PV Sindhu | జపాన్ ఓపెన్ సెమీస్‌లోకి పీవీ సింధు.. సీజన్ తొలి టైటిల్‌పై గురి..
PV Sindhu | భారత స్టార్ షట్లర్ పీవీ సింధు జపాన్ ఓపెన్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నీలో సెమీఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరగాల్సిన క్వార్టర్‌ఫైనల్‌లో జపాన్‌కు చెందిన నొజోమీ ఒకుహారాతో సింధు తలపడాల్సి ఉండగా.. గాయం కారణంగా ఒకుహారా మ్యాచ్‌కు దూరమైంది.
PV Sindhu | భారత స్టార్ షట్లర్ పీవీ సింధు జపాన్ ఓపెన్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నీలో సెమీఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరగాల్సిన క్వార్టర్‌ఫైనల్‌లో జపాన్‌కు చెందిన నొజోమీ ఒకుహారాతో సింధు తలపడాల్సి ఉండగా.. గాయం కారణంగా ఒకుహారా మ్యాచ్‌కు దూరమైంది. దీంతో సింధు సెమీస్‌కు వెళ్లింది. ఈ సీజన్‌లో సింధుకు ఇది మూడో సెమీఫైనల్. అంతకుముందు మలేషియా సూపర్-1000, ఆస్ట్రేలియా సూపర్-500 టోర్నీల్లో సెమీస్‌కు చేరిన విషజ్ఞం తెలిసింది. 2023 డెన్మార్క్ ఓపెన్ తర్వాత సూపర్-750 స్థాయి టోర్నీలో సింధు సెమీఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి.
ఈ సీజన్‌లో తొలి టైటిల్‌ను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్న సింధుకు సెమీస్‌లో గట్టి సవాల్ ఎదురుకానుంది. టోక్యో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, ప్రపంచ నాలుగో ర్యాంకర్ చైనాకు చెందిన చెన్ యూఫెయితో ఆమె తలపడాల్సి రానుంది. సింధు-చెన్ యూఫెయి మధ్య ఇప్పటివరకు పలుసార్లు హోరాహోరీగా తలపడ్డారు. అయితే, హెడ్-టు-హెడ్ రికార్డులో చెన్ యూఫెయి పైచేయి సాధించింది. ఇప్పటివరకు ఇద్దరూ 14 సార్లు తలపడగా.. సింధు ఆరు మ్యాచ్‌లు గెలవగా, చెన్ ఎనిమిది సార్లు విజయం సాధించింది. ముఖ్యంగా గత ఐదు వరుస మ్యాచ్‌ల్లో సింధు ఓటమిపాలైంది. ఈసారి సెమీస్‌లో విజయం సాధించి.. వరుస పరాజయాలకు బ్రేక్ వేయడంతో పాటు దాదాపు మూడేళ్ల తర్వాత సూపర్-750 టోర్నీ ఫైనల్‌లో అడుగుపెట్టాలని సింధు భావిస్తోంది.
ప్రస్తుతం ఈ బీడబ్ల్యూఎఫ్ సూపర్-750 టోర్నీలో భారత్ తరఫున పోటీలో మిగిలిన ఏకైక ప్లేయర్ సింధు మాత్రమే. ప్రీక్వార్టర్‌ఫైనల్‌లో ప్రపంచ ఐదో ర్యాంకర్ హాన్ యూయేపై ఆమె అద్భుత ప్రదర్శన చేసింది. కేవలం 35 నిమిషాల్లోనే 21-16, 21-14 తేడాతో వరుస గేమ్‌ల్లో విజయం సాధించి క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. ఇక చెన్ యూఫెయి ఈ ఏడాది అద్భుత ఫామ్‌లో ఉంది. ఇండోనేషియా మాస్టర్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్న ఆమె, థాయ్‌లాండ్, మలేషియా సూపర్-500 టోర్నీల్లో ఫైనల్‌కు చేరుకుంది. సింగపూర్, ఇండియా సూపర్-750 టోర్నీల్లో సెమీఫైనల్ ఆడిన చెన్, మలేషియా ఓపెన్, ఆల్ ఇంగ్లండ్ వంటి ప్రతిష్ఠాత్మక సూపర్-1000 టోర్నీల్లోనూ సెమీస్‌కు చేరుకుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Janhvi Kapoor | నాలుగు భాషల హీరోయిన్లతో లారెన్స్ మూవీ - ఒకే సినిమాలో సాయిపల్లవి, జాన్వీకపూర్ - రూమర్లలో నిజమెంత?
- ●Supreme Court | ఓటు తీసేస్తే సిటిజన్ షిప్ తొలగించినట్టు కాదు : సుప్రీంకోర్టు
- ●Instamart | ఇక స్విగ్గీలోనే ఎల్పీజీ సిలిండర్ బుకింగ్.. నిమిషాల్లోనే డెలివరీ..
- ●Ponnam Prabhakar | స్టీల్ బ్యాంక్ పర్యావరణ విప్లవంతో పచ్చ హుస్నాబాద్ సాకారం
- ●FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్.. తెల్లారి 4.30 వరకు బార్లు, క్లబ్బులు తెరిచే ఉంటాయ్..
- ●Rakul Preet Singh | టాలీవుడ్ హీరోలపై రకుల్ పొగడ్తలు - ఆఫర్ల కోసమే అంటోన్న నెటిజన్లు|

Janhvi Kapoor | నాలుగు భాషల హీరోయిన్లతో లారెన్స్ మూవీ - ఒకే సినిమాలో సాయిపల్లవి, జాన్వీకపూర్ - రూమర్లలో నిజమెంత?

Supreme Court | ఓటు తీసేస్తే సిటిజన్ షిప్ తొలగించినట్టు కాదు : సుప్రీంకోర్టు

Instamart | ఇక స్విగ్గీలోనే ఎల్పీజీ సిలిండర్ బుకింగ్.. నిమిషాల్లోనే డెలివరీ..

Ponnam Prabhakar | స్టీల్ బ్యాంక్ పర్యావరణ విప్లవంతో పచ్చ హుస్నాబాద్ సాకారం






