Vivo S2 | భారీ బ్యాటరీ, పవర్‌ఫుల్ డిస్‌ప్లేతో లాంచ్ అయిన వివో ఎస్2 స్మార్ట్ ఫోన్.. ధర ఎంతంటే..
Vivo S2 | చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో భారత మార్కెట్లో తన ఎస్ సిరీస్‌ను మళ్లీ తీసుకొచ్చింది. కంపెనీ ప్రకటించినట్లుగానే కొత్త వివో ఎస్2 స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా విడుదల చేసింది. ప్రీమియం మిడ్‌రేంజ్ విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ ఫోన్‌లో ఆకర్షణీయమైన డిజైన్, మెరుగైన కెమెరా సామర్థ్యాలు, శక్తివంతమైన పనితీరు, భారీ బ్యాటరీ వంటి ఫీచర్లను అందించింది.
Technology | Published On Aug 7, 2026, 11.58 am IST
Vivo S2 | చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో భారత మార్కెట్లో తన ఎస్ సిరీస్‌ను మళ్లీ తీసుకొచ్చింది. కంపెనీ ప్రకటించినట్లుగానే కొత్త వివో ఎస్2 స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా విడుదల చేసింది. ప్రీమియం మిడ్‌రేంజ్ విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ ఫోన్‌లో ఆకర్షణీయమైన డిజైన్, మెరుగైన కెమెరా సామర్థ్యాలు, శక్తివంతమైన పనితీరు, భారీ బ్యాటరీ వంటి ఫీచర్లను అందించింది. వివో ఎస్2 మూడు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. సిల్క్ వైట్, సఫైర్ బ్లూ, రీగల్ బ్రాంజ్ కలర్ ఆప్షన్లలో ప్రత్యేక టెక్స్చర్లు, మెటాలిక్ ఫినిష్‌ను ఉపయోగించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.83 ఇంచుల 3డి కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. 1.5కె అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్‌డీఆర్10 ప్లస్ సపోర్ట్, గరిష్ఠంగా 3000 నిట్స్ లోకల్ పీక్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. అందువల్ల డిస్‌ప్లే చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది.
అద్భుతమైన కెమెరాలు..
ఫొటోగ్రఫీ ప్రియులను దృష్టిలో ఉంచుకుని వివో ఎస్2లో 50 మెగాపిక్సల్ సోనీ ప్రధాన కెమెరాను అందించారు. దీనికి తోడు 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్ ఉంది. సెల్ఫీల కోసం 32 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ముందు, వెనుక కెమెరాలతో 4కె వీడియో రికార్డింగ్ చేయవచ్చు. డ్యుయల్ వ్యూ వీడియో ఫీచర్‌తో ఒకేసారి ముందు, వెనుక కెమెరాల ద్వారా వీడియోలు చిత్రీకరించవచ్చు. నైట్, పోర్ట్రెయిట్, పనోరమా, అల్ట్రా హెచ్‌డీ డాక్యుమెంట్, స్లో మోషన్, టైమ్‌లాప్స్, సూపర్‌మూన్, ప్రొ, ఫుడ్, డ్యుయల్ వ్యూ వంటి పలు కెమెరా మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఏఐ ఎరేజ్ 2.0 ద్వారా ఫొటోల్లోని అనవసర బ్యాక్‌గ్రౌండ్ అంశాలను తొలగించే సదుపాయం కల్పించారు. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఇచ్చారు. 8 జీబీ, 12 జీబీ ర్యామ్, 256 జీబీ, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లలో ఈ ఫోన్ లాంచ్ అయింది. ర్యామ్‌ను అదనంగా మరో 8జీబీ వరకు వర్చువల్‌గా పెంచుకునే సదుపాయం కల్పించారు. దీని వల్ల ఫోన్ ఎలాంటి ల్యాగ్ లేకుండా వేగంగా పనిచేస్తుంది.
భారీ బ్యాటరీ..
ఫోన్‌లో 3810 చదరపు మిల్లీమీటర్ల వేపర్ ఛాంబర్ కలిగిన అల్ట్రా లార్జ్ వీసీ స్మార్ట్ కూలింగ్ సిస్టమ్‌ను అమర్చారు. దీని వల్ల ఫోన్ ఎక్కువ హీట్‌కు గురి కాకుండా అడ్డుకోవచ్చు. వివో ఎస్2లో 7,050 ఎంఏహెచ్ సామర్థ్యంతో భారీ బ్యాటరీని అందించారు. దీనికి 44 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. బ్యాటరీ లైఫ్ ఎక్స్‌టెండర్ టెక్నాలజీ ద్వారా బ్యాటరీ జీవితకాలాన్ని పెంచే ఫీచర్‌ను కూడా అందించారు. మన్నిక విషయంలో ఈ ఫోన్‌కు ఐపీ68, ఐపీ69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌లు ఉన్నాయి. మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ ప్రమాణాలను కూడా ఇది కలిగి ఉంది. అందువల్ల బిల్డ్ క్వాలిటీ చాలా దృఢంగా ఉంటుంది. ఇన్ డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, యూఎస్‌బీ టైప్ సి పోర్ట్, వైఫై 6, బ్లూటూత్ 5.4, 5జి కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఏఐ ఆధారిత టూల్స్..
ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 6తో పనిచేస్తుంది. షేక్ అండ్ షేర్, ఆరిజిన్ ఐలాండ్, డ్రాగ్ అండ్ గో వంటి ఫీచర్లతోపాటు ఏఐ క్రియేషన్, ఏఐ క్యాప్షన్స్, గూగుల్ సర్కిల్ టు సెర్చ్, గూగుల్ జెమిని సపోర్ట్, ఏఐ స్మార్ట్ కాల్ అసిస్టెంట్ వంటి ఏఐ ఆధారిత టూల్స్‌ను అందించారు. అలాగే వివో ఆఫీస్ కిట్ ద్వారా పీసీతో స్క్రీన్ మిర్రరింగ్, ఫైల్ ట్రాన్స్‌ఫర్, టాస్క్ హ్యాండాఫ్, నోట్స్ సింక్, సూపర్ క్లిప్‌బోర్డ్ వంటి ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు. వివో ఎస్2 ఫోన్‌కు చెందిన 8 జీబీ, 128 జీబీ వేరియంట్ ధర రూ.39,999 ఉండగా, 8 జీబీ, 256 జీబీ వేరియంట్ ధరను రూ.44,999గా నిర్ణయించారు. ఆగస్టు 11 నుంచి వివో అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, దేశవ్యాప్తంగా భాగస్వామ్య రిటైల్ స్టోర్లలో విక్రయించనున్నారు.
లాంచ్ ఆఫర్లు..
లాంచ్ ఆఫర్లలో భాగంగా ఆఫ్‌లైన్ కొనుగోలుదారులకు ఎంపిక చేసిన బ్యాంకుల కార్డులతో గరిష్ఠంగా 10 శాతం ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్, 15 నెలల వరకు జీరో డౌన్ పేమెంట్ స్కీమ్‌లు, 10 శాతం ఎక్స్‌చేంజ్ బోనస్, వి-షీల్డ్ స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్‌పై 40 శాతం తగ్గింపు, ఒక సంవత్సరం ఉచిత ఎక్స్‌టెండెడ్ వారంటీ లభిస్తాయి. అలాగే జియో ద్వారా 18 నెలల పాటు 5000 జీబీ క్లౌడ్ స్టోరేజ్‌తోపాటు గూగుల్ జెమిని ప్రొ ఉచిత యాక్సెస్ లభిస్తుంది. ఆన్‌లైన్ కొనుగోలుదారులకు ఎంపిక చేసిన బ్యాంకులతో 10 శాతం ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్, 10 శాతం ఎక్స్‌చేంజ్ బోనస్, 15 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ, ఒక సంవత్సరం ఉచిత ఎక్స్‌టెండెడ్ వారంటీతోపాటు జియో 5000 జీబీ క్లౌడ్ స్టోరేజ్, గూగుల్ జెమిని ప్రొ యాక్సెస్ ఆఫర్ కూడా వర్తిస్తుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Samsung Galaxy F70 Pro 5G | తక్కువ ధరకే శాంసంగ్ కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్.. భారీ బ్యాటరీ, 6 ఏళ్ల వరకు అప్డేట్స్..
ఆగస్టు 4, 2026

