త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | చిన్నారి ప‌ట్ల మీకు జాలే లేదు.. పేరు ముందు డాక్ట‌ర్ హోదా తీసేయండి : సుప్రీంకోర్టు

Supreme Court | అత్యాచారానికి గురైన నాలుగేళ్ల చిన్నారికి స‌రైన వైద్య స‌హాయం అందించ‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌న్న‌ ఆరోప‌ణ‌ల‌పై రెండు ప్రైవేట్ ఆసుప‌త్రులు, వైద్యుల‌పై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

D

National | Published On Jul 17, 2026, 5.33 pm IST

Supreme Court | చిన్నారి ప‌ట్ల మీకు జాలే లేదు.. పేరు ముందు డాక్ట‌ర్ హోదా తీసేయండి : సుప్రీంకోర్టు
Advertisement

Supreme Court | అత్యాచారానికి గురైన నాలుగేళ్ల చిన్నారికి స‌రైన వైద్య స‌హాయం అందించ‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌న్న‌ ఆరోప‌ణ‌ల‌పై రెండు ప్రైవేట్ ఆసుప‌త్రులు, వైద్యుల‌పై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఆ వైద్యులు త‌మ‌ విధిని స‌క్ర‌మంగా నిర్వ‌హించ‌లేన‌ప్పుడు.. పేరుకు ముందు డాక్ట‌ర్ (doctor) అని రాసుకునే హ‌క్కు లేద‌ని వ్యాఖ్యానించింది. "చిన్నారి ప‌ట్ల మీకు జాలి అనేది ఉండి ఉంటే.. స‌రైన వైద్య సౌక‌ర్యం లేన‌ప్పుడు ఆ చిన్నారిని వేరే ఆసుప‌త్రికి తీసుకెళ్లి ఉండేవారు. కానీ మీరు అలా చేయ‌లేదు. చిన్నారి పేద‌రాల‌ని నిర్ల‌క్ష్యం చేశారా..? ఫీజు భ‌రించ‌లేర‌నే కార‌ణంతోనే ప‌సిపిల్ల ప్రాణాల‌ను నిర్ల‌క్ష్యం చేశారా..?" అంటూ ప్ర‌శ్నించింది.

మార్చి 16న ఘ‌జియాబాద్ (Ghaziabad)లో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం జ‌రిగింది. చాక్లెట్లు కొనిస్తాన‌ని చెప్పి ఓ వ్య‌క్తి చిన్నారిని తీసుకెళ్లి అఘాయిత్యం చేశాడు. ఆ త‌ర్వాత బాలిక‌ను అక్క‌డే వ‌దిలేసి వెళ్లిపోయాడు. తీవ్ర ర‌క్త‌స్రావంతో ఉన్న చిన్నారిని గుర్తించిన కుటుంబ స‌భ్యులు స‌మీపంలోని రెండు ప్రైవేట్ ఆసుప‌త్రుల‌కు తీసుకెళ్లారు. అయితే, అక్క‌డ చిన్నారిని చేర్చుకునేందుకు వైద్యులు నిరాక‌రించారు. చేసేదేమీ లేక బాధిత కుటుంబం ఘ‌జియాబాద్ ప్ర‌భుత్వాసుప‌త్రికి తీసుకెళ్లింది. అయితే, అప్పటికే చిన్నారి ప్రాణాలు కోల్పోయిన‌ట్లు వైద్యులు నిర్ధ‌రించారు.

దీంతో బాలిక తండ్రి స్థానిక పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసులు ఫిర్యాదు స్వీక‌రించ‌లేదు. దీంతో బాలిక తండ్రి స‌రైన స‌మ‌యంలో వైద్య స‌దుపాయం అంద‌క త‌మ బిడ్డ ప్రాణాలు కోల్పోయింద‌ని చెప్పి సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. పోలీసులు సైతం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించార‌ని ఆరోపించారు. ఈ పిటిష‌న్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్ (CJI Surya Kant), జస్టిస్‌ జయమాల్య బాగ్చి, జస్టిస్‌ వి. మోహనలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సంద‌ర్భంగా పోలీసుల తీరును తీవ్రంగా ఎండ‌గ‌ట్టింది. అదే స‌మ‌యంలో చిన్నారికి వైద్యం నిరాక‌రించిన రెండు ప్రైవేట్ ఆసుప‌త్రుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. చిన్నారి ప‌ట్ల నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన ఆ వైద్యులు త‌మ పేరు ముందు డాక్ట‌ర్ అనే బిరుదును రాసుకునే హ‌క్కు లేద‌ని వ్యాఖ్యానించింది. ఈ మేర‌కు బాధిత కుటుంబానికి ప‌రిహారం ఇవ్వాల‌ని ఆదేశించింది.

Also Read..

రైతుల‌పై క‌క్ష‌నా..? బీఆర్ఎస్ పార్టీపై క‌క్ష‌నా..?

నాలుగు భాష‌ల హీరోయిన్ల‌తో లారెన్స్ మూవీ - ఒకే సినిమాలో సాయిప‌ల్ల‌వి, జాన్వీక‌పూర్ - రూమ‌ర్ల‌లో నిజ‌మెంత‌?

ఓటు తీసేస్తే సిటిజన్ షిప్ తొలగించినట్టు కాదు : సుప్రీంకోర్టు

Advertisement
Advertisement