Amazon | అమెజాన్‌లో ఇక ఏఐతో షాపింగ్.. చాలా ఈజీ..
Amazon | ఆన్‌లైన్ షాపింగ్‌ను మరింత సులభతరం చేసేందుకు అమెజాన్ భారత్‌లో అలెక్సా ఫర్ షాపింగ్ పేరుతో కొత్త ఏఐ ఆధారిత షాపింగ్ అసిస్టెంట్‌ను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారుల అభిరుచులు, గత కొనుగోళ్లు, షాపింగ్ చరిత్ర ఆధారంగా ఉత్పత్తులను సూచించడం, ధరలను పోల్చడం, డీల్స్ అలర్ట్స్ ఇవ్వడం వంటి సేవలను ఇది అందిస్తుంది. ప్రైమ్ సభ్యత్వం లేదా ఎకో పరికరం లేకుండానే ఈ సేవను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.
Amazon | ఆన్‌లైన్ షాపింగ్‌ను మరింత సులభతరం చేసేందుకు అమెజాన్ భారత్‌లో అలెక్సా ఫర్ షాపింగ్ పేరుతో కొత్త ఏఐ ఆధారిత షాపింగ్ అసిస్టెంట్‌ను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారుల అభిరుచులు, గత కొనుగోళ్లు, షాపింగ్ చరిత్ర ఆధారంగా ఉత్పత్తులను సూచించడం, ధరలను పోల్చడం, డీల్స్ అలర్ట్స్ ఇవ్వడం వంటి సేవలను ఇది అందిస్తుంది. ప్రైమ్ సభ్యత్వం లేదా ఎకో పరికరం లేకుండానే ఈ సేవను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.
అలెక్సా ఫర్ షాపింగ్ సేవ..
అమెజాన్ తన షాపింగ్ యాప్, వెబ్‌సైట్‌లో ఎంపిక చేసిన విభాగాల్లో అలెక్సా ఫర్ షాపింగ్ సేవను దశలవారీగా ప్రారంభించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గత 12 నెలల్లో 40 కోట్ల మందికి పైగా వినియోగదారులు అమెజాన్ ఏఐ ఆధారిత షాపింగ్ సేవలను ఉపయోగించుకున్నారని సంస్థ వెల్లడించింది. రూఫస్ ఉత్పత్తుల పరిజ్ఞానాన్ని, అలెక్సా ప్లస్ వ్యక్తిగత అభిరుచులను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని కలిపి ఈ కొత్త అసిస్టెంట్‌ను రూపొందించింది. వినియోగదారులు గతంలో కొనుగోలు చేసిన వస్తువులు, బ్రౌజింగ్ చరిత్ర, అలెక్సాతో జరిపిన సంభాషణల ఆధారంగా వ్యక్తిగత సిఫార్సులు అందిస్తుంది. ప్రయాణానికి అవసరమైన వస్తువుల జాబితా తయారు చేయడం, నిత్యావసరాలను గత ఆర్డర్ల ఆధారంగా బాస్కెట్‌లో చేర్చడం, బడ్జెట్‌కు తగిన బహుమతులను సూచించడం, ఎయిర్ ప్యూరిఫైయర్లలో చూడాల్సిన ఫీచర్లను వివరించడం, వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను పోల్చడం వంటి పనులను చేస్తుంది. కుటుంబ సభ్యులు, పెంపుడు జంతువులు, ఆసక్తులు, ఆహార అలవాట్లకు సంబంధించిన అభిరుచులను కూడా వినియోగదారులు తమ సంభాషణల ద్వారా మార్చుకోవచ్చు, తొలగించవచ్చు.
ధరలు తగ్గినప్పుడు కొనవచ్చు..
