త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Whatsapp | వాట్సాప్‌లో వ‌స్తున్న అద్భుత‌మైన ఫీచ‌ర్లు.. ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ల మ‌ధ్య డేటా ట్రాన్స్‌ఫ‌ర్ ఇక ఈజీ..

Whatsapp | ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్ప‌టిక‌ప్పుడు అనేక అద్బుత‌మైన ఫీచ‌ర్ల‌ను యూజ‌ర్ల‌కు అందిస్తూ వ‌స్తోంది. అందులో భాగంగానే రానున్న రోజుల్లో మ‌రిన్ని ఫీచ‌ర్ల‌ను, టూల్స్‌ను అందించ‌నున్న‌ట్లు ఆ సంస్థ ప్ర‌క‌టించింది.

S

Technology | Published On Mar 27, 2026, 12.00 pm IST

Whatsapp | వాట్సాప్‌లో వ‌స్తున్న అద్భుత‌మైన ఫీచ‌ర్లు.. ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ల మ‌ధ్య డేటా ట్రాన్స్‌ఫ‌ర్ ఇక ఈజీ..
Advertisement

Whatsapp | ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్ప‌టిక‌ప్పుడు అనేక అద్బుత‌మైన ఫీచ‌ర్ల‌ను యూజ‌ర్ల‌కు అందిస్తూ వ‌స్తోంది. అందులో భాగంగానే రానున్న రోజుల్లో మ‌రిన్ని ఫీచ‌ర్ల‌ను, టూల్స్‌ను అందించ‌నున్న‌ట్లు ఆ సంస్థ ప్ర‌క‌టించింది. ఈ ఫీచర్ల వ‌ల్ల క్రాస్ ప్లాట్‌ఫామ్ ప‌నితీరు మెరుగు ప‌డడంతోపాటు డేటా నిర్వ‌హ‌ణ మ‌రింత సుల‌భ‌త‌రం అవుతుంద‌ని, యూజ‌ర్ల అనుభ‌వం మ‌రింత మెరుగు ప‌డుతుంద‌ని వాట్సాప్ తెలిపింది. మెటాకు చెందిన ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ఇప్ప‌టికే అనేక అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను అందిస్తుండ‌గా, ఇకపై యూజ‌ర్లు అందులో స్టోరేజ్ మేనేజ్‌మెంట్‌, ఆండ్రాయిడ్‌-ఐఓఎస్ మ‌ధ్య చాట్స్ ట్రాన్స్‌ఫ‌ర్‌, ఏఐ ఆధారిత చాట్స్ కోసం కొత్త టూల్స్ వంటి ఫీచ‌ర్ల‌ను పొందుతార‌ని ఆ సంస్థ తెలియ‌జేసింది. అలాగే ఐఫోన్ యూజ‌ర్లు ఇక‌పై ఒకే డివైస్‌లో రెండు అకౌంట్ల‌ను నిర్వ‌హించుకునే సౌక‌ర్యాన్ని కూడా క‌ల్పించ‌నున్నారు. ఈ ఫీచ‌ర్ ప్ర‌స్తుతం కేవ‌లం ఆండ్రాయిడ్ డివైస్‌ల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉంది.

ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ల మ‌ధ్య ఈజీగా డేటా ట్రాన్స్‌ఫ‌ర్‌..

కొత్త అప్‌డేట్స్‌లో వాట్సాప్ క్రాస్ ప్లాట్‌ఫామ్ చాట్ ట్రాన్స్‌ఫ‌ర్ ఫీచ‌ర్‌ను అందించ‌నుంది. వాట్సాప్ బ్లాగ్ పోస్టులో తెలిపిన ప్ర‌కారం ఇక‌పై యూజ‌ర్లు ఐఓఎస్ నుంచి ఆండ్రాయిడ్‌కు లేదా ఆండ్రాయిడ్ నుంచి ఐఓఎస్‌కు త‌మ చాట్స్‌ను సుల‌భంగా ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌చ్చు. అదే ప్లాట్‌ఫామ్‌లో మాత్ర‌మే కాకుండా, రెండు వేర్వేరు ప్లాట్‌ఫామ్‌ల మ‌ధ్య కూడా డేటా మార్పిడి సాధ్య‌మ‌వుతుంది. ఈ ఫీచ‌ర్ ద్వారా అకౌంట్ స‌మాచారం, వ్య‌క్తిగ‌త‌, గ్రూప్ చాట్స్‌, క‌మ్యూనిటీలు, వాట్సాప్ చాన‌ల్ అప్‌డేట్స్‌, చాట్ హిస్ట‌రీ, కాల్ హిస్ట‌రీ అన్నింటినీ మైగ్రేట్ చేసుకోవ‌చ్చు. యూజ‌ర్లు త‌మ ఫొటోలు, వీడియోల‌ను కూడా డివైస్‌ల మ‌ధ్య ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌చ్చు.

