Samsung Galaxy F70 Pro 5G | తక్కువ ధరకే శాంసంగ్ కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్.. భారీ బ్యాటరీ, 6 ఏళ్ల వరకు అప్‌డేట్స్..
Samsung Galaxy F70 Pro 5G | శాంసంగ్ భారత మార్కెట్లో తన కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్70 ప్రొ 5జిని అధికారికంగా విడుదల చేసింది. ప్రీమియం డిజైన్, శక్తివంతమైన పనితీరు, దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, భారీ బ్యాటరీ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ మిడ్ రేంజ్ వినియోగదారులను లక్ష్యంగా తీసుకొచ్చింది.
Technology | Published On Aug 4, 2026, 2.19 pm IST
Samsung Galaxy F70 Pro 5G | శాంసంగ్ భారత మార్కెట్లో తన కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్70 ప్రొ 5జిని అధికారికంగా విడుదల చేసింది. ప్రీమియం డిజైన్, శక్తివంతమైన పనితీరు, దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, భారీ బ్యాటరీ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ మిడ్ రేంజ్ వినియోగదారులను లక్ష్యంగా తీసుకొచ్చింది. డిజైన్ పరంగా గెలాక్సీ ఎఫ్70 ప్రొ 5జి ఫ్లాట్ రియర్ ప్యానెల్‌తో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. వెనుక భాగంలో పిల్ షేప్ కెమెరా మాడ్యూల్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించారు. ఈ ఫోన్ అరోరా గ్రీన్, ఆల్ఫా బ్లాక్ రంగుల్లో లభిస్తోంది. వెనుక భాగంలో లెదర్ తరహా టెక్స్చర్డ్ ఫినిష్ ఇవ్వడం వల్ల ప్రీమియం లుక్‌ను అందించారు. అలాగే దుమ్ము, నీటి చినుకుల నుంచి రక్షణ కోసం ఐపీ64 రేటింగ్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.7 ఇంచుల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ ఇన్‌ఫినిటీ-ఓ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌తో స్క్రోలింగ్ మరింత స్మూత్‌గా ఉంటుంది. దీంతో పాటు వీడియోలు, గేమింగ్ అనుభవం మెరుగ్గా ఉంటుంది. డిస్‌ప్లే 800 నిట్స్ హెచ్‌బీఎం బ్రైట్‌నెస్, 1400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. అలాగే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ రక్షణను కూడా అందించారు.
6 ఏళ్ల వరకు అప్ డేట్స్..
పనితీరు కోసం ఈ ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 5జి ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇందులో అడ్రెనో 710 జీపీయూ ఉంటుంది. ఫోన్ 6 జీబీ, 8 జీబీ ర్యామ్ ఆప్షన్‌లలో లభిస్తోంది. 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉండగా, మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా 2 టీబీ వరకు స్టోరేజ్‌ను పెంచుకునే అవకాశం కూడా ఉంది. సాఫ్ట్‌వేర్ పరంగా ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత శాంసంగ్ వన్ యూఐ 8.5తో పనిచేస్తుంది. శాంసంగ్ ప్రత్యేకతగా ఈ ఫోన్‌కు 6 సంవత్సరాల పాటు ఆపరేటింగ్ సిస్టమ్, సెక్యూరిటీ అప్‌డేట్లను అందించనున్నట్లు ప్రకటించింది. ఈ విభాగంలో ఇది పెద్ద ఆకర్షణగా నిలుస్తోంది. ఫొటోగ్రఫీ కోసం వెనుక భాగంలో 50 మెగాపిక్సల్ ప్రధాన కెమెరాను, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్)తో అందించారు. దీంతో పాటు 5 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సల్ మాక్రో సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 12 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాను ఏర్పాటు చేశారు.
ధర వివరాలు..
ఈ ఫోన్‌లో 6,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని అందించారు. ఒకసారి పూర్తిగా చార్జ్ చేస్తే రోజంతా సౌకర్యవంతంగా ఉపయోగించుకునేలా రూపొందించారు. అలాగే 45 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఉంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, స్టీరియో స్పీకర్లు, యూఎస్‌బీ టైప్ సి ఆడియో, 5జి, 4జీ వీవోఎల్టీఈ, వై- 802.11 ఏసీ, బ్లూటూత్ 5.3, జీపీఎస్, గ్లోనాస్, ఎన్‌ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఫోన్‌లో హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ సపోర్ట్ కూడా ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్70 ప్రొ 5జి ప్రారంభ ధర రూ.25,999 కాగా, ప్రత్యేక ప్రారంభ ఆఫర్‌లో భాగంగా రూ.23,999కు అందిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 8 నుంచి ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ లో విక్రయానికి అందుబాటులోకి రానుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Galaxy Z Fold 8 | గెలాక్సీ జడ్ ఫోల్డ్ 8, ఫ్లిప్ 8 సేల్స్ షురూ.. 30 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ..
ఆగస్టు 14, 2026

Motorola | 10,200 ఎంఏహెచ్ బ్యాటరీ, 5జి ఫీచర్లతో లాంచ్ అయిన మోటోరోలా కొత్త ట్యాబ్.. ధర ఎంతంటే..
ఆగస్టు 8, 2026

HP OmniPad 12 | విద్యార్థులు, ఉద్యోగులకు హెచ్‌పీ ప్రత్యేక ట్యాబ్.. ఉచిత ఏఐ సబ్స్క్రిప్షన్..
ఆగస్టు 7, 2026
తాజావార్తలు
- ●Sanjay Kalvakuntla vs Kishan Reddy | కేంద్రం ఒక్క మెడికల్ సీటు ఇచ్చిందని నిరూపిస్తే రాజీనామా చేస్తా
- ●Lava Virat Curve | లావా విరాట్ కర్వ్ వచ్చేసింది.. వెనుక మరో డిస్‌ప్లే..
- ●V Hanumantha Rao | కాంగ్రెస్ ఇచ్చిన భూములను కాంగ్రెస్సే కాపాడాలి
- ●Sonia Gandhi | పౌరసత్వం అంశం.. సోనియా గాంధీకి చుక్కెదురు
- ●Indian Railways | యూపీఐ ద్వారా రైలు టిక్కెట్లను కొంటే ఛార్జీలు ఉంటాయా.. రైల్వే శాఖ స్పష్టత..
- ●Ponguleti Srinivas Reddy | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అలర్ట్.. మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం

Sanjay Kalvakuntla vs Kishan Reddy | కేంద్రం ఒక్క మెడికల్ సీటు ఇచ్చిందని నిరూపిస్తే రాజీనామా చేస్తా

Lava Virat Curve | లావా విరాట్ కర్వ్ వచ్చేసింది.. వెనుక మరో డిస్‌ప్లే..

V Hanumantha Rao | కాంగ్రెస్ ఇచ్చిన భూములను కాంగ్రెస్సే కాపాడాలి

Sonia Gandhi | పౌరసత్వం అంశం.. సోనియా గాంధీకి చుక్కెదురు



