Janhvi Kapoor | నాలుగు భాషల హీరోయిన్లతో లారెన్స్ మూవీ – ఒకే సినిమాలో సాయిపల్లవి, జాన్వీకపూర్ – రూమర్లలో నిజమెంత?
కోలీవుడ్‌లో ఓ రేర్ కాంబో సెట్టయినట్లు ప్రచారం జరుగుతోంది. సాయిపల్లవి, జాన్వీకపూర్, రుక్మిణి వసంత్‌తో పాటు కయదు లోహర్ కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్లలో నిజమెంత అంటే?
Entertainment | Published On Jul 17, 2026, 5.08 pm IST
Janhvi Kapoor | తమిళం, బాలీవుడ్, కన్నడ, మలయాళం....నాలుగు భాషలకు చెందిన హీరోయిన్లు ఒకే సినిమాలో కలిసి నటిస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. అందులోనూ స్టార్ హీరోయిన్లు కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటే అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. అలాంటి కలయికే ఓ తమిళ సినిమా కోసం కుదిరినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. నాచురల్ బ్యూటీ సాయిపల్లవి, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్‌తో పాటు కన్నడ సుందరి రుక్మిణి వసంత్, మలయాళ స్టార్ కయదు లోహర్ కలిసి ఓ సినిమా చేస్తున్నట్లు సోషల్ మీడియాలో రూమర్లు వినిపిస్తున్నాయి. రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తోన్న 30వ సినిమాలో ఈ నలుగురు కథానాయికలుగా ఫైనల్ అయినట్లుగా చెబుతోన్న కొన్ని ఫొటోలు ట్విట్టర్‌లో చక్కర్లు కొడుతోన్నాయి. ఈ సినిమాతోనే జాన్వీ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఈ పోస్ట్‌లలో కనిపించింది. నలుగురు హీరోయిన్ల సినిమాపై అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.
నిజమేనా?
రాఘవేంద్ర ప్రొడక్షన్స్ పేరుతో కూడా ట్విట్టర్ పేజీలో ఈ పోస్ట్‌లు కనిపించాయి. లారెన్స్‌కు చెందిన నిర్మాణ సంస్థ పేరు కూడా అదే కావడంతో ఈ న్యూస్ నిజమేనని అంతా అనుకుంటున్నారు. సాయిపల్లవి, జాన్వీకపూర్, రుక్మిణి వసంత్‌తో పాటు కయదు లోహర్ ఫొటోలను తెగ షేర్ చేస్తున్నారు.
ఫేక్ అకౌంట్....
ఈ అనౌన్స్‌మెంట్ వెనుక నిజం లేదని కొందరు నెటిజన్లు అంటున్నారు. లారెన్స్ ప్రొడక్షన్ హౌజ్ పేరుతో కావాలనే ఫేక్ అకౌంట్ క్రియేట్ ఫొటోలను వైరల్ చేస్తోన్నారని చెబుతున్నారు. ఈ రూమర్లపై లారెన్స్ రియాక్ట్ అయితేనే నిజానిజాలు బయటపడతాయని పేర్కొంటున్నారు.
పెద్ది తర్వాత....
ఇటీవలే పెద్ది మూవీతో ప్రేక్షకులను పలకరించిన జాన్వీ కపూర్ తమిళంలో పా రంజిత్ నిర్మాణ సంస్థలో ఓ వెబ్‌సిరీస్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలొస్తోన్నాయి. సాయిపల్లవి ప్రస్తుతం హిందీలో రామాయణంతో పాటు తమిళంలో ధనుష్‌తో ఓం సినిమా చేస్తోంది. ఎన్టీఆర్ డ్రాగన్‌లో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా కనిపించబోతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Supreme Court | ఓటు తీసేస్తే సిటిజన్ షిప్ తొలగించినట్టు కాదు : సుప్రీంకోర్టు
- ●Instamart | ఇక స్విగ్గీలోనే ఎల్పీజీ సిలిండర్ బుకింగ్.. నిమిషాల్లోనే డెలివరీ..
- ●Ponnam Prabhakar | స్టీల్ బ్యాంక్ పర్యావరణ విప్లవంతో పచ్చ హుస్నాబాద్ సాకారం
- ●FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్.. తెల్లారి 4.30 వరకు బార్లు, క్లబ్బులు తెరిచే ఉంటాయ్..
- ●Rakul Preet Singh | టాలీవుడ్ హీరోలపై రకుల్ పొగడ్తలు - ఆఫర్ల కోసమే అంటోన్న నెటిజన్లు|
- ●Minister Vivek | 15 ఏండ్ల తర్వాత ఈఎస్ఐలో భారీ నియామకాలు

Supreme Court | ఓటు తీసేస్తే సిటిజన్ షిప్ తొలగించినట్టు కాదు : సుప్రీంకోర్టు

Instamart | ఇక స్విగ్గీలోనే ఎల్పీజీ సిలిండర్ బుకింగ్.. నిమిషాల్లోనే డెలివరీ..

Ponnam Prabhakar | స్టీల్ బ్యాంక్ పర్యావరణ విప్లవంతో పచ్చ హుస్నాబాద్ సాకారం

FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్.. తెల్లారి 4.30 వరకు బార్లు, క్లబ్బులు తెరిచే ఉంటాయ్..