ఈ కొత్త సేవలో ఏఐ ఆధారిత ఉత్పత్తుల సమీక్షలు, సెర్చ్ ఫలితాల్లో ముఖ్యమైన వివరాల సారాంశాలు, వివిధ ఉత్పత్తుల ఫీచర్లు, ధరలు, వినియోగదారుల సమీక్షల పోలికలు అందుబాటులో ఉంటాయి. అలాగే 30, 60, 365 రోజుల ధరల చరిత్రను పరిశీలించి కొనుగోలుకు సరైన సమయాన్ని నిర్ణయించుకోవచ్చు. ధరలు తగ్గినప్పుడు లేదా ప్రత్యేక డీల్స్ వచ్చినప్పుడు అలర్ట్స్ పొందే సదుపాయం ఉంది. ఒకసారి లేదా ప్రతినెలా నిత్యావసర వస్తువులను నిర్దేశించిన ధర కంటే తక్కువకు అందుబాటులో ఉన్నప్పుడు కొనుగోలు చేసేలా షెడ్యూల్ చర్యలను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. 55 ఇంచుల స్మార్ట్ టీవీలు, గేమింగ్ ల్యాప్‌టాప్‌ల వంటి ఖరీదైన ఉత్పత్తుల కొనుగోలుకు వ్యక్తిగత షాపింగ్ గైడ్స్‌ను పొందవచ్చు. గత ఆర్డర్ల నుంచి వస్తువులను ఎంపిక చేసి బాస్కెట్‌లో చేర్చడంతోపాటు ప్యాకేజీ ట్రాకింగ్, ఆర్డర్ స్టేటస్, రిటర్న్స్ నిర్వహణ వంటి సేవలను కూడా సంభాషణల ద్వారానే పొందవచ్చు. షాపింగ్‌కు సంబంధం లేని స్మార్ట్ హోమ్ పరికరాల నియంత్రణ, సంగీతం వినడం, ఇంటి పనుల నిర్వహణ వంటి అభ్యర్థనలను అలెక్సా ప్లస్‌కు బదిలీ చేస్తుంది.
అమెజాన్ షాపింగ్ యాప్‌ను అప్‌డేట్ చేసి, దిగువ నావిగేషన్ బార్‌లో కనిపించే అలెక్సా ఐకాన్‌పై క్లిక్ చేయడం ద్వారా ఈ సేవను ప్రారంభించవచ్చు. డెస్క్‌టాప్‌లో వెబ్‌సైట్ పైభాగంలో ఈ ఐకాన్ అందుబాటులో ఉంటుంది. అమెజాన్ ఇండియా ఖాతాలో సైన్ ఇన్ అయిన వినియోగదారులందరికీ ఈ సేవ ఉచితంగా లభిస్తుంది. ప్రైమ్ సభ్యత్వం లేదా ఎకో పరికరం తప్పనిసరి కాదు. రానున్న వారాలు, నెలల్లో భారత్‌లో మరిన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు అమెజాన్ వెల్లడించింది.
తాజావార్తలు
- ●RS Praveen Kumar | కవిత గారు! విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ మీ చేతికెట్లొచ్చింది?
- ●Rahul Gandhi | టీ పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ కోరిక నెరవేర్చిన రాహుల్ గాంధీ
- ●Giri Babu | టాలీవుడ్ సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత
- ●Deeksha Divas | 29న అలుగునూర్‌లో దీక్షా దివస్.. హాజరు కానున్న కేటీఆర్
- ●Romantic OTT | రాణి పద్మిని బంగ్లాలో యువ జంట అడుగుపెడితే - ఓటీటీలోకి ట్విస్ట్‌లతో సాగే రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ
- ●Massive Fire | టెక్స్టైల్ గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు

RS Praveen Kumar | కవిత గారు! విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ మీ చేతికెట్లొచ్చింది?

Rahul Gandhi | టీ పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ కోరిక నెరవేర్చిన రాహుల్ గాంధీ

Giri Babu | టాలీవుడ్ సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత

Deeksha Divas | 29న అలుగునూర్‌లో దీక్షా దివస్.. హాజరు కానున్న కేటీఆర్






