Xiaomi | షియోమీ సంచలనం.. ఓపెన్ సోర్స్ ఏఐ కోడింగ్ అసిస్టెంట్ మిమో కోడ్ విడుదల..
Xiaomi | డెవలపర్ల కోసం షియోమీ తన కొత్త ఓపెన్ సోర్స్ టెర్మినల్-నేటివ్ ఏఐ కోడింగ్ అసిస్టెంట్ మిమో కోడ్ వీ0.1ను విడుదల చేసింది. ఈ టూల్ నేరుగా టెర్మినల్‌లో పనిచేస్తూ కోడ్‌ను చదవడం, రాయడం, కమాండ్లను అమలు చేయడం, గిట్ ఆపరేషన్లను నిర్వహించడం, అలాగే ప్రాజెక్ట్ మెమరీని సెషన్ల మధ్య నిల్వ ఉంచడం వంటి సామర్థ్యాలను అందిస్తుంది.
Technology | Published On Jun 13, 2026, 12.50 pm IST
Xiaomi | డెవలపర్ల కోసం షియోమీ తన కొత్త ఓపెన్ సోర్స్ టెర్మినల్-నేటివ్ ఏఐ కోడింగ్ అసిస్టెంట్ మిమో కోడ్ వీ0.1ను విడుదల చేసింది. ఈ టూల్ నేరుగా టెర్మినల్‌లో పనిచేస్తూ కోడ్‌ను చదవడం, రాయడం, కమాండ్లను అమలు చేయడం, గిట్ ఆపరేషన్లను నిర్వహించడం, అలాగే ప్రాజెక్ట్ మెమరీని సెషన్ల మధ్య నిల్వ ఉంచడం వంటి సామర్థ్యాలను అందిస్తుంది. ఈ విడుదలలో భాగంగా మిమో వీ2.5 అనే మల్టీమోడల్ మోడల్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. పరిమిత కాలం వరకు ఇది ఉచితంగా లభించనుంది. ఒక మిలియన్ టోకెన్ల కాంటెక్స్ట్ విండోతో రూపొందించిన ఈ మోడల్, అదనపు సెటప్ అవసరం లేకుండా నేరుగా ఉపయోగించుకునేలా పనిచేస్తుంది. మిమో కోడ్‌లోని ప్రధాన ప్రత్యేకతల్లో టెర్మినల్‌లోనే కోడ్ రీడ్, రైట్, కమాండ్ ఎగ్జిక్యూషన్, గిట్ మేనేజ్‌మెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మిమో వీ2.5 మోడల్ ఒక మిలియన్ టోకెన్ల కాంటెక్స్ట్ విండోను అందిస్తుండగా, పెద్ద కోడ్‌బేస్‌ల కోసం ఆటోమేటిక్ నాలెడ్జ్ అక్యుములేషన్, లాస్‌లెస్ కంప్రెషన్ ద్వారా దాదాపు అన్ లిమిటెడ్ కాంటెక్స్ట్‌ను నిర్వహిస్తుంది.
ఇతర ఏఐ మోడల్స్‌కు సపోర్ట్..
ఏజెంట్-మోడల్ సినర్జీ ద్వారా టెస్టింగ్, రివ్యూ, వాలిడేషన్‌లను క్లోజ్డ్-లూప్ విధానంలో నిర్వహిస్తుంది. కంపోజ్ మోడ్ లో స్పెక్స్ నుంచి ప్లానింగ్, బిల్డ్, రిపోర్ట్ వరకు మొత్తం వర్క్‌ఫ్లోను క్రమబద్ధంగా అమలు చేస్తుంది. సెషన్ అనుభవాలను సేకరించి కాలక్రమేణా మెరుగుపడే సెల్ఫ్-ఎవాల్వింగ్ సిస్టమ్‌గా కూడా ఇది పనిచేస్తుంది. వాయిస్ ఆధారిత ప్రాంప్ట్‌ల కోసం మిమో-వీ2.5-ఏఎస్ఆర్ సపోర్ట్ అందుబాటులో ఉంది. దీంతో డెవలపర్లు మాట్లాడి కమాండ్లు ఇవ్వవచ్చు. అలాగే క్లాడ్ కోడ్ తో అనుకూలత కలిగి ఉండటంతో స్కిల్స్, ఎంసీపీ సర్వర్లు, కమాండ్లను ఆటోమేటిక్‌గా లోడ్ చేస్తుంది. ఇది ఆంత్రోపిక్, ఓపెన్‌ఏఐ, డీప్‌సీక్, కిమి, జీఎల్ఎమ్ వంటి అనేక మోడల్ ప్రొవైడర్లకు మద్దతు ఇస్తుంది. ఎస్‌క్యూలైట్ ఎఫ్‌టీఎస్5 ఫుల్-టెక్స్ట్ సెర్చ్ ఆధారిత పర్సిస్టెంట్ మెమరీ సిస్టమ్‌ను ఉపయోగిస్తుంది. బిల్డ్, ప్లాన్, కంపోజ్ మోడ్‌లతో కూడిన మల్టీ-ఏజెంట్ వ్యవస్థను కూడా కలిగి ఉంది.
ఎలా వాడాలి..
మిమో కోడ్‌ను పలు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఫ్రీ టియర్‌లో ఆటోనామస్ యూసేజ్ లభిస్తుంది. జీరో కాన్ఫిగరేషన్ పద్ధతిలో పనిచేస్తుంది. అలాగే షియోమీ మిమో ప్లాట్‌ఫామ్ అయితే ఓఆత్ లాగిన్ ను ఉపయోగించాలి. క్లాడ్ కోడ్ నుంచి ఒకే దశలో మైగ్రేషన్ కూడా కావొచ్చు. కస్టమ్ ప్రొవైడర్ (ఓపెన్‌ఏఐ-కంపాటిబుల్ ఏపీఐ సపోర్ట్) కూడా లభిస్తుంది. ఇక మిమో కోడ్ వీ0.1 ఓపెన్ సోర్స్‌గా విడుదలైంది. దీన్ని ఓపెన్‌కోడ్ ఫోర్క్ ఆధారంగా రూపొందించారు. పర్సిస్టెంట్ మెమరీ, మల్టీ-ఏజెంట్ ఆర్కెస్ట్రేషన్, కాంటెక్స్ట్ మేనేజ్‌మెంట్ వంటి అదనపు సామర్థ్యాలను ఇందులో ఇచ్చారు. మాక్ ఓఎస్, లినక్స్‌లకు ఒక ప్రత్యేక కమాండ్, విండోస్ పీసీలకు మరో ప్రత్యేక కమాండ్‌ను ఉపయోగించి ఈ ఏఐ మోడల్‌ను పీసీల్లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాలేషన్ అనంతరం మిమో ఆటో, షియోమీ మిమో ప్లాట్‌ఫామ్, క్లాడ్ కోడ్ ఇంపోర్ట్ లేదా కస్టమ్ ఏపీఐ ప్రొవైడర్లను ఎంచుకుని ఉపయోగించవచ్చు.
సంబంధిత వార్తలు

