Supreme Court | సోషల్ మీడియా ముప్పు నుంచి పిల్లలకు రక్షణ కోరుతూ పిల్.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
Supreme Court | సోషల్ మీడియా (social media) ముప్పు నుంచి పిల్లల్ని రక్షించేందుకు సమగ్రమైన, పటిష్ఠమైన నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై స్పందన కోరుతూ కేంద్ర ప్రభుత్వం, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు సుప్రీంకోర్టు (Supreme Court) నోటీసులు జారీ చేసింది.
Supreme Court | త్రినేత్ర న్యూస్ : సోషల్ మీడియా ముప్పు (social media risks) నుంచి పిల్లల్ని రక్షించేందుకు సమగ్రమైన, పటిష్ఠమైన నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు (Supreme Court) స్పందించింది. ఈ పిల్‌పై స్పందన కోరుతూ కేంద్ర ప్రభుత్వం, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు (NCPCR) అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
ఇండోర్‌లోని ఎమరాల్డ్ హైట్స్ ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ సిద్ధార్థ్ సింగ్ ఈ పిటిషన్ వేశారు. సోషల్ మీడియా వాడకానికి కనీస వయసు నిబంధనలు, తల్లిదండ్రుల అనుమతి, పిల్లల ఖాతాలకు ప్రత్యేక ప్రైవసీ సెట్టింగ్‌లు, ఆన్లైన్ వేధింపుల నుంచి రక్షణ కల్పించే మార్గదర్శకాలు రూపొందించాలని పిటిషన్లో కోరారు. నిర్దిష్ట వయస్సు కంటే తక్కువ ఉన్న పిల్లలకు సోషల్ మీడియాను పూర్తిగా నిషేధించాలని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియా వల్ల పిల్లలు సైబర్ బుల్లీయింగ్, వేధింపులు, హానికర కంటెంట్, అపరిచితుల నుంచి ప్రమాదకర పరిచయాలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అతిగా స్క్రీన్ సమయం గడపడం వల్ల పిల్లల్లో తీవ్రమైన ఆందోళన (Anxiety), డిప్రెషన్, నిద్రలేమి, చదువులు, ఆటలపై ఆసక్తి తగ్గడం, బాడీ-ఇమేజ్ సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పిల్లల ఖాతాలకు తప్పనిసరి ప్రైవసీ సెట్టింగ్‌లు, వయసుకు తగిన యాక్సెస్, హానికర కంటెంట్‌పై ఆంక్షలు విధించేలా మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషనర్లు అభ్యర్థించారు.
ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ (Chief Justice Surya Kant), జస్టిస్ జాయ్ మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ మేరకు పిటిషన్‌పై స్పందన కోరుతూ కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, న్యాయ మంత్రిత్వ శాఖలతో పాటు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR)కు కోర్టు నోటీసులు పంపింది. ఇదే అంశంపై ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న మరో పిటిషన్‌తో దీనిని జత చేసిన ధర్మాసనం.. తదుపరి విచారణను డిసెంబర్ 7కు వాయిదా వేసింది.
Also Read..
పార్లమెంటును ప్రొరోగ్ చేయడంలో ఆలస్యం.. ప్రధాని మోదీకి ఖర్గే లేఖ
శుక్రవారం ఒక్కరోజే ఓటీటీలో 30 సినిమాలు రిలీజ్ - ఒక్కోటి ఒక్కో జానర్
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Supreme Court | వ్యాపారులకు నష్టం జరిగితే చూస్తూ ఊరుకోం.. సీజేపీ నిరసనలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
అక్టోబర్ 16, 2026

Supreme Court Women Journalists Plea | రీల్స్ చేసేవారెవరో, జర్నలిస్ట్ ఎవరో ఎలా తెలుస్తుంది?
అక్టోబర్ 15, 2026

Jantar Mantar Protest Site Ban | జంతర్ మంతర్‌పై నిషేధం.. కేంద్రానికి సుప్రీంకోర్టు హెచ్చరిక
అక్టోబర్ 15, 2026
తాజావార్తలు
- ●OTT Releases | శుక్రవారం ఒక్కరోజే ఓటీటీలో 30 సినిమాలు రిలీజ్ - ఒక్కోటి ఒక్కో జానర్
- ●Tummala Nageshwar Rao | వైటీపీఎస్‌కు మహానది బొగ్గును కేటాయించండి..
- ●Amazon Business | అమెజాన్ బంపర్ ఆఫర్.. కార్పొరేట్ గిఫ్ట్స్‌పై 80 శాతం వరకు తగ్గింపు..
- ●Special Trains | పండుగ రద్దీకి ప్రత్యేక రైళ్లు.. మూడు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే..
- ●Vodafone Idea | వొడాఫోన్ ఐడియా (వీఐ) సరికొత్త ప్రయోగం.. ప్రీపెయిడ్ ప్లాన్లలోనూ ఫ్యామిలీ షేరింగ్..
- ●Ramachander Rao | దేశంలో అధికార మార్పిడికి కుట్ర : రామచందర్ రావు

OTT Releases | శుక్రవారం ఒక్కరోజే ఓటీటీలో 30 సినిమాలు రిలీజ్ - ఒక్కోటి ఒక్కో జానర్

Tummala Nageshwar Rao | వైటీపీఎస్‌కు మహానది బొగ్గును కేటాయించండి..

Amazon Business | అమెజాన్ బంపర్ ఆఫర్.. కార్పొరేట్ గిఫ్ట్స్‌పై 80 శాతం వరకు తగ్గింపు..

Special Trains | పండుగ రద్దీకి ప్రత్యేక రైళ్లు.. మూడు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే..



