PV Sindhu | వెండి బతుకమ్మతో పీవీ సింధు.. నెటిజన్ విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్..
PV Sindhu | బతుకమ్మ (Bathukamma) పండుగ సందర్భంగా బ్యాట్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు (PV Sindhu) సోషల్ మీడియా వేదికగా పోస్టు చేసిన ఓ ఫొటో చర్చనీయాంశమైంది.
PV Sindhu | త్రినేత్ర న్యూస్: బతుకమ్మ (Bathukamma) పండుగ సందర్భంగా బ్యాట్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు (PV Sindhu) సోషల్ మీడియా వేదికగా పోస్టు చేసిన ఓ ఫొటో చర్చనీయాంశమైంది. ప్రకృతితో మమేకమయ్యే బతుకమ్మ పండుగలోని రంగులు, అందమైన పూలు, సందడి వాతావరణాన్ని ఈ ఏడాది ఎంతో మిస్ అవుతున్నానంటూ.. గతేడాది బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అందులో వెండితో తయారుచేసిన బతుకమ్మను (Silver Bathukamma) చేతిలో పట్టుకుని ఉంది. ఆ ఫొటోపై ఓ నెటిన్ కామెంట్ చేస్తూ.. ‘పూలు పేర్చితేనే బతుకమ్మ అంటారు.. మీ పైత్యాన్ని పండుగపై రుద్దకండి’ అని విమర్శించాడు. విమర్శలు చేసే ముందు తెలంగాణ సంప్రదాయాన్ని అర్థం చేసుకోవాలంటూ ఆ నెటిజన్‌కు సింధు కౌంటర్ ఇచ్చింది.
తన పుట్టింటి కుటుంబంలో బతుకమ్మ పండుగను జరుపుకునే సంప్రదాయం లేదని సింధు తెలిపారు. `కరీంనగర్‌కు చెందిన కుటుంబంలోకి కోడలిగా వెళ్లిన తర్వాతే తనకు బతుకమ్మ పండుగతో అనుబంధం ఏర్పడింది. ఈ ఫొటోలో వెనుక కనిపిస్తున్న పెద్ద పూల బతుకమ్మను స్వయంగా నేనే ఎంతో ఇష్టంగా, రోజంతా సమయం కేటాయించి పేర్చాను. ఆ పూల బతుకమ్మతోనే మేము పండుగను జరుపుకున్నాం. ఇక వెండి బతుకమ్మ విషయానికి వస్తే.. అది మా అత్తగారు నాపై చూపించిన ప్రేమకు గుర్తు. తెలంగాణ సంప్రదాయంలోకి తనను ఆప్యాయంగా ఆహ్వానించేందుకు ఆమె ఇచ్చిన బహుమతి` అని చెప్పింది. ఏదైనా అభిప్రాయానికి వచ్చే ముందు ఎదుటి వ్యక్తుల సంప్రదాయాన్ని అర్థం చేసుకోవాలని సూచించింది.
Before passing judgment, please understand the tradition ❤️
We don’t traditionally celebrate Bathukamma in my family, so this was my very first! And I’ve married into a family from the very heart of Telangana - Karimnagar.
See that rather large floral Bathukamma in the background ? I spent pretty much the whole day decorating it 😂, and that’s what we celebrated with!
The silver Bathukamma was my mother-in-law’s way of welcoming me into a tradition that’s so close to her heart ❤️
Surely, there’s room for a mother’s love alongside tradition ❤️
— PV Sindhu (@Pvsindhu1) October 18, 2026
తాజావార్తలు
- ●Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు జరిపింది వీరే..
- ●Road Accident | రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. 20 మంది ప్రయాణికులకు గాయాలు
- ●BHEL | ఐటీఐ అర్హతతో బీహెచ్ఈఎల్లో 660 ఆర్టిసన్ ఉద్యోగాలు
- ●Ananda Nilayam | తిరుమల బంగారు గోపురం.. తొలిసారి స్వర్ణ తాపడం చేయించింది ఎవరు?
- ●Conjoined Twins | ఒకే శరీరం.. రెండు తలలతో జన్మించిన బాలుడు.. శ్వాసకోశ సమస్యతో వారం రోజులు పోరాడి..
- ●Horoscope | అక్టోబర్ 19 రాశిఫలాలు.. ఈ రాశి వారికి ప్రయాణాలలో జాగ్రత్త అవసరం!

Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు జరిపింది వీరే..

Road Accident | రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. 20 మంది ప్రయాణికులకు గాయాలు

BHEL | ఐటీఐ అర్హతతో బీహెచ్ఈఎల్లో 660 ఆర్టిసన్ ఉద్యోగాలు

Ananda Nilayam | తిరుమల బంగారు గోపురం.. తొలిసారి స్వర్ణ తాపడం చేయించింది ఎవరు?