vivo T5e | వివో నుంచి టి5ఇ స్మార్ట్ ఫోన్.. భారీ బ్యాటరీ, ధర తక్కువ..
జులై 27, 2026

Amazfit BIP Max | అమేజ్‌ఫిట్ నుంచి కొత్త స్మార్ట్ వాచ్.. 20 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్..
జూన్ 10, 2026
తాజావార్తలు
- ●Doctor Suspended | తనకు బదులు విధులకు మరో వ్యక్తి.. జోగిపేట ఏరియా హాస్పిటల్ డాక్టర్‌పై సస్పెన్షన్ వేటు
- ●Shaking well | బావిలో నిరంతరం ఎగసిపడుతున్న అలలు.. వీడియో వైరల్
- ●Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులకు ఇదే సమయం..?
- ●Husnabad | హుస్నాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రూ.33.70 కోట్లు మంజూరు..
- ●Stock Markets | ఐటీ షేర్ల జోష్.. మార్కెట్లకు మళ్లీ బ్రేక్.. సెన్సెక్స్ 242 పాయింట్లు డౌన్..
- ●Harish Rao | నేతన్న బతికితేనే.. మన చేనేత బతుకుతుంది: హరీశ్ రావు

Doctor Suspended | తనకు బదులు విధులకు మరో వ్యక్తి.. జోగిపేట ఏరియా హాస్పిటల్ డాక్టర్‌పై సస్పెన్షన్ వేటు

Shaking well | బావిలో నిరంతరం ఎగసిపడుతున్న అలలు.. వీడియో వైరల్

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులకు ఇదే సమయం..?

Husnabad | హుస్నాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రూ.33.70 కోట్లు మంజూరు..



