WhatsApp | వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. 14 రోజుల ముందే మెసేజ్ షెడ్యూల్..
WhatsApp | వాట్సాప్ వినియోగదారుల కోసం మెసేజ్ షెడ్యూలింగ్ ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఈ ఫీచర్ ద్వారా 10 నిమిషాల నుంచి 14 రోజుల ముందుగానే మెసేజ్‌లను షెడ్యూల్ చేసుకోవచ్చు. వ్యక్తిగత చాట్స్‌తోపాటు గ్రూపుల్లోనూ ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. నిర్ణయించిన సమయానికి మెసేజ్ వెళ్లేందుకు ఫోన్ ఆన్‌లో ఉండాల్సిన అవసరం కూడా లేదు.
Technology | Published On Nov 26, 2026, 3.08 pm IST
WhatsApp | వాట్సాప్ వినియోగదారుల కోసం మెసేజ్ షెడ్యూలింగ్ ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఈ ఫీచర్ ద్వారా 10 నిమిషాల నుంచి 14 రోజుల ముందుగానే మెసేజ్‌లను షెడ్యూల్ చేసుకోవచ్చు. వ్యక్తిగత చాట్స్‌తోపాటు గ్రూపుల్లోనూ ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. నిర్ణయించిన సమయానికి మెసేజ్ వెళ్లేందుకు ఫోన్ ఆన్‌లో ఉండాల్సిన అవసరం కూడా లేదు.
10 నిమిషాల నుంచి 14 రోజుల వరకు..
ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ మరో కీలక ఫీచర్‌ను ప్రకటించింది. వినియోగదారులు తమకు నచ్చిన సమయంలో మెసేజ్‌లను పంపుకునేలా షెడ్యూల్డ్ మెసేజెస్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. మెటా యాజమాన్యంలోని వాట్సాప్ తన బ్లాగ్‌పోస్ట్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. వినియోగదారులు చాలాకాలంగా కోరుకుంటున్న ఫీచర్లలో ఇదొకటని సంస్థ పేర్కొంది. ఈ సదుపాయంతో మెసేజ్‌ను ముందుగానే టైప్ చేసి, 10 నిమిషాల నుంచి గరిష్ఠంగా 14 రోజుల తర్వాత డెలివరీ అయ్యేలా తేదీ, సమయాన్ని ఎంపిక చేసుకోవచ్చు. వ్యక్తిగత చాట్స్‌తోపాటు గ్రూప్ చాట్స్‌లోనూ ఈ ఫీచర్ పనిచేస్తుంది. ఉదాహరణకు రాత్రి 11 గంటలకు స్నేహితుడికి మరుసటి రోజు పరీక్ష ఉందని గుర్తొస్తే, వెంటనే మెసేజ్ పంపకుండా ఉదయం అందేలా షెడ్యూల్ చేయవచ్చు. అలాగే వేరే టైమ్‌జోన్‌లో ఉన్న స్నేహితుడికి వారి స్థానిక సమయం ప్రకారం అర్ధరాత్రి పుట్టినరోజు శుభాకాంక్షలు పంపించవచ్చు.
ఎలా చేయాలి..?
మెసేజ్ షెడ్యూల్ చేయడం కూడా చాలా సులభం. ముందుగా మెసేజ్ టైప్ చేసిన తర్వాత సెండ్ బటన్‌పై ఎక్కువసేపు నొక్కి ఉంచాలి. అనంతరం కనిపించే ఆప్షన్లలో డెలివరీ తేదీ, సమయాన్ని ఎంపిక చేసుకోవాలి. నిర్ణయించిన సమయానికి మెసేజ్ ఆటోమేటిక్‌గా సెండ్ అవుతుంది. స్వీకర్తకు మాత్రం అది సాధారణంగా పంపిన మెసేజ్‌లాగే కనిపిస్తుంది. షెడ్యూల్ చేసిన మెసేజ్‌లన్నింటినీ ఒకేచోట చూసుకునే సదుపాయం కూడా ఉంటుంది. ఒకవేళ మనసు మార్చుకుంటే, మెసేజ్ డెలివరీ అయ్యేలోపు దాన్ని తొలగించవచ్చు. ముఖ్యంగా, మెసేజ్ పంపాల్సిన సమయంలో పంపిన వ్యక్తి ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉన్నా, బ్యాటరీ పూర్తిగా అయిపోయినా మెసేజ్ నిర్ణయించిన సమయానికి డెలివరీ అవుతుందని వాట్సాప్ వెల్లడించింది.
ప్రైవసీకి కూడా ప్రాధాన్యత..
ఇతర వ్యక్తిగత చాట్స్ తరహాలోనే షెడ్యూల్ చేసిన మెసేజ్‌లకు కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ రక్షణ ఉంటుందని సంస్థ తెలిపింది. దీంతో వాట్సాప్ సహా ఇతరులు ఆ మెసేజ్‌లను చదవలేరు. కేవలం టెక్స్ట్ మాత్రమే కాకుండా ఫొటోలు, వీడియోలను కూడా షెడ్యూల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు రానున్న కొన్ని వారాల్లో దశలవారీగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. వినియోగదారులు తమకు అనుకూలమైన సమయంలో మెసేజ్‌లను పంపుకునేందుకు ఈ కొత్త ఫీచర్ ఉపయోగపడనుంది.
తాజావార్తలు
- ●Errolla Srinivas | రేవంత్ పాలనలో అడుగడుగునా కుల వివక్ష : ఎర్రోళ్ల శ్రీనివాస్
- ●Apple Store | హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. త్వరలో యాపిల్ ఫస్ట్ రిటైల్ స్టోర్.. ఎక్కడంటే..?
- ●Amala Paul | పెళ్లి తర్వాత సినిమాల్లోకి అమలాపాల్ - తల్లి పాత్రలో మలయాళ బ్యూటీ
- ●Uterus | బాలుడి కడుపులో గర్భాశయం.. పరిగిలో వెలుగు చూసిన ఘటన
- ●BM Sandip Kumar | దేశ రాజ్యాంగం కాంగ్రెస్ రాజ్యాంగం ఒక్కటే
- ●FMCG Stocks | ఎఫ్ఎంసీజీ షేర్లలో భారీ ర్యాలీ.. 17 ఏళ్ల రికార్డు.. ఇప్పుడు కొనవచ్చా..?

Errolla Srinivas | రేవంత్ పాలనలో అడుగడుగునా కుల వివక్ష : ఎర్రోళ్ల శ్రీనివాస్

Apple Store | హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. త్వరలో యాపిల్ ఫస్ట్ రిటైల్ స్టోర్.. ఎక్కడంటే..?

Amala Paul | పెళ్లి తర్వాత సినిమాల్లోకి అమలాపాల్ - తల్లి పాత్రలో మలయాళ బ్యూటీ

Uterus | బాలుడి కడుపులో గర్భాశయం.. పరిగిలో వెలుగు చూసిన ఘటన






