WhatsApp | వాట్సాప్‌లోనే ఈ-సిమ్..! విదేశాల్లోనూ ఫ్రీగా కనెక్ట్ అవ్వొచ్చు..!
WhatsApp | విదేశాలకు వెళ్లేవారికి వాట్సాప్ గుడ్‌న్యూస్ చెప్పింది. అంతర్జాతీయ ప్రయాణాల సమయంలో ఇంటర్నెట్ కోసం సిమ్ కార్డులు కొనుగోలు చేయడం, భారీగా రోమింగ్ ఛార్జీలు చెల్లించడం వంటి ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు సరికొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఇకపై వాట్సాప్ యాప్‌లోనే ట్రావెల్ ఈ-సిమ్ (eSIM) కొనుగోలు చేసి, ఇన్‌స్టాల్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.
- యాప్‌లోనే డేటా ప్లాన్ల కొనుగోలు, ఇన్‌స్టాలేషన్
- జియో, వెరిజాన్ సహా ప్రముఖ టెలికం సంస్థలతో భాగస్వామ్యం
- పాత నంబర్‌తోనే వాట్సాప్ వినియోగం..
- త్వరలోనే ఎంపిక చేసిన దేశాల్లో ప్రారంభం
WhatsApp | విదేశాలకు వెళ్లేవారికి వాట్సాప్ గుడ్‌న్యూస్ చెప్పింది. అంతర్జాతీయ ప్రయాణాల సమయంలో ఇంటర్నెట్ కోసం సిమ్ కార్డులు కొనుగోలు చేయడం, భారీగా రోమింగ్ ఛార్జీలు చెల్లించడం వంటి ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు సరికొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఇకపై వాట్సాప్ యాప్‌లోనే ట్రావెల్ ఈ-సిమ్ (eSIM) కొనుగోలు చేసి, ఇన్‌స్టాల్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. దాంతో విదేశాల్లో అడుగుపెట్టగానే ఇంటర్నెట్ కనెక్టివిటీ పొందే అవకాశం ఉంటుంది. విమానాశ్రయాల్లో సిమ్ కార్డుల కోసం వెతకాల్సిన అవసరం లేకుండా, ఖరీదైన అంతర్జాతీయ రోమింగ్‌పై ఆధారపడకుండా మొబైల్ డేటాను వీలు కలుగనున్నది. ఈ సేవలను త్వరలోనే ఎంపిక చేసిన దేశాల్లో ప్రారంభించనున్నట్లు వాట్సాప్ ప్రకటించింది.
జియో, వెరిజాన్‌తో భాగస్వామ్యం..
ఈ కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్ పలు ప్రముఖ ఈ-సిమ్ ప్రొవైడర్లు, టెలికం సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ఇందులో భారత్‌కు చెందిన రిలయన్స్ జియోతో పాటు స్మార్ట్ అక్సియాటా, స్మార్ట్ కమ్యూనికేషన్స్, అమెరికాకు చెందిన వెరిజాన్ వంటి సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. ఈ విషయాన్ని వాట్సాప్ తన అధికారిక బ్లాగ్‌లో వెల్లడించింది. అయితే, ఏయే దేశాల్లో తొలుత ఈ సేవలను ప్రారంభిస్తారు? డేటా ప్లాన్ల ధరలు ఎంత ఉంటాయి? అనే వివరాలను మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఫీచర్ అందుబాటులోకి వచ్చినప్పుడు యాప్‌లోనే వినియోగదారులకు సమాచారం కనిపిస్తుందని సంస్థ తెలిపింది.
పాత నంబర్‌తోనే కొనసాగింపు
విదేశాలకు వెళ్లిన సమయంలో స్థానిక సిమ్ కార్డు తీసుకుంటే వాట్సాప్ నంబర్ మారుతుందేమోనని చాలామంది ఆందోళన చెందుతుంటారు. కొత్త ఈ-సిమ్ సదుపాయంతో అలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రయాణం కోసం ప్రత్యేకంగా డేటా ఈ-సిమ్ తీసుకున్నప్పటికీ, ఇప్పటికే ఉపయోగిస్తున్న వాట్సాప్ నంబర్‌తోనే మెసేజ్‌లు పంపడం, కాల్స్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది. అంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం మరో ఈ-సిమ్ ఉపయోగించినా వాట్సాప్ ఖాతాకు అనుసంధానమైన పాత నంబర్‌ను మార్చుకోవాల్సిన అవసరం ఉండదు అన్నమాట. వాట్సాప్ అధిపతి కునాల్ షా కూడా ఈ కొత్త ప్రయత్నంపై ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాట్సాప్‌ను ఉపయోగించుకునేలా చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఇతర ఈ-సిమ్ సంస్థలకూ ఆహ్వానం పలికారు.
