CNAP | ఇక ట్రూకాలర్ అవసరం లేదు.. కాల్ ఎవరు చేస్తున్నారో తెలిసిపోతుంది..
CNAP | దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తున్న వినియోగదారులకు ప్రస్తుతం రోజూ ఎన్ని స్పామ్ కాల్స్ వస్తున్నాయో అందరికీ తెలిసిందే. మోసపూరిత కాల్స్‌తోపాటు ప్రకటనల పేరిట చాలా మంది స్పామ్‌కు పాల్పడుతున్నారు. రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, లోన్లు, క్రెడిట్ కార్డులు ఇలా రకరకాలుగా మొబైల్ ఫోన్ వినియోగదారులకు చాలా మంది ప్రకటనల పేరిట కాల్స్ చేస్తున్నారు.
Technology | Published On Dec 28, 2025, 9.56 am IST
CNAP | దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తున్న వినియోగదారులకు ప్రస్తుతం రోజూ ఎన్ని స్పామ్ కాల్స్ వస్తున్నాయో అందరికీ తెలిసిందే. మోసపూరిత కాల్స్‌తోపాటు ప్రకటనల పేరిట చాలా మంది స్పామ్‌కు పాల్పడుతున్నారు. రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, లోన్లు, క్రెడిట్ కార్డులు ఇలా రకరకాలుగా మొబైల్ ఫోన్ వినియోగదారులకు చాలా మంది ప్రకటనల పేరిట కాల్స్ చేస్తున్నారు. అలాగే సైబర్ నేరాలకు సంబంధించిన కాల్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. దీంతో మొబైల్ ఫోన్ వినియోగదారులు ఎంతో విలువైన సమయాన్ని, డబ్బును నష్టపోతున్నారు. అవతలి వైపు కాల్స్ చేస్తున్న వారు ఎవరో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఒక వేళ పూర్తిగా అవాంఛిత కాల్స్‌ను బ్లాక్ చేస్తే, ఎవరైనా మనకు కావల్సిన వారు కొత్త నంబర్ల నుంచి ఫోన్ చేస్తే అప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తోంది. కాల్స్ ను బ్లాక్ చేయకపోతే స్పామ్ బారిన పడాల్సి వస్తోంది. దీంతో మొబైల్ ఫోన్ వినియోగదారులు తీవ్ర అవస్థలను ఎదుర్కొంటున్నారు. అయితే ఇకపై వారు ఇలాంటి అవస్థలకు గురి కావల్సిన పనిలేదు. ఎందుకంటే టెలికాం సంస్థలు ట్రాయ్ ఆదేశాల ప్రకారం నూతన నిబంధనలను ప్రస్తుతం అమలు చేస్తున్నాయి.
ఏంటీ CNAP..?
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) గతంలోనే కాలర్ ఐడీ డిస్‌ప్లేపై టెలికాం సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మొబైల్ ఫోన్ వినియోగదారులకు కాల్ వచ్చినప్పుడు కాలర్ ఐడీలో వివరాలను చూపించాల్సి ఉంటుంది. అవతలి వైపు నుంచి ఎవరు కాల్ చేస్తున్నారో ఆ వ్యక్తి పేరును డిస్‌ప్లేలో చూపించాలి. దీంతో కాల్ వచ్చినప్పుడు వినియోగదారులకు తమకు ఎవరు కాల్ చేస్తున్నారు, ఆ కాల్‌ను లిఫ్ట్ చేయాలా, వద్దా అన్న విషయం సులభంగా తెలిసిపోతుంది. దీంతో స్పామర్లు, స్కామర్లకు అడ్డుకట్ట వేయవచ్చు. కాల్స్ వచ్చినప్పుడు కాలర్ ఐడీని తెరపై చూపిస్తే వినియోగదారులకు చాలా వరకు మేలు జరుగుతుందని ట్రాయ్ తెలియజేసింది. అందుకనే ఈ రూల్‌ను టెలికాం సంస్థలు అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ ప్రక్రియను CNAP గా వ్యవహరిస్తున్నారు. అంటే Caller Name Presentation అని అర్థం వస్తుంది. మనకు కాల్ వచ్చినప్పుడు తెరపై ఆ వ్యక్తి పేరును CNAP లో భాగంగా చూపించాల్సి ఉంటుంది. దీంతో ఆ కాల్‌ను ఎత్తాలా, వద్దా అని మనం నిర్ణయం తీసుకుంటాం. దీని వల్ల మోసాలకు, స్పామ్‌కు గురి కాకుండా సురక్షితంగా ఉండవచ్చు.

పలు రాష్ట్రాల్లో టెస్టింగ్..
కాగా ప్రస్తుతం CNAP ప్రక్రియను పలు టెలికాం సంస్థలు ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నాయి. ఇప్పటికే పలువురు మొబైల్ ఫోన్ వినియోగదారులకు తమ తెరపై అవతలి వ్యక్తుల పేర్లు కూడా కాల్స్ వచ్చినప్పుడు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్, కేరళ, బీహార్, ఉత్తరప్రదేశ్ ఈస్ట్, రాజస్థాన్, పంజాబ్, అస్సాం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశాలలో రిలయన్స్ జియో ఈ సౌకర్యాన్ని తన కస్టమర్లకు అందిస్తుండగా, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, గుజరాత్, మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్‌లలో ఎయిర్ టెల్ CNAP ను తన వినియోగదారులకు అందిస్తోంది. అలాగే వొడాఫోన్ ఐడియా కూడా మహారాష్ట్ర, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో ఈ ప్రక్రియను టెస్ట్ చేస్తుండగా, బీఎస్ఎన్ఎల్ కేవలం పశ్చిమ బెంగాల్‌లోనే దీన్ని పరీక్షిస్తోంది. ఈ క్రమంలోనే త్వరలోనే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ మొబైల్ ఫోన్ వినియోగదారులందరికీ అన్ని టెలికాం సంస్థలు CNAP ను అందించనున్నాయి.
ట్రూ కాలర్ అవసరం ఉండదు..
ఇక ప్రస్తుతం మనకు కాల్ ఎవరు చేస్తున్నారు అనే విషయాన్ని గుర్తించేందుకు ట్రూ కాలర్ యాప్‌ను చాలా మంది వాడుతున్నారు. దీంతో మనకు కాల్ చేసే వారి పేరు తెలుస్తుంది. కానీ ఇది యూజర్ నియంత్రణలో ఉంటుంది కనుక అవతలి వారు నకిలీ పేరుతో కూడా మనకు కాల్ చేయవచ్చు. అలాంటప్పుడు ట్రూ కాలర్ ద్వారా అసలు అవతలి వ్యక్తి ఎవరు అనే విషయం సరిగ్గా తెలియదు. కానీ CNAP అలా కాదు. ఆ ఫోన్ నంబర్ ఎవరి పేరిట రిజిస్టర్ అయి ఉందో ఆ పేరును టెలికాం సంస్థ నేరుగా మనకు కాలర్ ఐడీలో చూపిస్తుంది. కనుక ఇందులో మోసానికి అవకాశం ఉండదు. దీంతో అవతలి వ్యక్తి పేరు మనకు సరిగ్గా తెలిసిపోతుంది. దీని వల్ల స్పామ్ లేదా స్కామ్‌ను అరికట్టవచ్చు. ఈ క్రమంలోనే మనకు ట్రూ కాలర్ యాప్‌ను వాడాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలా CNAP మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కాగా అతి త్వరలోనే ఈ సదుపాయం మొబైల్ ఫోన్ వినియోగదారులు అందరికీ అందుబాటులోకి రానుంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






