్-యాప్ వీడియో షేరింగ్, మెసేజింగ్ ఫీచర్‌ను మరిన్ని దేశాలకు విస్తరించింది. గతేడాది పరీక్షల దశలో ప్రారంభించిన ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు వీడియోలను షేర్ చేయడంతోపాటు వాటిపై నేరుగా యూట్యూబ్ యాప్‌లోనే చాట్‌లు చేయ‌గ‌లుగుతున్నారు. తాజాగా ఈ సౌకర్యాన్ని అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా మరిన్ని ప్రాంతాలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఈ ఫీచర్ ఐర్లాండ్, పోలాండ్ దేశాల్లో మాత్రమే టెస్టింగ్ దశలో అందుబాటులో ఉంది. ఇప్పుడు బ్రెజిల్, ఇటలీ, సింగపూర్, యూకే, అమెరికా సహా మొత్తం 40 దేశాల్లో ఈ సేవను ప్రారంభించినట్లు యూట్యూబ్ ప్రకటించింది. దీంతో వీడియోలను షేర్ చేయడానికి వాట్సాప్ వంటి ఇతర మెసేజింగ్ యాప్‌లపై ఆధారపడాల్సిన అవసరం తగ్గనుంది.

అన్ని ర‌కాల వీడియోల‌కు స‌పోర్ట్‌..

ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు షార్ట్స్, లైవ్ స్ట్రీమ్స్ సహా అన్ని రకాల వీడియోలను స్నేహితులతో పంచుకోవచ్చు. అంతేకాకుండా వీడియో చూస్తూనే రియల్ టైమ్‌లో రియాక్ష‌న్స్‌, చాట్స్‌ కూడా నిర్వహించవచ్చు. ఇందుకోసం యూట్యూబ్ యాప్‌లో కొత్తగా అందించిన మెసేజింగ్ ఐకాన్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి, యూట్యూబ్ ఛానెల్‌లో సైన్ ఇన్ చేసిన వినియోగదారులు ఈ ఫీచర్‌ను ఉపయోగించగలుగుతారు. అలాగే యూజర్ల మొబైల్‌లో యూట్యూబ్ యాప్ తాజా వెర్షన్ ఇన్‌స్టాల్ అయి ఉండాలి. ఈ ఫీచర్‌ను ఉపయోగించాలంటే ముందుగా యూట్యూబ్ యాప్‌ను తెరిచి, షేర్ చేయాలనుకున్న వీడియోను ఎంపిక చేయాలి. అనంతరం షేర్ బటన్‌పై ట్యాప్ చేసి, వీడియో పంపాలనుకునే కాంటాక్ట్‌ను ఎంచుకోవాలి. యూట్యూబ్‌లో ఇంకా కనెక్ట్ కాలేని వ్యక్తులకు ఇన్వైట్ టు మెసేజ్ ఆన్ యూట్యూబ్ ఎంపిక ద్వారా ఆహ్వానం పంపవచ్చు.

ఇత‌రుల‌కు లింక్ పంపొచ్చు..

అలాగే యాప్‌లో కుడివైపు పై భాగంలో ఉన్న మెసేజెస్ విభాగానికి వెళ్లి ఇన్వైట్ టు చాట్ ఎంపికను ఎంచుకోవాలి. అక్కడ లభించే ఆహ్వాన లింక్‌ను ఇతరులతో పంచుకోవచ్చు. ఆహ్వానం అందుకున్న వ్యక్తి అలౌ లేదా డిక్లైన్ ఎంపికల ద్వారా స్పందిస్తారు. ఆహ్వానాన్ని అంగీకరించిన తర్వాత ఇద్దరూ నేరుగా యూట్యూబ్‌లోనే వీడియోలు, సందేశాలు పంచుకోవచ్చు. అయితే ఈ ఇన్విటేషన్ లింక్ సృష్టించిన తేదీ నుంచి ఏడు రోజుల వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. కొత్త మార్కెట్లలో యూజర్ల నుంచి వచ్చే స్పందన కోసం ఎదురుచూస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని దేశాలకు ఈ ఫీచర్‌ను విస్తరిస్తామని యూట్యూబ్ తన బ్లాగ్ పోస్టులో పేర్కొంది.

Advertisement
Advertisement