Redmi Note 17 | 8000 ఎంఏహెచ్ బ్యాటరీతో రెడ్‌మీ నోట్ 17.. భారత్‌లో లాంచ్..
Redmi Note 17 | మొబైల్స్ తయారీ సంస్థ షియోమీ భారత్‌లో తన నూతన స్మార్ట్ ఫోన్ రెడ్‌మీ నోట్ 17 5జిని గురువారం విడుదల చేసింది. ఇందులో భారీ డిస్‌ప్లే, బ్యాటరీలను ఇచ్చారు. దీర్ఘకాలిక వినియోగాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్‌ను లాంచ్ చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్‌ను ఆకర్షణీయమైన డిజైన్‌తో తీర్చిదిద్దారు.
Technology | Published On Aug 6, 2026, 5.06 pm IST
Redmi Note 17 | మొబైల్స్ తయారీ సంస్థ షియోమీ భారత్‌లో తన నూతన స్మార్ట్ ఫోన్ రెడ్‌మీ నోట్ 17 5జిని గురువారం విడుదల చేసింది. ఇందులో భారీ డిస్‌ప్లే, బ్యాటరీలను ఇచ్చారు. దీర్ఘకాలిక వినియోగాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్‌ను లాంచ్ చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్‌ను ఆకర్షణీయమైన డిజైన్‌తో తీర్చిదిద్దారు. అందువల్ల దీనికి ప్రీమియం లుక్ వచ్చింది. ఈ ఫోన్‌లో 6.99 ఇంచుల ఓలెడ్ డిస్‌ప్లేను ఇచ్చారు. దీనికి ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌ను అందించారు. అందువల్ల ఔట్ డోర్‌లోనూ డిస్‌ప్లే విజిబిలిటీ స్పష్టంగా ఉంటుంది. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇందులో ఇచ్చారు. ఈ ఫోన్‌ను స్టార్ లైట్ పర్పుల్, డార్క్ నైట్, ఆర్క్‌టిక్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో లాంచ్ చేశారు.
8000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ..
ఈ ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 ప్రాసెసర్‌ను ఇచ్చారు. ఫోన్‌ను ఎక్కువ సేపు ఉపయోగించినా హీట్‌కు గురి కాకుండా ఉండేందుకు ప్రత్యేకమైన గ్రాఫైట్ హీట్ డిసిపేషన్ వ్యవస్థను అందించారు. ఇక ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణ ఇందులోని 8000 ఎంఏహెచ్ బ్యాటరీ కాగా ఇది ప్రత్యేకమైన షియోమీ సర్జ్ జి1 బ్యాటరీ మేనేజ్‌మెంట్ చిప్‌తో పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. దీని వల్ల ఫోన్‌ను ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 3 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుందని వెల్లడించింది. అలాగే 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు ఇందులో సపోర్ట్‌ను ఇచ్చారు. ఫాస్ట్ చార్జర్‌ను ఫోన్‌తోపాటు అందిస్తున్నారు. 22.5 వాట్ల రివర్స్ వైర్డ్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. దీని వల్ల ఈ ఫోన్ సహాయంతో ఇతర డివైస్‌లను చార్జింగ్ చేసుకోవచ్చు. ఇది పవర్ బ్యాంక్‌లా పనిచేస్తుంది.
ఏఐ కెమెరాలు..
ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 16 ఆధారిత షియోమీ హైపర్ ఓఎస్ 3 ని ఇచ్చారు. 4 జనరేషన్ల వరకు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్‌ను, 6 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తామని కంపెనీ తెలిపింది. వెనుక వైపు 50 మెగాపిక్సల్ ప్రధాన కెమెరాను ఇచ్చారు. ఇది ఏఐ ఫీచర్లతో పనిచేస్తుంది. ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది. భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ఈ ఫోన్‌కు మెటాలిక్ ఫినిష్ మిడిల్ ఫ్రేమ్‌ను ఇచ్చారు. మ్యాట్ డిజైన్ బ్యాక్‌ను కలిగి ఉంది. ముందు వైపు డిస్‌ప్లేకు గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్ ఉంది. ఐపీ65 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌ను కూడా అందించారు. 6జీబీ, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. స్టోరేజ్ ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకోవచ్చు. డ్యుయల్ సిమ్, 5జి, 4జీ వీవోఎల్‌టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.1, యూఎస్‌బీ టైప్ సి, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, బాటమ్ ఫైరింగ్ స్పీకర్లు ఉన్నాయి.
ధర ఎంతంటే..
షియోమీ రెడ్‌మీ నోట్ 17కు చెందిన 6జీబీ, 128జీబీ మోడల్ ధరను రూ.27,999గా నిర్ణయించారు. 8జీబీ, 128జీబీ మోడల్ ధర రూ.30,999గా ఉంది. యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ, కోటక్ మహీంద్రా బ్యాంకు కార్డులతో ఈ ఫోన్‌పై రూ.2వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు. దీంతో ఫోన్ ప్రారంభ ధర రూ.24,999కు తగ్గుతుంది. ఈ ఫోన్‌ను ఆగస్టు 12 నుంచి అమెజాన్‌తోపాటు షియోమీ ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ప్రధాన ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో విక్రయించనున్నారు.
సంబంధిత వార్తలు

POCO M8 Power 5G | 8000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, పవర్ఫుల్ డిస్ప్లేతో లాంచ్ అయిన పోకో కొత్త ఫోన్.. ధర ఎంతంటే..
ఆగస్టు 5, 2026

Samsung Galaxy F70 Pro 5G | తక్కువ ధరకే శాంసంగ్ కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్.. భారీ బ్యాటరీ, 6 ఏళ్ల వరకు అప్డేట్స్..
ఆగస్టు 4, 2026

ASUS Pad T3201 | 9000 ఎంఏహెచ్ బ్యాటరీ, పవర్ఫుల్ డిస్‌ప్లే.. కొత్త ట్యాబ్‌ను లాంచ్ చేసిన అసుస్..
జులై 30, 2026
తాజావార్తలు
- ●NEET-UG | నీట్ పరీక్ష విధానంలో కీలక మార్పులు.. పెన్-అండ్-పేపర్ విధానానికి స్వస్తి
- ●Makutam Movie | విశాల్ ‘మకుటం’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. రేపే ట్రైలర్ విడుదల
- ●Rukmini Vasanth | రామ్‌చరణ్ సరసన రుక్మిణి వసంత్..
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి.. స్వల్ప లాభాల్లో ముగిసిన సూచీలు..
- ●KTR | మూడు తరాలను ముంచిందే కాంగ్రెస్సని సార్ చెప్పేవారు.. అందుకే ఎట్టికైనా, మట్టికైనా మనోడే ఉండాలనేవారు
- ●Shivcharan Gupta Sonipat | కోట్లు సంపాదించిన తండ్రికి చివరికి మిగిలింది రూ.5100.. వీడియో కాల్లో అంత్యక్రియలు

NEET-UG | నీట్ పరీక్ష విధానంలో కీలక మార్పులు.. పెన్-అండ్-పేపర్ విధానానికి స్వస్తి

Makutam Movie | విశాల్ ‘మకుటం’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. రేపే ట్రైలర్ విడుదల

Rukmini Vasanth | రామ్‌చరణ్ సరసన రుక్మిణి వసంత్..

Stock Markets | స్టాక్ మార్కెట్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి.. స్వల్ప లాభాల్లో ముగిసిన సూచీలు..



