WhatsApp | ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక మరింత స్పష్టంగా వాట్సాప్ కాల్స్..
WhatsApp | ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన ఐఫోన్ వినియోగదారుల కోసం త్వరలోనే మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. కాల్ కొనసాగుతున్న సమయంలో యాపిల్ మైక్రోఫోన్ ప్రాసెసింగ్ మోడ్‌లను మార్చేందుకు ప్రత్యేక షార్ట్‌కట్‌ను అందుబాటులోకి తీసుకువస్తోందని డబ్ల్యూఏబీటాఇన్ఫో నివేదిక వెల్లడించింది.
Technology | Published On Jul 17, 2026, 5.34 pm IST
WhatsApp | ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన ఐఫోన్ వినియోగదారుల కోసం త్వరలోనే మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. కాల్ కొనసాగుతున్న సమయంలో యాపిల్ మైక్రోఫోన్ ప్రాసెసింగ్ మోడ్‌లను మార్చేందుకు ప్రత్యేక షార్ట్‌కట్‌ను అందుబాటులోకి తీసుకువస్తోందని డబ్ల్యూఏబీటాఇన్ఫో నివేదిక వెల్లడించింది. దీంతో ఐఫోన్ కంట్రోల్ సెంటర్‌ను తెరవాల్సిన అవసరం లేకుండానే నేరుగా వాట్సాప్ కాల్ ఇంటర్‌ఫేస్ నుంచే మైక్రోఫోన్ సెట్టింగ్స్‌ను మార్చుకోవచ్చు. ఈ ఫీచర్ వాట్సాప్ ఫర్ ఐఓఎస్ వెర్షన్ 26.27.74లో కనిపించింది. ప్రస్తుతం ఇది దశలవారీగా వినియోగదారులకు విడుదల అవుతోందని, రాబోయే వారాల్లో మరింత మందికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ఈ ఫీచర్‌ను ఎప్పుడు పూర్తిస్థాయిలో విడుదల చేస్తారనే విషయంపై వాట్సాప్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
మైక్రోఫోన్ కంట్రోల్ ద్వారా..
కొత్త షార్ట్‌కట్ ద్వారా యాపిల్‌లో ఇప్పటికే ఉన్న మైక్రోఫోన్ కంట్రోల్ మెనూను నేరుగా తెరవచ్చని నివేదిక తెలిపింది. ఇందులో స్టాండర్డ్, వాయిస్ ఐసోలేషన్, వైడ్ స్పెక్ట్రం, ఆటోమేటిక్ అనే నాలుగు మైక్రోఫోన్ మోడ్‌లలో వినియోగదారులు తమకు నచ్చిన ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ఎంచుకున్న మోడ్ కాల్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా వెంటనే అమల్లోకి వస్తుంది. వాట్సాప్ ఐఓఎస్‌లో సొంత ఆడియో ప్రాసెసింగ్ టెక్నాలజీని ప్రవేశపెట్టడం లేదని నివేదిక స్పష్టం చేసింది. యాపిల్ ఇప్పటికే ఐఓఎస్‌లో అందుబాటులో ఉంచిన మైక్రోఫోన్ నియంత్రణలను మరింత సులభంగా ఉపయోగించుకునేలా మాత్రమే ఈ కొత్త షార్ట్‌కట్‌ను అందిస్తున్నట్లు పేర్కొంది. యాపిల్ మొదట ఐఓఎస్ 15లో ఫేస్‌టైమ్, థర్డ్ పార్టీ యాప్‌ల కోసం వాయిస్ ఐసోలేషన్, వైడ్ స్పెక్ట్రం మోడ్‌లను ప్రవేశపెట్టింది. అనంతరం ఐఓఎస్ 16.4లో సాధారణ ఫోన్ కాల్స్‌కు కూడా వాయిస్ ఐసోలేషన్ సపోర్ట్‌ను విస్తరించింది. తర్వాత ఐఓఎస్ 18లో ఆటోమేటిక్ మోడ్‌ను కూడా అందించింది.
ప్రతి మైక్రోఫోన్ మోడ్‌కు ప్రత్యేక ఉపయోగం..
ప్రతి మైక్రోఫోన్ మోడ్‌కు ప్రత్యేక ఉపయోగం ఉంటుంది. వాయిస్ ఐసోలేషన్ చుట్టుపక్కల శబ్దాన్ని తగ్గించి మాట్లాడుతున్న వ్యక్తి స్వరాన్ని స్పష్టంగా వినిపించేలా చేస్తుంది. వైడ్ స్పెక్ట్రం పరిసర శబ్దాలను కూడా ఎక్కువగా రికార్డ్ చేస్తుంది. స్టాండర్డ్ మోడ్ యాపిల్ డిఫాల్ట్ ఆడియో ప్రాసెసింగ్‌ను ఉపయోగిస్తుంది. ఆటోమేటిక్ మోడ్ అయితే కాల్ పరిస్థితులను బట్టి ఐఓఎస్ ఆటోమేటిగ్గా సరైన మైక్రోఫోన్ మోడ్‌ను ఎంచుకుంటుంది. ఒకసారి వినియోగదారు మైక్రోఫోన్ మోడ్‌ను ఎంచుకున్న తర్వాత, దాన్ని మళ్లీ మార్చే వరకు అదే సెట్టింగ్ తరువాతి వాట్సాప్ కాల్స్‌కూ కొనసాగుతుంది. ఇది ఇటీవల ఆండ్రాయిడ్‌లో వాట్సాప్ తీసుకొచ్చిన విధానానికి భిన్నంగా ఉంటుంది. ఆండ్రాయిడ్ వెర్షన్‌లో వాట్సాప్ వాయిస్, వీడియో కాల్స్ కోసం సొంత నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఐఓఎస్‌లో మాత్రం యాపిల్ ఇప్పటికే అందిస్తున్న మైక్రోఫోన్ నియంత్రణలను వాట్సాప్ కాల్ ఇంటర్‌ఫేస్‌లోనే సులభంగా ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తోంది. దీంతో వాట్సాప్‌లో వాయిస్ కాల్స్ లేదా వాయిస్ చాట్స్ ను మరింత స్పష్టంగా వినవచ్చు.
సంబంధిత వార్తలు

