REDMI A7 Pro 5G | చవక ధరకే కొత్త 5జి ఫోన్‌ను లాంచ్ చేసిన షియోమీ.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
REDMI A7 Pro 5G | మొబైల్స్ తయారీదారు షియోమీ తన నూతన స్మార్ట్ ఫోన్ రెడ్‌మీ ఎ7 ప్రొ 5జి ని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఎంట్రీ లెవల్ రెడ్‌మీ ఎ సిరీస్ లైనప్‌లో ప్రొ మోడల్‌గా విడుదలైన తొలి ఫోన్ ఇదే కావడం విశేషం. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. పెద్ద డిస్‌ప్లే, భారీ బ్యాటరీ, అధిక రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లను ఇచ్చారు.
Technology | Published On Apr 13, 2026, 3.08 pm IST
REDMI A7 Pro 5G | మొబైల్స్ తయారీదారు షియోమీ తన నూతన స్మార్ట్ ఫోన్ రెడ్‌మీ ఎ7 ప్రొ 5జి ని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఎంట్రీ లెవల్ రెడ్‌మీ ఎ సిరీస్ లైనప్‌లో ప్రొ మోడల్‌గా విడుదలైన తొలి ఫోన్ ఇదే కావడం విశేషం. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. పెద్ద డిస్‌ప్లే, భారీ బ్యాటరీ, అధిక రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లను ఇచ్చారు. రెడ్‌మీ ఎ7 ప్రొ 5జి ఫోన్‌లో 6.9 ఇంచుల డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను, హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. అందువల్ల డిస్‌ప్లే క్వాలిటీగా ఉంటుంది. అలాగే ఔట్ డోర్‌లోనూ డిస్‌ప్లే స్పష్టంగా కనిపించేలా 800 నిట్స్ పీక్ బ్రైట్ నెస్‌ను ఇచ్చారు. ఈ ఫోన్‌కు వెట్ టచ్ టెక్నాలజీ 2.0ను అందించారు. అందువల్ల తడి, నూనె, సబ్బు చేతుల్తో డిస్‌ప్లేను టచ్ చేసినా పనిచేస్తుంది.
భారీ బ్యాటరీ..
ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ యూనిసోక్ టి8300 ప్రాసెసర్‌ను ఇచ్చారు. 4జీబీ ర్యామ్, 64జీబీ, 128జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. ఈ ఫోన్‌లో ర్యామ్‌ను అదనంగా మరో 8జీబీ వరకు వర్చువల్‌గా పెంచుకునే వీలు కల్పించారు. అందువల్ల ఫోన్ ల్యాగ్ లేకుండా వేగంగా పనిచేస్తుంది. ఇందులో 6300 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ కలిగిన బ్యాటరీని ఇచ్చారు. దీనికి 15 వాట్ల ఫాస్ట్ చార్జింగ్, 7.5 వాట్ల రివర్స్ వైర్డ్ చార్జింగ్ సపోర్ట్‌ను ఇచ్చారు. అందువల్ల ఫోన్‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ బ్యాటరీకి 1000 చార్జింగ్ సైకిల్స్ వరకు రేటింగ్ ఇచ్చారు. దీని వల్ల ఫోన్ బ్యాటరీ 4 ఏళ్ల పాటు మన్నికగా పనిచేస్తుందని, అప్పటి వరకు బ్యాటరీలో 80 శాతం కెపాసిటీ ఉంటుందని కంపెనీ తెలిపింది.
ఇన్‌బిల్ట్‌గా గూగుల్ జెమిని ఏఐ..
రెడ్‌మీ ఎ7 ప్రొ 5జి ఫోన్‌లో షియోమీ హైపర్ ఓఎస్3ని ఇచ్చారు. దీనికి 4 ఏళ్ల వరకు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్‌ను, 6 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్ డేట్స్‌ను అందిస్తామని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్‌లో గూగుల్ జెమిని ఏఐ ని ఇంటిగ్రేట్ చేశారు. అందువల్ల ఫోన్‌లో ఇన్‌బిల్ట్‌గా ఏఐ సేవలను పొందవచ్చు. అందులో భాగంగానే గూగుల్ జెమినితో సర్కిల్ టు సెర్చ్ వంటి ఏఐ ఫీచర్లను పొందవచ్చు. ఈ ఫోన్‌కు వెనుక వైపు 32 మెగాపిక్సల్ డ్యుయల్ కెమెరాలను ఇచ్చారు. ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో స్టోరేజ్‌ను మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 2టీబీ వరకు పెంచుకోవచ్చు. డ్యుయల్ సిమ్ స్లాట్లతోపాటు డెడికేటెడ్ మైక్రో ఎస్డీ కార్డు స్లాట్‌ను ఇచ్చారు. 3.5ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎం రేడియో సదుపాయాలు ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ సైడ్‌కు ఉంటుంది. 5జి సేవలను పొందవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ టైప్ సి పోర్ట్ వంటి కనెక్టివిటీ సదుపాయాలను ఇచ్చారు.
ధర వివరాలు..
షియోమీ రెడ్‌మీ ఎ7 ప్రొ 5జి స్మార్ట్ ఫోన్ ను బ్లాక్, మిస్ట్ బ్లూ, సన్ సెట్ ఆరెంజ్ కలర్ ఆప్షన్‌లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.11,499 ఉండగా, 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.12,499గా ఉంది. లాంచింగ్ సందర్బంగా ఫోన్ ధరలను తగ్గించి ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది. వీటిని అమెజాన్‌తోపాటు ఎంఐ ఆన్‌లైన్ స్టోర్, షియోమీ రిటెయిల్ స్టోర్స్‌లో ఏప్రిల్ 15 నుంచి విక్రయించనున్నారు. 3 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్‌ను కూడా ఇస్తున్నారు.
సంబంధిత వార్తలు

OPPO Find X9 Ultra | ఓప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా లాంచ్.. కెమెరా ప్రేమికుల కోసం పవర్ఫుల్ ఫ్లాగ్షిప్..
మే 21, 2026

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026

Surface Pro for Business | నూతన తరం సర్ఫేస్ బిజినెస్ ల్యాప్ టాప్‌లను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్.. అద్భుతమైన ఫీచర్లు..
మే 20, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