యాప్‌లోనే డేటా ప్లాన్లు
వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.26.47.10లో ఈ ఫీచర్‌కు సంబంధించిన వివరాలు ఇప్పటికే కనిపించినట్లు పలు నివేదికలు తెలిపాయి. ప్రయాణించే దేశం, ప్రాంతాన్ని ఎంచుకుని అందుబాటులో ఉన్న ఈ-సిమ్ డేటా ప్లాన్లను యాప్‌లోనే వెతుక్కునే అవకాశం ఉండొచ్చని సమాచారం. ప్రాంతీయ, గ్లోబల్ ప్లాన్లతో పాటు నిర్దిష్ట డేటా పరిమితి ఉన్న ప్యాకేజీలు, అపరిమిత డేటా ప్లాన్లను కూడా ఎంచుకునే సదుపాయం ఉండవచ్చని తెలుస్తోంది. ఈ-సిమ్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకునేందుకు అవసరమైన సూచనలు కూడా యాప్‌లోనే చూపించనుంది. ఇన్‌స్టాలేషన్ విజయవంతమైందా? లేదా? అనే సమాచారాన్ని నోటిఫికేషన్ల ద్వారా తెలియజేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు నివేదికలు తెలిపాయి. అయితే, ఇవి బీటా వెర్షన్‌లో కనిపించిన ప్రాథమిక వివరాలే అయినా.. తుది ఫీచర్‌లో మార్పులు ఉండే అవకాశం ఉన్నది.
ప్రయాణికులకు ఎంతో ఉపయోగం..
ఈ కొత్త సదుపాయం అందుబాటులోకి వస్తే విదేశీ ప్రయాణికులకు ఎంతో వెసులుబాటు కలగనుంది. విమానం దిగగానే కుటుంబ సభ్యులకు క్షేమంగా చేరుకున్నట్లు సమాచారం ఇవ్వడం, క్యాబ్ బుక్ చేసుకోవడం, బోర్డింగ్ పాస్‌లు పంపించుకోవడం వంటి పనులను సులభంగా చేసుకోవచ్చు. ముఖ్యంగా విమానాశ్రయాల్లో పబ్లిక్ వైఫై కోసం ఎదురుచూడాల్సిన అవసరం తగ్గుతుంది. ఈ సేవలను వినియోగించుకోవాలంటే ఈ-సిమ్‌కు అనుకూలమైన స్మార్ట్‌ఫోన్ ఉండాలి. ధరలు, అందుబాటులో ఉండే దేశాలు, ప్రారంభ తేదీపై వాట్సాప్ నుంచి మరింత స్పష్టత రావాల్సి ఉంది. మొత్తంగా ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే అంతర్జాతీయ ప్రయాణాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీని పొందడం మరింత సులభం కానుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Devi Prasad | ఉద్యమ పోరాటం, ఆరాటాన్ని ప్రజలకు చెప్పాల్సి ఉంది.. పార్టీలకతీతంగా దీక్షా దివస్‌కు రండి
- ●TG Govt | కరువు వేళ రైతులకు ప్రభుత్వం భరోసా
- ●Vishwak Sen | యంగ్ పొలిటికల్ లీడర్‌గా విశ్వక్సేన్ - రాజకీయ వారసుల కష్టాలపై సినిమా
- ●Karthigai Deepam lamp | తిరుప్పరంకుండ్రం కొండపై 100 ఏళ్ల తర్వాత వెలిగిన కార్తీక దీపం.. భక్తులు భావోద్వేగం
- ●Royal Enfield Himalayan 750 | రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 750 వచ్చేసింది.. ధర ఎంత, ఫీచర్లు ఎలా ఉన్నాయి..?
- ●Tirupparankundram | తిరుప్పరంకుండ్రం కార్తీక దీపం వివాదం.. 164 ఏళ్ల చరిత్రలో కీలక మలుపు..!

Devi Prasad | ఉద్యమ పోరాటం, ఆరాటాన్ని ప్రజలకు చెప్పాల్సి ఉంది.. పార్టీలకతీతంగా దీక్షా దివస్‌కు రండి

TG Govt | కరువు వేళ రైతులకు ప్రభుత్వం భరోసా

Vishwak Sen | యంగ్ పొలిటికల్ లీడర్‌గా విశ్వక్సేన్ - రాజకీయ వారసుల కష్టాలపై సినిమా

Karthigai Deepam lamp | తిరుప్పరంకుండ్రం కొండపై 100 ఏళ్ల తర్వాత వెలిగిన కార్తీక దీపం.. భక్తులు భావోద్వేగం





