త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

POVA 8 Pro 5G | భారీ బ్యాట‌రీ, ప‌వ‌ర్‌ఫుల్ డిస్‌ప్లే.. అదిరిపోయిన పీవోవీఏ (పోవా) కొత్త స్మార్ట్ ఫోన్‌

POVA 8 Pro 5G | పీవోవీఏ (పోవా) త‌న నూత‌న స్మార్ట్ ఫోన్ పోవా 8 ప్రొ 5జిని భారత మార్కెట్లో విడుదల చేసింది. ముందుగా ప్రకటించిన ప్రకారం మంగ‌ళ‌వారం ఈ ఫోన్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. బ్రాండ్‌కు చెందిన డిలీట్ నార్మల్ డిజైన్ సిద్ధాంతానికి అనుగుణంగా కొత్త రూపకల్పనతో ఈ ఫోన్ వచ్చింది.

S

Technology | Published On Aug 18, 2026, 3.56 pm IST

POVA 8 Pro 5G | భారీ బ్యాట‌రీ, ప‌వ‌ర్‌ఫుల్ డిస్‌ప్లే.. అదిరిపోయిన పీవోవీఏ (పోవా) కొత్త స్మార్ట్ ఫోన్‌
Advertisement

POVA 8 Pro 5G | పీవోవీఏ (పోవా) త‌న నూత‌న స్మార్ట్ ఫోన్ పోవా 8 ప్రొ 5జిని భారత మార్కెట్లో విడుదల చేసింది. ముందుగా ప్రకటించిన ప్రకారం మంగ‌ళ‌వారం ఈ ఫోన్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. బ్రాండ్‌కు చెందిన డిలీట్ నార్మల్ డిజైన్ సిద్ధాంతానికి అనుగుణంగా కొత్త రూపకల్పనతో ఈ ఫోన్ వచ్చింది. ఇందులో త్రిభుజాకార వెనుక కెమెరా మాడ్యూల్‌తోపాటు అదనంగా డాట్-మ్యాట్రిక్స్ స్క్రీన్‌ను అందించారు. ఫోన్ వెనుక భాగంలో అలైవ్ మ్యాట్రిక్స్ డిస్‌ప్లే ఉంది. ఇది బ్యాటరీ స్థాయి, యాక్టివ్ టైమర్లు, వచ్చే నోటిఫికేషన్లు, స్పామ్ గుర్తింపుతో కాలర్ వివరాలను చూపిస్తుంది. ఫోన్‌ను స్క్రీన్ కిందివైపు ఉంచినప్పుడు డెస్క్ క్లాక్‌గా కూడా ఈ డిస్‌ప్లేను ఉపయోగించుకోవచ్చు. ఇందులో 1.5కె అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. ఇది 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. బయట ఎక్కువ ప్రకాశంతో కనిపించేలా, తక్కువ వెలుతురు పరిస్థితుల్లో కళ్లపై ఒత్తిడిని తగ్గించేలా డిస్‌ప్లేను రూపొందించారు.

ప‌వ‌ర్‌ఫుల్ కెమెరాలు..

ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ క‌లిగిన 50 మెగాపిక్స‌ల్ ప్రధాన కెమెరాను వెనుక వైపు అందించారు. దీనికి 8 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ కెమెరా జ‌త‌గా ఉంది. ముందు, వెనుక కెమెరాలు రెండూ 4కె వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తాయి. కెమెరా వ్యవస్థలో కృత్రిమ మేధ ఆధారిత ఫీచర్లను కూడా అందించారు. ఇందులో ఆటోమేటిక్ ఫ్రేమింగ్ కోసం ఏఐ ఆటో జూమ్, త్రీడీ ఫొటో డెప్త్ ఎఫెక్ట్స్, కదిలే వస్తువులను ట్రాక్ చేసే మోషన్ ట్రైల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఎక్కువగా వ్యాపార, కమ్యూనికేషన్ అవసరాలు ఉన్న వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ఈ ఫోన్‌లో ఏఐ అసిస్టెంట్‌ను అందించారు. సాధారణ సెల్యులార్ కాల్స్‌తోపాటు వాట్సాప్ కాల్స్‌ను రికార్డ్ చేయడం, వాటిని లిఖిత రూపంలోకి మార్చడం, సారాంశాన్ని రూపొందించడం వంటి పనులను చేయగలిగే విభాగంలోనే తొలి ఇన్‌బిల్ట్ సాధనం ఇదేనని కంపెనీ పేర్కొంది.

భారీ బ్యాట‌రీ..

ఈ ఏఐ అసిస్టెంట్ ఇంగ్లిష్, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషలకు మద్దతు ఇస్తుంది. చర్చల నుంచి చేయాల్సిన పనులను ఆటోమేటిక్‌గా గుర్తించి, షేర్ చేసిన ఫైళ్లను క్రమబద్ధీకరించడంతోపాటు వ్యాపార కార్య‌క‌లాపాలు, చెల్లింపు స్థితుల ఆధారంగా కాంటాక్టులను వర్గీకరిస్తుంది. ఇందుకోసం ప్రత్యేక థర్డ్ పార్టీ యాప్‌లను ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫోన్‌లో 6.78 ఇంచుల 1.5కె అమోలెడ్ స్క్రీన్‌ను అందించారు. ఇది 144 హెడ్జ్‌ రిఫ్రెష్ రేట్, గరిష్ఠంగా 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. స్క్రీన్‌కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ రక్షణ ఉంది. ఫోన్‌లో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్టిమేట్ 4 నానోమీటర్ ప్రాసెసర్ ఉంది. 8జీబీ, 12జీబీ ర్యామ్, 256జీబీ, 512జీబీ స్టోరేజ్ ఆప్షన్ల‌లో దీన్ని లాంచ్ చేశారు. హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ సదుపాయం ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐఆర్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు, డ్యుయల్ మైక్రోఫోన్లు కూడా ఉన్నాయి. దుమ్ము, నీటి నిరోధకత కోసం ఐపీ68, ఐపీ69, ఐపీ69కె రేటింగ్‌లతోపాటు మిలిటరీ గ్రేడ్ మన్నిక ఇచ్చారు. 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ టైప్ సి, ఎన్‌ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ సదుపాయాలు ఉన్నాయి. ఈ ఫోన్‌లో 6500 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇది 45 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

ధ‌ర వివ‌రాలు..

పోవా 8 ప్రొ 5జి టండ్రా గ్రీన్, ఆర్క్ వైట్, గ్రాఫైట్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.49,999గా నిర్ణయించారు. 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.54,999గా ఉంది. ఈ ఫోన్ విక్రయాలు ఆగస్టు 21 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌తో పటు దేశవ్యాప్తంగా ఉన్న ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉండ‌నుంది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, యూపీఐ లావాదేవీలపై రూ.3వేల వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దీంతో 8జీబీ, 256జీబీ మోడల్ ప్రభావిత ధర రూ.46,999కు తగ్గుతుంది. అలాగే 18 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం అందుబాటులో ఉంది. నెలకు రూ.2,777 నుంచి ఈఎంఐలు ప్రారంభమవుతాయి.

Advertisement
Advertisement