Amazon Great Freedom Sale 2026 | అమెజాన్ గ్రేట్ ఫ్రీడం సేల్ షురూ.. భారీ డిస్కౌంట్ ధరలకు ఫోన్లు..
Amazon Great Freedom Sale 2026 | ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తన ప్లాట్‌ఫామ్‌పై గ్రేట్ ఫ్రీడం సేల్ 2026ను నిర్వహిస్తోంది. ఈ సేల్ గత అర్ధరాత్రి ప్రారంభం కాగా ఇందులో పలు కంపెనీలకు చెందిన ఫోన్లను భారీ తగ్గింపు ధరలకు అందిస్తోంది.
Technology | Published On Aug 8, 2026, 11.58 am IST
Amazon Great Freedom Sale 2026 | ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తన ప్లాట్‌ఫామ్‌పై గ్రేట్ ఫ్రీడం సేల్ 2026ను నిర్వహిస్తోంది. ఈ సేల్ గత అర్ధరాత్రి ప్రారంభం కాగా ఇందులో పలు కంపెనీలకు చెందిన ఫోన్లను భారీ తగ్గింపు ధరలకు అందిస్తోంది. శాంసంగ్, ఇంటెల్ సంస్థల సహకారంతో నిర్వహిస్తున్న ఈ సేల్‌లో ఆయా బ్రాండ్లకు చెందిన ఉత్పత్తులను భారీ తగ్గింపు ధరలకు అందిస్తున్నారు. అలాగే ఫోన్లతోపాటు ఫ్యాషన్, హోమ్ డెకార్, ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయెన్సెస్‌తోపాటు ఇతర అనేక ఉత్పత్తులపై భారీ రాయితీలు, ఆఫర్లను ఇస్తున్నారు. వినియోగదారులు తమ కొనుగోళ్లను మరింత సులభతరం చేసుకోవడానికి అమెజాన్ ప్రత్యేకంగా రుఫస్ ఏఐ అసిస్టెంట్‌ను కూడా అందిస్తోంది.
ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..
ఈ సేల్‌లో భాగంగా శాంసంగ్ కు చెందిన గెలాక్సీ ఎస్25 అల్ట్రా 5జి ఫోన్‌ను తగ్గింపు అనంతరం రూ.89,999కి కొనుగోలు చేయవచ్చు. అలాగే జడ్ ఫోల్డ్ 8 అల్ట్రా ఫోన్‌ను డిస్కౌంట్ అనంతరం రూ.1,90,999కి ఇస్తున్నారు. గెలాక్సీ ఎ56 5జి ఫోన్ ధర రాయితీ అనంతరం రూ.31,999గా ఉంది. గెలాక్సీ ఎం17 5జి ఫోన్‌ను తగ్గింపు తరువాత రూ.16,999కి పొందవచ్చు. ఇక వన్‌ప్లస్ ఫోన్లలో వన్‌ప్లస్ 15ఆర్, 13ఎస్, వన్‌ప్లస్ నార్డ్ 6, నార్డ్ సీఈ6, నార్డ్ సీఈ6 లైట్, వన్‌ప్లస్ ఎన్6, వన్‌ప్లస్ ఎన్6ఎక్స్ మోడల్స్‌ను కూడా తగ్గింపు ధరలకు ఇస్తున్నారు. ఐక్యూకు చెందిన ఐక్యూ 15, 15ఆర్, జడ్11ఎక్స్, జడ్11 లైట్ 5జి ఫోన్లు, షియోమీ 17టి, రెడ్‌మీ టర్బో 5, రెడ్‌మీ ఎ7 ప్రొ 5జి, రియల్‌మి నార్జో 100 ఎక్స్, నార్జో 100 లైట్ 5జి, నథింగ్ ఫోన్ (3) ఫోన్లపై కూడా రాయితీలను ఇస్తున్నారు. లావా అగ్ని 4, బోల్డ్ ఎన్2 5జి, బోల్డ్ ఎన్2 లైట్, బోల్డ్ ఎన్2 ఫోన్లపై ఆకర్షణీయమైన డీల్స్ పొందవచ్చు.
హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో..
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్ కార్డు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. క్రెడిట్ కార్డు కొనుగోళ్లపై గరిష్టంగా రూ.750, ఈఎంఐ లావాదేవీలపై రూ.1250 వరకు తగ్గింపు లభిస్తోంది. అలాగే ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, అమెజాన్ అలెక్సా పరికరాలు, ఎకో డాట్ ఉత్పత్తులు, వైర్‌లెస్ ఇయర్‌ఫోన్లు, ఇయర్‌బడ్స్, రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్లు, ఇతర గృహోపకరణాలను సైతం తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు. స్లో జ్యూసర్లు, స్టాండ్ మిక్సర్లు, డ్యాష్ క్యామ్‌లు, ప్రెషర్ వాషర్లు, సోలార్ లైట్లు తదితర ఉత్పత్తులపై 60 శాతం డిస్కౌంట్ లభిస్తోంది.
ఈజీ ఈఎంఐ సదుపాయం..
సేల్ సందర్భంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఈజీ ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తున్నారు. మొబైల్స్, యాక్సెసరీలపై 40 శాతం వరకు, హోమ్, కిచెన్, టాయ్స్, అవుట్‌డోర్ ఉత్పత్తులపై 80 శాతం వరకు, ఫ్యాషన్, బ్యూటీ ఉత్పత్తులపై 80 శాతం, ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీలపై 80 శాతం, రోజువారీ అవసరాల ఉత్పత్తులపై 60 శాతం, హోమ్ అప్లయెన్సెస్‌పై 65 శాతం, స్మార్ట్ టీవీలపై 65 శాతం, పుస్తకాలు, టాయ్స్‌పై 80 శాతం వరకు, హోల్‌సేల్ కొనుగోళ్లపై 80 శాతం వరకు, విమాన టికెట్ బుకింగ్‌లపై 21 శాతం, అమెజాన్ బ్రాండ్లపై 80 శాతం, ఎకో విత్ అలెక్సా, ఫైర్ టీవీ పరికరాలపై 35 శాతం, కొత్త బ్రాండ్లపై 70 శాతం వరకు తగ్గింపు ధరలు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 ప్రస్తుతం ప్రారంభం అవగా వినియోగదారులు అమెజాన్ సేల్ పేజీని సందర్శించి అన్ని ఆఫర్ల వివరాలను తెలుసుకోవచ్చు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

