Srinivas Goud | రైతులపై కక్షనా..? బీఆర్ఎస్ పార్టీపై కక్షనా..?
Srinivas Goud | రాష్ట్రంలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్ రైతులపై కక్ష పెట్టుకుందా.. లేక బీఆర్ఎస్ పార్టీపై కక్ష పెట్టుకుందా..? అని నిలదీశారు.
Srinivas Goud | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్ రైతులపై కక్ష పెట్టుకుందా.. లేక బీఆర్ఎస్ పార్టీపై కక్ష పెట్టుకుందా..? అని నిలదీశారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎల్ నినో పైనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో పత్తి పంట ఎండిపోతోంది. వరినార్లకు ట్యాంకర్ల ద్వారా నీళ్లు సరఫరా చేస్తున్నారు. రైతులంటే ఈ ప్రభుత్వానికి ఎందుకంత కక్ష..? పంటలు పండితే రైతుబంధు, బోనస్ ఇవ్వాల్సి వస్తుందని ప్రభుత్వం భావిస్తున్నట్టు ఉంది. అన్నదాతల గొంతును కాంగ్రెస్ సర్కార్ కోస్తుందని శ్రీనివాస్ గౌడ్ నిప్పులు చెరిగారు.
ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర మంచిగా నీళ్లు వాడుకుంటున్నాయి. రాష్ట్రంలో ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎప్పుడూ లేదు. కేసీఆర్ తెలంగాణలో కరువు రాకుండా ఉండేందుకు ప్రాజెక్టులు కట్టారు. కేసీఆర్‌ను బద్నాం చేసి కాలం గడపాలని చూస్తున్నారు. ప్రపంచంలో అప్పులు చేయని దేశం లేదు. తెలంగాణకు కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే దిక్కు అవుతుందని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి గజ్వేల్‌లో మీటింగ్ పెట్టినా మేము పర్మిషన్ ఇచ్చాం. సరూర్ నగర్ మీటింగ్‌కు పర్మిషన్ ఇవ్వకపోతే కోర్టు పర్మిషన్ ఇచ్చింది. రాష్ట్రంలో తిట్ల హామీ నెరవేరింది. రాహుల్ గాంధీ అశోక్ నగర్ వచ్చినప్పుడు ఉన్నది పెయిడ్ బ్యాచా..? పెయిడ్ జేఏసీనా..? ఇచ్చిన హామీలు ప్రశ్నిస్తే పెయిడ్ బ్యాచ్ ఎలా అవుతారు..? విద్యార్థులపై ఆంక్షలు లేకుండా వదిలేయండి అని శ్రీనివాస్ గౌడ్ సూచించారు.
సంబంధిత వార్తలు

Ponnam Prabhakar | స్టీల్ బ్యాంక్ పర్యావరణ విప్లవంతో పచ్చ హుస్నాబాద్ సాకారం
జులై 17, 2026

FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్.. తెల్లారి 4.30 వరకు బార్లు, క్లబ్బులు తెరిచే ఉంటాయ్..
జులై 17, 2026

Saroornagar Yuva Sangrama Sadassu | సరూర్‌నగర్ యువ సంగ్రామ సదస్సుకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
జులై 17, 2026
తాజావార్తలు
- ●PV Sindhu | జపాన్ ఓపెన్ సెమీస్‌లోకి పీవీ సింధు.. సీజన్ తొలి టైటిల్‌పై గురి..
- ●Janhvi Kapoor | నాలుగు భాషల హీరోయిన్లతో లారెన్స్ మూవీ - ఒకే సినిమాలో సాయిపల్లవి, జాన్వీకపూర్ - రూమర్లలో నిజమెంత?
- ●Supreme Court | ఓటు తీసేస్తే సిటిజన్ షిప్ తొలగించినట్టు కాదు : సుప్రీంకోర్టు
- ●Instamart | ఇక స్విగ్గీలోనే ఎల్పీజీ సిలిండర్ బుకింగ్.. నిమిషాల్లోనే డెలివరీ..
- ●Ponnam Prabhakar | స్టీల్ బ్యాంక్ పర్యావరణ విప్లవంతో పచ్చ హుస్నాబాద్ సాకారం
- ●FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్.. తెల్లారి 4.30 వరకు బార్లు, క్లబ్బులు తెరిచే ఉంటాయ్..

PV Sindhu | జపాన్ ఓపెన్ సెమీస్‌లోకి పీవీ సింధు.. సీజన్ తొలి టైటిల్‌పై గురి..

Janhvi Kapoor | నాలుగు భాషల హీరోయిన్లతో లారెన్స్ మూవీ - ఒకే సినిమాలో సాయిపల్లవి, జాన్వీకపూర్ - రూమర్లలో నిజమెంత?

Supreme Court | ఓటు తీసేస్తే సిటిజన్ షిప్ తొలగించినట్టు కాదు : సుప్రీంకోర్టు

Instamart | ఇక స్విగ్గీలోనే ఎల్పీజీ సిలిండర్ బుకింగ్.. నిమిషాల్లోనే డెలివరీ..