పెద్ద ఫైల్స్‌ను తొల‌గించ‌డం సుల‌భం..

కొత్త‌గా అందించ‌నున్న ఫీచ‌ర్ల‌లో భాగంగా స్టోరేజ్ నిర్వ‌హ‌ణ‌కు కూడా మెరుగులు దిద్ద‌నున్నారు. యూజ‌ర్లు ఒక్కో చాట్‌లోనే పెద్ద ఫైల్స్‌ను గుర్తించి వాటిని తొల‌గించే అవ‌కాశం పొంద‌నున్నారు. చాట్ పేరుపై ట్యాప్ చేసి మేనేజ్ స్టోరేజ్ అనే ఆప్ష‌న్‌ను ఎంచుకుంటే ఈ సౌక‌ర్యం ల‌భిస్తుంది. దీంతో చాట్ మొత్తాన్ని తొల‌గించాల్సిన అవ‌స‌రం లేకుండా, కేవ‌లం అవ‌స‌రం లేని ఫైల్స్‌ను మాత్ర‌మే తొల‌గించి స్టోరేజ్‌ను ఫ్రీ చేసుకోవ‌చ్చు. యూజ‌ర్లు మీడియా ఫైల్స్‌ను మాత్ర‌మే తొల‌గించి, చాట్ హిస్ట‌రీని అలాగే ఉంచుకునే అవ‌కాశం కూడా ఉంది. ఇక దీంతోపాటు ఐఓఎస్ యూజ‌ర్లు త‌మ డివైస్‌లో ఇక‌పై రెండు అకౌంట్ల‌ను మెయింటెయిన్ చేయ‌వ‌చ్చు. ఈ ఫీచ‌ర్ ఆండ్రాయిడ్‌లో మాత్ర‌మే ఉంది. కానీ ఇక‌పై ఐఫోన్ యూజ‌ర్ల‌కు కూడా ల‌భ్యం కానుంది. ఇక‌పై ఒకే ఐఫోన్‌లో రెండు అకౌంట్ల‌తో లాగిన్ అవుతూ వ్య‌క్తిగ‌త‌, వృత్తిప‌ర‌మైన చాట్స్‌ను సుల‌భంగా మేనేజ్ చేయ‌వ‌చ్చు. యాప్‌లో కింది భాగంలో ప్రొఫైల్‌లో ఫొటో చూపించ‌డం ద్వారా ప్ర‌స్తుతం ఏ అకౌంట్ యాక్టివ్‌గా ఉందో తెలియ‌జేస్తుంది.

ఏఐ ఆధారిత ఫీచ‌ర్లు కూడా..

వాట్సాప్‌లో త్వ‌ర‌లో రానున్న అప్ డేట్స్‌లో ఏఐ ఆధారిత ఫీచ‌ర్ల‌ను కూడా ఇవ్వ‌నున్నారు. ఇప్ప‌టికే ఉన్న ఏఐ ఫీచ‌ర్ల‌కు మ‌రిన్ని మెరుగులు దిద్ది అందించ‌నున్నారు. యూజ‌ర్లు ఇక‌పై మెటా ఏఐ స‌హాయంతో ఫొటోల‌ను చాట్‌లో పంపించే ముందు ఎడిట్ చేసుకోవ‌చ్చు. ఇందులో అవ‌స‌రం లేని అంశాల‌ను తొల‌గించుకోవ‌చ్చు, బ్యాక్‌గ్రౌండ్‌ను మార్చుకోవ‌చ్చు, వివిధ ర‌కాల ఎంపిక చేసిన స్టైల్స్‌ను అప్లై చేయ‌వ‌చ్చు. అలాగే రైటింగ్ హెల్ప్ అనే ఫీచ‌ర్‌ను కూడా అప్‌డేట్ చేయ‌నున్నారు. యూజ‌ర్లు కొన‌సాగించే చాట్స్‌లో ఉండే సంభాష‌ణ‌ల‌ను బ‌ట్టి ఈ ఫీచ‌ర్ స‌మాధానాల‌ను సూచిస్తుంది. వాట్సాప్ తెలిపిన ప్ర‌కారం ఈ ఫీచ‌ర్ యూజ‌ర్ల‌కు సుల‌భంగా రిప్లైల‌ను క్రియేట్ చేయ‌డంలో స‌హాయం చేస్తుంది. ప్రైవ‌సీకి సైతం ఎలాంటి భంగం క‌ల‌గ‌దు. కాగా మెటా సంస్థ తెలిపిన ప్రకారం ఈ కొత్త వాట్సాప్ ఫీచ‌ర్ల‌ను రానున్న రోజుల్లో ద‌శ‌ల‌వారిగా యూజ‌ర్ల‌కు అంద‌జేయ‌నున్నారు. వ‌చ్చే కొన్ని వారాల్లో ఈ ఫీచ‌ర్లు యూజ‌ర్ల‌కు ల‌భిస్తాయ‌ని తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement