త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Whatsapp | వాట్సాప్‌లో వ‌స్తున్న మ‌రో కొత్త ఫీచ‌ర్‌.. ఇక‌పై మ‌రింత స్ప‌ష్టంగా కాల్స్ మాట్లాడుకోవ‌చ్చు..

Whatsapp | వాట్సాప్ తన ప్లాట్‌ఫామ్‌లో కాల్ నాణ్యతను మెరుగుపర్చే లక్ష్యంతో కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు సమాచారం. ఫీచర్ ట్రాకర్ నివేదిక ప్రకారం మెటా సంస్థకు చెందిన ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాయిస్, వీడియో కాల్స్ కోసం ఇన్‌బిల్ట్‌గా నాయిస్ క్యాన్సిలేషన్ సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తోంది.

S

Technology | Published On Mar 21, 2026, 5.32 pm IST

Whatsapp | వాట్సాప్‌లో వ‌స్తున్న మ‌రో కొత్త ఫీచ‌ర్‌.. ఇక‌పై మ‌రింత స్ప‌ష్టంగా కాల్స్ మాట్లాడుకోవ‌చ్చు..
Advertisement

Whatsapp | వాట్సాప్ తన ప్లాట్‌ఫామ్‌లో కాల్ నాణ్యతను మెరుగుపర్చే లక్ష్యంతో కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు సమాచారం. ఫీచర్ ట్రాకర్ నివేదిక ప్రకారం మెటా సంస్థకు చెందిన ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాయిస్, వీడియో కాల్స్ కోసం ఇన్‌బిల్ట్‌గా నాయిస్ క్యాన్సిలేషన్ సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ ఫీచర్ తాజాగా విడుదలైన వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా అప్‌డేట్‌లో అందుబాటులో ఉంది. ఇది కాల్స్ సమయంలో బ్యాక్‌గ్రౌండ్ శబ్దాన్ని తగ్గించి, మరింత స్పష్టమైన కమ్యూనికేషన్ అనుభవాన్ని అందిస్తుంది. వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetaInfo నివేదిక ప్రకారం, ఈ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా యాప్ వెర్షన్ 2.26.11.8లో లభిస్తోంది. ప్రస్తుతం ఇది డెవ‌ల‌పింగ్‌ దశలో ఉండగా, భవిష్యత్తులో వచ్చే అప్‌డేట్‌తో యూజ‌ర్ల‌కు అందుబాటులోకి తేనున్నారు.

ఆటోమేటిక్‌గా శ‌బ్దాల ఫిల్ట‌రింగ్‌..

ఈ ఫీచర్ వ‌ల్ల‌ ట్రాఫిక్ శబ్దం, గాలి శబ్దం లేదా చుట్టుపక్కల మాటలు వంటి అనవసర బ్యాక్‌గ్రౌండ్ శబ్దాలను ఆటోమేటిక్‌గా ఫిల్టర్ చేయడానికి ప‌నిచేస్తుంది. దీని ద్వారా వినియోగదారుడి వాయిస్‌ను స్పష్టంగా వేరుచేసి, కాల్ సమయంలో మరింత క్లియర్‌గా వినిపించేలా చేస్తుంది. ప్రత్యేకంగా శబ్దాలు అధికంగా ఉండే ప్ర‌దేశాల్లో కూడా సంభాషణలు అంతరాయం లేకుండా సాగేందుకు ఇది సహాయపడుతుంది. వాట్సాప్‌లో ఈ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కాల్ ప్రారంభమైన వెంటనే డిఫాల్ట్‌గా యాక్టివ్ అవుతుందని నివేదిక తెలిపింది. ఫీచర్ యాక్టివ్‌గా ఉన్నట్లు స్క్రీన్‌పై నోటిఫికేషన్ కూడా కనిపిస్తుంది. అయితే, ఇది ఆటోమేటిక్‌గా ఆన్ అయినప్పటికీ, వినియోగదారులు అవసరమైతే కాల్ సమయంలోని మెనూ ద్వారా దీన్ని ఆఫ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.

డివైస్‌లోనే ప్రాసెసింగ్‌..

ఈ ఫీచర్ ఆడియోను డివైస్‌లోనే ప్రాసెస్ చేసి, తరువాత ఎన్‌క్రిప్ట్ చేసి పంపిస్తుందని నివేదిక పేర్కొంది. దీని వల్ల వాట్సాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌పై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపింది. అంటే, వాయిస్ ఫిల్టరింగ్ ప్రక్రియ సర్వర్లలో కాకుండా, మైక్రోఫోన్ స్థాయిలోనే జరుగుతుంద‌న్న‌మాట‌. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా దశలో ఉండటంతో, విడుదలకు సంబంధించి అధికారిక టైమ్‌లైన్ ప్రకటించలేదు. ముందుగా కొంతమంది బీటా వినియోగదారులతో పరీక్షించి, తర్వాత దశల వారీగా వినియోగదారులకు అంద‌రికీ అందుబాటులోకి తీసుకురావాలని వాట్సాప్‌ యోచిస్తోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement