Imran Khan Health Update | జైలు నుంచి ఆసుపత్రికి ఇమ్రాన్ ఖాన్: పాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. అసలు ఆయన ఆరోగ్యానికి ఏమైంది?
జైలులో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం క్షీణించడంతో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించాలని ఆదేశాలు జారీ చేసింది.
International | Published On Aug 18, 2026, 3.47 pm IST
- పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశం
- 48 గంటల్లోగా ఇస్లామాబాద్‌లోని 'షిఫా ఇంటర్నేషనల్ హాస్పిటల్'కు మార్చండి
- సెప్టెంబర్ 16 వరకు ఆసుపత్రిలోనే చికిత్స
- ఆరోగ్యాన్ని అంచనా వేసేందుకు ప్రత్యేక మెడికల్ బోర్డ్ ఏర్పాటు
- జైలులో సరైన సదుపాయాలు లేవని, ఆయనకు ప్రాణహాని ఉందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పీటీఐ (PTI) పార్టీ
Imran Khan Health Update | త్రినేత్ర.న్యూస్ : పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ఆరోగ్య పరిస్థితిపై గత కొంతకాలంగా వస్తున్న వదంతులకు తెరదించుతూ.. పాక్ సుప్రీంకోర్టు (Supreme Court) మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. అవినీతి కేసుల్లో మూడేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్‌ను తక్షణమే ఇస్లామాబాద్‌లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌కు మెరుగైన వైద్యం కోసం తరలించాలని కోర్టు తీర్పునిచ్చింది. ఆయన మరణశయ్యపై ఉన్నారంటూ తీవ్ర స్థాయిలో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రభుత్వం వ్యక్తం చేసిన అభ్యంతరాలను తోసిపుచ్చిన అత్యున్నత న్యాయస్థానం.. 48 గంటల్లోగా ఇమ్రాన్‌ను 'షిఫా ఇంటర్నేషనల్ హాస్పిటల్' కు (Shifa International Hospital) మార్చాలని స్పష్టం చేసింది. ఆయన సెప్టెంబర్ 16 వరకు అక్కడే ఉంటారు. ఆయన ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలించేందుకు ఒక మెడికల్ బోర్డును (Medical Board) కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఆయన వ్యక్తిగత వైద్యుడితో పాటు సోదరి డాక్టర్ అలీమా ఖాన్ కూడా సభ్యులుగా ఉంటారు.
ఈ నిర్ణయంపై ఇమ్రాన్ సన్నిహితుడు జుల్ఫికర్ అలీ బుఖారీ హర్షం వ్యక్తం చేశారు. "ఇది చాలా సంతోషించదగ్గ పరిణామం. ఈ నిర్ణయం ముందే తీసుకుని ఉంటే ఆయన కంటిచూపు, సాధారణ ఆరోగ్యం ఇంతలా క్షీణించేది కాదు" అని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఆసుపత్రిలో ఇమ్రాన్‌ను కలిసేందుకు కుటుంబ సభ్యులకు అనుమతి లభించిందని, అలాగే యూకేలో (UK) ఉంటున్న తన కుమారులతో ఫోన్లో మాట్లాడేందుకు కోర్టు అంగీకరించిందని ఆయన లాయర్ ఉజైర్ భండారీ.. మీడియాకు తెలిపారు.
ఇమ్రాన్ ఖాన్ హెల్త్ రిపోర్ట్ ఏం చెబుతోంది?
రావల్పిండిలోని అడియాలా జైలు (Adiala Jail) అధికారులు సోమవారం ఇమ్రాన్ ఆరోగ్యం బాగానే ఉందని.. కంటిచూపు సమస్య తగ్గి సాధారణ స్థితికి వచ్చిందని ప్రకటించారు. అయితే, ఆయన కుటుంబ సభ్యులు, పీటీఐ (PTI) పార్టీ నాయకులు ఈ వాదనను కొట్టిపారేశారు. ఆరు నెలల క్రితమే ఇమ్రాన్ కుడి కంటి చూపు 85% మేర కోల్పోయారని ఆయన లాయర్ గతంలో చెప్పారు.
కోర్టుకు సమర్పించిన మెడికల్ రికార్డులు (Medical records) మాత్రం ఆయన ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. బీపీ (BP) హెచ్చుతగ్గులు, గుండె దడ, తీవ్రమైన మానసిక ఒత్తిడి ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇమ్రాన్ తాజా బ్లడ్ ప్రెషర్ 140/80 గా, పల్స్ రేట్ 54 bpm గా నమోదైంది. గత ఫిబ్రవరిలో ఆయన బీపీ 120/80 (నార్మల్) గా ఉండేదని రికార్డుల్లో ఉంది.