Redmi 17 5G | రెడ్మీ 17 5జి ఫోన్ వచ్చేసింది.. 7900 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో అదిరిపోయింది..
సెప్టెంబర్ 3, 2026

Redmi Note 17 | 8000 ఎంఏహెచ్ బ్యాటరీతో రెడ్మీ నోట్ 17.. భారత్‌లో లాంచ్..
ఆగస్టు 6, 2026

REDMI Turbo 5 | భారీ బ్యాటరీతో రెడ్మీ టర్బో 5 ఎంట్రీ.. పవర్ఫుల్ ప్రాసెసర్, అద్భుతమైన డిస్ప్లే..
జూన్ 16, 2026
తాజావార్తలు
- ●Rukmini Vasanth | డిజాస్టర్ల ఎఫెక్ట్ - రెమ్యూనరేషన్ సగానికి తగ్గించిన రుక్మిణి వసంత్
- ●Konda Surekha Letter To Sonia Gandhi | నన్ను డమ్మీ మంత్రిని చేశారు.. రేవంత్ కావాలనే నన్ను అణగదొక్కారు
- ●India-US Trade Deal | అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై భారత్ కీలక షరతు
- ●Bhagwant Mann | అత్యాచార కేసుల సెటిల్మెంట్కు సిండికేట్ దందా.. సీఎం భార్యపై బీజేపీ సంచలన ఆరోపణలు
- ●Konda Surekha | రేవంత్‌లో టీడీపీ రక్తం.. బ్లాక్ మెయిల్ చేసి బర్తరఫ్ చేశారు : కొండా సురేఖ
- ●SUV On Rooftop | చోరీ భయం.. కారును ఇంటిపైకప్పుపై పార్క్ చేసిన యజమాని

Rukmini Vasanth | డిజాస్టర్ల ఎఫెక్ట్ - రెమ్యూనరేషన్ సగానికి తగ్గించిన రుక్మిణి వసంత్

Konda Surekha Letter To Sonia Gandhi | నన్ను డమ్మీ మంత్రిని చేశారు.. రేవంత్ కావాలనే నన్ను అణగదొక్కారు

India-US Trade Deal | అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై భారత్ కీలక షరతు

Bhagwant Mann | అత్యాచార కేసుల సెటిల్మెంట్కు సిండికేట్ దందా.. సీఎం భార్యపై బీజేపీ సంచలన ఆరోపణలు



