YouTube | యూట్యూబ్ అద్భుతమైన అప్ డేట్.. ఇక 500 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నా డబ్బు సంపాదించుకోవచ్చు..
YouTube | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ తన యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌లో అద్భుతమైన అప్ డేట్‌ను ప్రవేశపెట్టింది. షాపింగ్ అఫిలియేట్ ప్రోగ్రామ్‌లో పలు నిబంధనలను మార్చినట్లు తెలిపింది. దీని వల్ల ఎక్కువ మంది కంటెంట్ క్రియేటర్లకు మేలు జరగనుంది. మరింత మంది కంటెంట్ క్రియేటర్లు యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించుకునేందుకు వీలు కలుగుతుంది.
Technology | Published On Mar 30, 2026, 1.55 pm IST
YouTube | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ తన యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌లో అద్భుతమైన అప్ డేట్‌ను ప్రవేశపెట్టింది. షాపింగ్ అఫిలియేట్ ప్రోగ్రామ్‌లో పలు నిబంధనలను మార్చినట్లు తెలిపింది. దీని వల్ల ఎక్కువ మంది కంటెంట్ క్రియేటర్లకు మేలు జరగనుంది. మరింత మంది కంటెంట్ క్రియేటర్లు యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించుకునేందుకు వీలు కలుగుతుంది. ఇప్పటి వరకు ఫాలోవర్లు అధికంగా ఉన్న చానల్స్‌కే ఈ ప్రోగ్రామ్‌ను పరిమితం చేశారు. కానీ ఇప్పుడు యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్ (YPP)లో తక్కువ మంది ఫాలోవర్లు ఉన్న చానల్స్‌కు కూడా డబ్బు సంపాదించుకునే మార్గాలను ప్రవేశపెట్టారు.
అర్హతలు ఇవే..
గతంలో కనీసం 1000 మంది సబ్‌స్క్రైబర్లు ఉంటే కానీ యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో చేరేందుకు అనుమతి ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆ పరిమితిని 500 కు కుదించారు. దీంతో కేవలం 500 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్న క్రియేటర్లు కూడా తమ చానల్స్ ద్వారా డబ్బు సంపాదించుకోవచ్చు. అయితే ఇది షాపింగ్ కు మాత్రమే వర్తిస్తుంది. అంటే క్రియేటర్లు వివిధ బ్రాండ్లకు చెందిన ఉత్పత్తులను ట్యాగ్ చేసి వాటి ద్వారా కమిషన్ పొందవచ్చు. కానీ వీడియో మానెటైజేషన్‌కు ఈ రూల్ వర్తించదు. అది పాత నిబంధనల ప్రకారమే వర్తిస్తుంది. ఇక కొత్త రూల్‌లో భాగంగా చానల్ కనీసం 500 మంది సబ్‌స్క్రైబర్లను కలిగి ఉండడంతోపాటు ఇతర యూట్యూబ్ ప్రమాణాలను కూడా పాటించాలి. అప్పుడే ఈ ఫీచర్‌కు అవకాశం కల్పిస్తారు.
అన్ని వీడియో ఫార్మాట్లకు అందుబాటులో..
ఈ రూల్‌ను మార్చడం వల్ల మరింత మంది కంటెంట్ క్రియేటర్లకు డబ్బు సంపాదించుకునే మార్గం ఏర్పడిందని యూట్యూబ్ తెలిపింది. తమ వీడియోలకు వివిధ బ్రాండ్లకు చెందిన ఉత్పత్తులను ట్యాగ్ చేయడం ద్వారా వీడియోలను వీక్షించే వారు ఆ ఉత్పత్తులను కొనుగోలు చేస్తే దాంతో కమిషన్ పొందుతారని తెలియజేసింది. ఈ ట్యాగింగ్ సదుపాయం యూట్యూబ్‌లోని అన్ని ప్రధాన వీడియో ఫార్మాట్లకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. సాధారణ వీడియోలతోపాటు షార్ట్స్, లైవ్ స్ట్రీమ్స్‌కు కూడా ఈ సదుపాయం కల్పించినట్లు వెల్లడించింది. వినియోగదారుల దృష్టిలో షాపింగ్ అనుభవం పూర్తిగా భిన్నంగా ఉంటుందని, ఫోన్ లేదా స్మార్ట్ టీవీలలో వీడియోలను వీక్షిస్తున్నప్పటికీ ట్యాగ్ చేసిన ఉత్పత్తులను నేరుగా వీక్షించి కొనుగోలు చేసే సౌకర్యం ఉంటుందని తెలిపింది.
ఆదాయ మార్గాలను పెంచుకోవడమే లక్ష్యంగా..
సబ్‌స్క్రైబర్ల పరిమితిని తగ్గించడం ద్వారా మరింత మంది క్రియేటర్లు ఈ ఫీచర్‌కు అర్హత సాధిస్తారని, దీంతో ఆదాయ మార్గాలను మరింత విస్తరించినట్లు అవుతుందని యూట్యూబ్ భావిస్తోంది. నేరుగా వీడియోల ద్వారా ఆదాయం పొందడమే కాకుండా, ఈ షాపింగ్ ఫీచర్ వల్ల కమ్యూనిటీ అనుసంధానం కూడా పెరుగుతుందని అంచనా వేస్తోంది. క్రియేటర్లు తమ ప్రేక్షకులకు మార్గదర్శకులుగా వ్యవహరిస్తూ ఉత్పత్తులను సూచించడం ద్వారా నమ్మకాన్ని పెంపొందించుకోవచ్చని అభిప్రాయ పడింది. ఈ విధంగా ఎంపిక చేసిన షాపింగ్ ఉత్పత్తుల ద్వారా ప్రేక్షకులతో బలమైన సంబంధాలను కూడా నిర్మించుకునే అవకాశం ఉంటుందని వెల్లడించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

YouTube | పీసీలలో యూట్యూబ్‌ను వాడుతున్నారా.. దీన్ని గమనించకపోతే నష్టమే..
మే 4, 2026

YouTube Picture-in-Picture | యూట్యూబ్‌లో బిగ్ అప్డేట్.. ప్రీమియం పీఐపీ ఫీచర్ ఇక అందరికీ..
మే 1, 2026

YouTube Shorts | యూట్యూబ్ షార్ట్స్ కు కొత్త అప్డేట్.. వీడియోలను అసలు చూడకుండా ఆపొచ్చు..
ఏప్రిల్ 18, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