పాక్ మాజీ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఈ నివేదికను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఇమ్రాన్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ట్వీట్ చేశారు. "రాబోయే మూడు నెలలు ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుందా లేదా శాశ్వతంగా క్షీణిస్తుందా అనేది నిర్ణయిస్తాయి" అని ఆయన పేర్కొన్నారు.
కుటుంబానికి దూరంగా 'డెత్ సెల్'లో..
గత ఎనిమిది నెలలుగా ఇమ్రాన్‌ను జైలులో ఒంటరిగా ఉంచారని, కనీసం కుటుంబ సభ్యులను కూడా కలవనివ్వలేదని పీటీఐ ఆరోపిస్తోంది. తీవ్ర నిరసనల తర్వాత గత ఏడాది డిసెంబర్ 2న ఆయన సోదరి ఉజ్మా ఖానుమ్ జైలులో కలిశారు. ఇమ్రాన్‌ను దారుణమైన పరిస్థితుల్లో ఉంచారని, అది 'మానసిక హింస' (Mental torture) అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రస్తుత దుస్థితికి పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కారణమని ఇమ్రాన్ భావిస్తున్నట్లు ఆమె తెలిపారు.
అంతేకాకుండా.. మురుగునీరు వల్ల, హెపటైటిస్‌తో చనిపోతున్న ఖైదీల మధ్య తమ తండ్రిని ఒక 'డెత్ సెల్' లో (Death cell) బంధించారని ఆయన కుమారులు కాసిం, సులైమాన్ గతంలో ఆరోపించారు.
ఇమ్రాన్ ఖాన్ ఎందుకు అరెస్టయ్యారు?
ఇమ్రాన్ జైలుకెళ్లి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా.. ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రావల్పిండి, లాహోర్, మియాన్‌వాలీ వంటి నగరాల్లో పీటీఐ కార్యకర్తలు భారీ ఆందోళనలు చేపట్టారు. రావల్పిండిలో ఈ నిరసనలు ఉద్రిక్తంగా మారి భద్రతా బలగాలతో ఘర్షణకు దారితీశాయి.
అమ్నెస్టీ ఇంటర్నేషనల్ (Amnesty International) వంటి మానవ హక్కుల సంస్థలు సైతం ఇమ్రాన్‌కు కుటుంబ సభ్యులను, లాయర్లను, వైద్యులను కలిసే అవకాశం కల్పించాలని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని కోరాయి.
2018లో ప్రధానిగా ఎన్నికైన ఇమ్రాన్.. నాలుగేళ్ల తర్వాత అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి కోల్పోయారు. ఆ తర్వాత 2023 ఆగస్టు 5న తోషఖానా (Toshakhana - ప్రభుత్వ బహుమతుల విక్రయం) తదితర అవినీతి కేసుల్లో ఆయనను అరెస్టు చేశారు. 2024 ఎన్నికల్లో పీటీఐ పార్టీ పోటీ చేయకుండా తీవ్ర ఆంక్షలు ఎదుర్కొంది.
తాజా సుప్రీం తీర్పుతో.. తదుపరి విచారణ జరిగే సెప్టెంబర్ 16 వరకు ఆయన ప్రైవేట్ ఆసుపత్రిలోనే ఉండనున్నారు. మూడేళ్ల జైలు జీవితం తర్వాత ఇమ్రాన్ ఖాన్ భౌతికంగా జైలు బయట గడపనున్న అత్యంత సుదీర్ఘ కాలం ఇదే కావడం గమనార్హం. దీని ద్వారా ఆయన వాస్తవ ఆరోగ్య పరిస్థితి పాకిస్తాన్‌కు, ప్రపంచానికి స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Ponguleti Srinivas Reddy | అబద్ధాలతో హరీశ్‌రావు డ్రామాలు : మంత్రి పొంగులేటి
- ●Taapsee | తల్లి పాత్రలో తాప్సీ - గ్లామర్ పాత్రలే చేయాలని రూలు లేదంటూ ట్రోల్స్‌పై ఫైర్
- ●Supreme Court | ప్రశ్నాపత్రాల లీక్‌ను అరికట్టాలని పిల్.. కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు..
- ●Delhi Police | CJP పార్లమెంట్ మార్చ్ చట్టవిరుద్ధం.. అక్రమంగా బలప్రయోగం చేయలేదు : ఢిల్లీ పోలీసులు
- ●Defence Manufacturing | రక్షణ రంగంలో భారత్ మరో భారీ అడుగు.. కీలక ఉత్పత్తులు సొంతంగా తయారీ..
- ●Tiger | పట్ట పగలు.. గుర్రాన్ని చంపిన పెద్ద పులి.. వీడియో

Ponguleti Srinivas Reddy | అబద్ధాలతో హరీశ్‌రావు డ్రామాలు : మంత్రి పొంగులేటి

Taapsee | తల్లి పాత్రలో తాప్సీ - గ్లామర్ పాత్రలే చేయాలని రూలు లేదంటూ ట్రోల్స్‌పై ఫైర్

Supreme Court | ప్రశ్నాపత్రాల లీక్‌ను అరికట్టాలని పిల్.. కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు..

Delhi Police | CJP పార్లమెంట్ మార్చ్ చట్టవిరుద్ధం.. అక్రమంగా బలప్రయోగం చేయలేదు : ఢిల్లీ పోలీసులు