WhatsApp | ఐఫోన్ యూజర్లకు వాట్సాప్ గుడ్‌న్యూస్.. ఐక్లౌడ్‌కు ప్రత్యామ్నాయంగా కొత్త బ్యాకప్ ఫీచర్..
జులై 15, 2026

Meta | దుమారం రేపుతున్న మెటా మ్యూస్ ఏఐ.. యూజర్ల ప్రైవసీపై ఆందోళనలు..
జులై 11, 2026

WhatsApp | వాట్సాప్‌లో వస్తున్న కొత్త ఫీచర్.. కాంటాక్ట్‌ల బర్త్ డేలను ముందే చెబుతుంది..
జులై 10, 2026
తాజావార్తలు
- ●Supreme Court | చిన్నారి పట్ల మీకు జాలే లేదు.. పేరు ముందు డాక్టర్ బిరుదు తీసేయండి : సుప్రీంకోర్టు
- ●Srinivas Goud | రైతులపై కక్షనా..? బీఆర్ఎస్ పార్టీపై కక్షనా..?
- ●PV Sindhu | జపాన్ ఓపెన్ సెమీస్‌లోకి పీవీ సింధు.. సీజన్ తొలి టైటిల్‌పై గురి..
- ●Janhvi Kapoor | నాలుగు భాషల హీరోయిన్లతో లారెన్స్ మూవీ - ఒకే సినిమాలో సాయిపల్లవి, జాన్వీకపూర్ - రూమర్లలో నిజమెంత?
- ●Supreme Court | ఓటు తీసేస్తే సిటిజన్ షిప్ తొలగించినట్టు కాదు : సుప్రీంకోర్టు
- ●Instamart | ఇక స్విగ్గీలోనే ఎల్పీజీ సిలిండర్ బుకింగ్.. నిమిషాల్లోనే డెలివరీ..

Supreme Court | చిన్నారి పట్ల మీకు జాలే లేదు.. పేరు ముందు డాక్టర్ బిరుదు తీసేయండి : సుప్రీంకోర్టు

Srinivas Goud | రైతులపై కక్షనా..? బీఆర్ఎస్ పార్టీపై కక్షనా..?

PV Sindhu | జపాన్ ఓపెన్ సెమీస్‌లోకి పీవీ సింధు.. సీజన్ తొలి టైటిల్‌పై గురి..

Janhvi Kapoor | నాలుగు భాషల హీరోయిన్లతో లారెన్స్ మూవీ - ఒకే సినిమాలో సాయిపల్లవి, జాన్వీకపూర్ - రూమర్లలో నిజమెంత?



