త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Redmi 17C 5G | భారీ బ్యాట‌రీ, ప‌వ‌ర్‌ఫుల్ కెమెరాలు.. షియోమీ కొత్త ఫోన్‌.. రెడ్‌మీ 17సి 5జి లాంచ్‌..

Redmi 17C 5G | మొబైల్స్ త‌యారీ సంస్థ షియోమీ భారత్‌లో త‌న నూత‌న స్మార్ట్ ఫోన్ రెడ్‌మీ 17సి 5జిని విడుద‌ల చేసింది. ఈ ఫోన్‌లో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందించారు. 6.9 ఇంచుల డిస్‌ప్లే ఉండ‌గా, దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందించారు. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్‌ను ఈ ఫోన్‌లో ఇచ్చారు. గరిష్ఠంగా 660 నిట్స్ సాధారణ బ్రైట్‌నెస్, 810 నిట్స్ హెచ్‌బీఎం బ్రైట్‌నెస్‌తోపాటు డీసీ డిమ్మింగ్ సదుపాయం ఉంది.

S

Business | Published On Oct 1, 2026, 5.18 pm IST

Redmi 17C 5G | భారీ బ్యాట‌రీ, ప‌వ‌ర్‌ఫుల్ కెమెరాలు.. షియోమీ కొత్త ఫోన్‌.. రెడ్‌మీ 17సి 5జి లాంచ్‌..
Advertisement

Redmi 17C 5G | మొబైల్స్ త‌యారీ సంస్థ షియోమీ భారత్‌లో త‌న నూత‌న స్మార్ట్ ఫోన్ రెడ్‌మీ 17సి 5జిని విడుద‌ల చేసింది. ఈ ఫోన్‌లో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందించారు. 6.9 ఇంచుల డిస్‌ప్లే ఉండ‌గా, దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందించారు. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్‌ను ఈ ఫోన్‌లో ఇచ్చారు. గరిష్ఠంగా 660 నిట్స్ సాధారణ బ్రైట్‌నెస్, 810 నిట్స్ హెచ్‌బీఎం బ్రైట్‌నెస్‌తోపాటు డీసీ డిమ్మింగ్ సదుపాయం ఉంది. నాచ్‌లో 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరాను అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 4జీబీ, 6జీబీ ర్యామ్ వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజీని 1 టెరాబైట్ వరకు పెంచుకోవచ్చు. అదనంగా 6జీబీ వరకు ర్యామ్ విస్తరణ సదుపాయం కూడా ఉంది.

ప‌వ‌ర్‌ఫుల్ కెమెరాలు..

సాఫ్ట్‌వేర్ పరంగా ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై షియోమీ హైపర్‌ఓఎస్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌కు రెండు సంవత్సరాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లు అందిస్తామని కంపెనీ తెలిపింది. కెమెరాల విషయానికి వస్తే వెనుకవైపు 50 మెగాపిక్స‌ల్ ప్రధాన కెమెరా, ఎల్‌ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ముందు భాగంలో 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అందించారు. 3.5 మిల్లీమీటర్ ఆడియో జాక్, ఎఫ్ఎం రేడియో కూడా ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా డ్యుయల్ సిమ్, 5జి, డ్యుయల్ 4జీ వోవోఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ 5.4, జీపీఎస్, గ్లోనాస్, యూఎస్‌బీ టైప్ సి పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్‌లోని బ్యాట‌రీకి 33 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 10 వాట్ల రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సదుపాయం ఉంది. దుమ్ము, నీటి తుంపర్ల నుంచి రక్షణ కోసం ఐపీ64 రేటింగ్ కూడా ఉంది.

ధ‌ర ఎంతంటే..

రెడ్‌మీ 17సి 5జి మూడు రంగుల్లో లభిస్తుంది. కాఫీ బ్రూ వేరియంట్‌లో వెచ్చని బ్రౌన్ రంగు వీగన్ లెదర్ ఫినిష్ ఉంటుంది. దీంతోపాటు పర్పుల్ డాన్, డార్క్ నైట్ రంగులలోనూ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ధర విషయానికి వస్తే 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.20,999గా నిర్ణయించారు. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999గా ఉంది. ఈ ఫోన్‌ విక్రయాలు అక్టోబర్ 7 నుంచి ప్రారంభం కానున్నాయి. ఎంఐ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌, అమెజాన్ ఇండియా, షియోమీ రిటైల్ స్టోర్లు, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

Advertisement
Advertisement