OnePlus Festive Sale | వన్‌ప్లస్ ఫెస్టివ్ సేల్.. రూ.14,999కే 5జి ఫోన్..
అక్టోబర్ 3, 2026

Amazon India | అమెజాన్ ఆసక్తికర సర్వే.. ఫోన్లలో ఏఐ ఫీచర్లను కోరుకుంటున్న యూజర్లు..
ఆగస్టు 21, 2026

iQOO Hackathon 2026 | డెవలపర్లు, విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఐక్యూ హ్యాకథాన్ ప్రైజ్ మనీ రూ.25 లక్షలు..
ఆగస్టు 19, 2026
తాజావార్తలు
- ●Men's Hockey Team | ఆసియా క్రీడల్లో హాకీ గోల్డ్.. మలేసియాపై భారత్ సూపర్ విక్టరీ.. ఒలింపిక్స్‌కు అర్హత
- ●ఆఫర్లో కొన్నారా.. ఆఫర్ చూసి కొన్నారా? పండుగ షాపింగ్‌లో అసలు లెక్క ఇదే!
- ●Tiger | అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పెద్ద పులి దర్శనం..
- ●CM Revanth Reddy | కొత్త ఆస్పత్రుల్లో అత్యాధునిక పరికరాలు సమకూర్చండి
- ●Captain Smit Machchhar | భారత పైలట్ స్మిత్ మచ్చర్‌ను ఆస్పత్రిలో పరామర్శించి ప్రశంసించిన దుబాయ్ యువరాజు
- ●Artificial Intelligence | ఏఐతో ఆర్థిక నిపుణుల కొలువులకు ఎసరు.. స్వల్ప ఛార్జీలకే సలహాలు..

Men's Hockey Team | ఆసియా క్రీడల్లో హాకీ గోల్డ్.. మలేసియాపై భారత్ సూపర్ విక్టరీ.. ఒలింపిక్స్‌కు అర్హత

ఆఫర్లో కొన్నారా.. ఆఫర్ చూసి కొన్నారా? పండుగ షాపింగ్‌లో అసలు లెక్క ఇదే!

Tiger | అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పెద్ద పులి దర్శనం..

CM Revanth Reddy | కొత్త ఆస్పత్రుల్లో అత్యాధునిక పరికరాలు సమకూర్చండి



