Xiaomi 17 Ultra | 200MP టెలిఫొటో కెమెరాతో వచ్చిన షియోమీ 17 అల్ట్రా.. ధర ఎంతంటే..?
Xiaomi 17 Ultra | స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమీ కొత్తగా షియోమీ 17 పేరిట ఓ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అదే సిరీస్‌లో షియోమీ 17 అల్ట్రా పేరిట మరో నూతన ఫ్లాగ్ షిప్ ఫోన్‌ను కూడా భారత మార్కెట్‌లో విడుదల చేసింది.
Technology | Published On Mar 11, 2026, 3.23 pm IST
Xiaomi 17 Ultra | స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమీ కొత్తగా షియోమీ 17 పేరిట ఓ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అదే సిరీస్‌లో షియోమీ 17 అల్ట్రా పేరిట మరో నూతన ఫ్లాగ్ షిప్ ఫోన్‌ను కూడా భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ప్రపంచంలోనే తొలిసారిగా లైకా కంపెనీకి చెందిన 1 ఇంచు LOFIC సెన్సార్‌తో వచ్చిన ఫోన్ ఇదేనని కంపెనీ తెలిపింది. ఇందులో వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను ఇచ్చారు. ముఖ్యంగా 200 మెగాపిక్సల్ కెమెరాను టెలిఫొటో సెన్సార్‌గా అందించారు. స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌ను ఈ ఫోన్‌లో ఇచ్చారు. 6.9 ఇంచుల డిస్‌ప్లే ఉంది. 6000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ కలిగిన బ్యాటరీని ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌ను మార్చి 18 నుంచి విక్రయించనున్నట్లు కంపెనీ తెలిపింది.
200 మెగాపిక్సల్ టెలిఫొటో కెమెరా..
షియోమీ 17 అల్ట్రా స్మార్ట్ ఫోన్‌లో వెనుక వైపు 1 ఇంచు లైట్ ఫ్యూషన్ 1050ఎల్ సెన్సార్ ఉండగా, మరో 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాను ఇచ్చారు. అలాగే 200 మెగాపిక్సల్ టెలిఫొటో సెన్సార్ కూడా ఉంది. దీంతో గరిష్టంగా 120ఎక్స్ వరకు డిజిటల్ జూమ్‌ను పొందవచ్చు. అలాగే ఆప్టికల్ జూమ్ కూడా లభిస్తుంది. ఇక వెనుక వైపు మరో 50 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరాను కూడా ఇచ్చారు. వెనుక కెమెరాల సహాయంతో 8కె వీడియోలను రికార్డు చేసుకోవచ్చు. ముందు వైపు 50 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ ఇందులో ఉండగా, 16జీబీ వరకు ర్యామ్, 512జీబీ వరకు స్టోరేజ్ లభిస్తున్నాయి. క్వాల్ కామ్ ఏఐ ఇంజిన్‌ను ఇచ్చిన కారణంగా ఏఐ ఫీచర్లను మరింత మెరుగ్గా ఉపయోగించుకోవచ్చు. ఇందులో ఆండ్రాయిడ్ 16 ఆధారిత షియోమీ హైపర్ ఓఎస్3ని అందిస్తున్నారు.
అద్భుతమైన డిస్‌ప్లే..
షియోమీ 17 అల్ట్రా ఫోన్‌లో 6.9 ఇంచుల షియోమీ హైపర్ ఆర్‌జీబీ ఓలెడ్ డిస్‌ప్లే ఉండగా దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ లభిస్తోంది. దీని వల్ల డిస్‌ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. తెరపై అద్భుతమైన దృశ్యాలను వీక్షించవచ్చు. 3500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌ను ఇచ్చారు కనుక సూర్యకాంతిలోనూ ఈ ఫోన్ తెరను స్పష్టంగా చూడవచ్చు. హెచ్‌డీఆర్ 10 ప్లస్, డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది కనుక వీడియోలు అద్భుతమైన క్వాలిటీతో ప్లే అవుతాయి. ఐపీ68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. డిస్‌ప్లేకు షియోమీ షీల్డ్ గ్లాస్ 3.0 ప్రొటెక్షన్‌ను ఇచ్చారు. వెట్ టచ్ ఉన్నందున తడి వేళ్లతోనూ ఫోన్‌ను సులభంగా ఆపరేట్ చేయవచ్చు.
ధర వివరాలు..
ఈ ఫోన్‌లో 6000ఎంఏహెచ్ భారీ కెపాసిటీ కలిగిన బ్యాటరీని ఇవ్వగా దీనికి 90 వాట్ల ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ల వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్‌ను ఇచ్చారు. ఈ ఫోన్ ను అత్యంత సన్నని మందంతో రూపొందించామని షియోమీ తెలిపింది. షియోమీ 17 అల్ట్రా ఫోన్‌కు చెందిన 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ మోడల్ సింగిల్ వేరియెంట్ ధరను రూ.1,39,999 గా నిర్ణయించారు. ఈ ఫోన్‌పై ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుల ద్వారా రూ.10వేల వరకు తగ్గింపు పొందవచ్చు. మార్చి 13 నుంచి 17 వరకు అందిస్తున్న ఎర్లీ బర్డ్ ఆఫర్‌లో షియోమీ ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీ కిట్ ప్రొను ఉచితంగా పొందవచ్చు. దీని ధర రూ.19,999గా ఉంది.
సంబంధిత వార్తలు

OPPO Find X9 Ultra | ఓప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా లాంచ్.. కెమెరా ప్రేమికుల కోసం పవర్ఫుల్ ఫ్లాగ్షిప్..
మే 21, 2026

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026

Surface Pro for Business | నూతన తరం సర్ఫేస్ బిజినెస్ ల్యాప్ టాప్‌లను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్.. అద్భుతమైన ఫీచర్లు..
మే 20, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



