WhatsApp | వాట్సాప్‌లో కొత్త గ్రీన్ డాట్.. ఆన్‌లైన్‌లో ఉన్నవారిని వెంటనే గుర్తించొచ్చు..
WhatsApp | మెటాకు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో వినియోగదారులకు మరిన్ని కొత్త ఫీచర్లను అందించేందుకు సిద్ధమవుతోంది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం కాంటాక్ట్ ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు వారి ప్రొఫైల్ ఫొటోపై గ్రీన్ డాట్ కనిపించే కొత్త ఫీచర్‌ను కంపెనీ పరీక్షిస్తోంది.
Technology | Published On Jun 20, 2026, 10.45 am IST
WhatsApp | మెటాకు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో వినియోగదారులకు మరిన్ని కొత్త ఫీచర్లను అందించేందుకు సిద్ధమవుతోంది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం కాంటాక్ట్ ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు వారి ప్రొఫైల్ ఫొటోపై గ్రీన్ డాట్ కనిపించే కొత్త ఫీచర్‌ను కంపెనీ పరీక్షిస్తోంది. దీంతో చాట్‌ను ఓపెన్ చేయకుండానే ఎవరు ప్రస్తుతం యాప్‌ను ఉపయోగిస్తున్నారో సులభంగా తెలుసుకునే అవకాశం లభించనుంది. ఫీచర్ ట్రాకర్ డబ్ల్యూఏబీటాఇన్ఫో వెల్లడించిన వివరాల ప్రకారం వాట్సాప్ బీటా ఫర్ ఆండ్రాయిడ్ వెర్షన్ 2.26.24.5లో ఈ ఫీచర్ ను గుర్తించారు. ప్రస్తుతం చాట్ ఇన్ఫో స్క్రీన్‌లో కనిపించే ఆన్‌లైన్ టెక్స్ట్ లేబుల్ స్థానంలో ఈ గ్రీన్ డాట్ సూచికను తీసుకురావాలని కంపెనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాంటాక్ట్ యాప్‌లో యాక్టివ్‌గా ఉన్న సమయంలో వారి ప్రొఫైల్ ఫొటోపై ఈ గ్రీన్ డాట్ కనిపిస్తుంది.
ప్రైవసీ ప్రకారమే సెట్టింగ్..
అయితే వినియోగదారుల గోప్యతను దృష్టిలో ఉంచుకుని ఈ గ్రీన్ డాట్‌ను ప్రైవసీ సెట్టింగ్స్ ద్వారా దాచుకునే అవకాశం కూడా ఉండనుందని డబ్ల్యూఏబీటాఇన్ఫో పేర్కొంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, స్లాక్ వంటి యాప్‌లలో ఇప్పటికే అందుబాటులో ఉన్న గ్రీన్ డాట్ వ్యవస్థ మాదిరిగానే ఇది కూడా రియల్ టైమ్‌లో చాట్ చేయడానికి అందుబాటులో ఉన్నవారిని గుర్తించేందుకు సహాయపడుతుంది. కాగా వాట్సాప్ మరో ముఖ్యమైన ఫీచర్‌పై కూడా పని చేస్తున్నట్లు సమాచారం. ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ప్రత్యేక ఇన్-యాప్ బ్యాకప్ మేనేజ్‌మెంట్ సెక్షన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్ ద్వారా పాత బ్యాకప్‌లను వీక్షించడం, అవసరం లేని బ్యాకప్‌లను తొలగించడం, డూప్లికేట్ కాపీలను నిర్వహించడం వంటి సదుపాయాలను అందుబాటులోకి తేనున్నారు. దీంతో ఫోన్ స్టోరేజ్‌ను మరింత సమర్థంగా నియంత్రించుకోవడం సాధ్యమవుతుంది. ప్రస్తుతం ఈ బ్యాకప్ మేనేజ్‌మెంట్ ఫీచర్ అభివృద్ధి దశలో ఉందని, ఇంకా బీటా టెస్టింగ్‌కు విడుదల కాలేదని సమాచారం.
డివైస్ సెట్టింగ్స్ నుంచే బ్యాకప్..
అలాగే గూగుల్ డ్రైవ్ స్టోరేజ్ నిర్వహణకు సంబంధించిన షార్ట్‌కట్‌లు, ఆండ్రాయిడ్ సిస్టమ్ సెట్టింగ్స్ నుంచే బ్యాకప్ సెట్టింగ్స్‌ను యాక్సెస్ చేసే సదుపాయాలు కూడా ఇందులో ఉండే అవకాశం ఉంది. ఇక గూగుల్ కూడా ఈ ప్రాజెక్టుకు మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. తాజా గూగుల్ ప్లే సర్వీసెస్ వి26.23 అప్‌డేట్‌తో ఆండ్రాయిడ్ వినియోగదారులు తమ డివైస్ సెట్టింగ్స్ నుంచే వాట్సాప్ బ్యాకప్‌లను నేరుగా నిర్వహించగలిగే విధంగా ప్రత్యేక బ్యాకప్ మేనేజ్‌మెంట్ సెక్షన్‌ను అందించినట్లు డబ్ల్యూఏబీటాఇన్ఫో తెలిపింది.
సంబంధిత వార్తలు

WhatsApp | ఇకపై వాట్సాప్ ద్వారా విద్యార్థుల సమాచారం.. డిజిటల్ బాటలో సర్కారు బడులు..
జూన్ 20, 2026

WhatsApp | వాట్సాప్‌లో కొత్త వాయిస్ నోట్ విడ్జెట్.. యాప్ ఓపెన్ చేయకుండానే మెసేజ్ పంపే అవకాశం..
జూన్ 19, 2026

Pavel Durov Reliance | భారత్‌లో టెలిగ్రామ్ బ్యాన్పై రిలయన్స్, వాట్సప్ కుట్ర! సీఈఓ సంచలన ఆరోపణలు.. అసలు నిజమేంటి?
జూన్ 17, 2026
తాజావార్తలు
- ●Budget Laptops 2026 | రూ.40వేల లోపు లభిస్తున్న బెస్ట్ బడ్జెట్ ల్యాప్‌టాప్‌లు ఇవే.. స్టూడెంట్స్, ఉద్యోగులకు టాప్ ఛాయిస్..
- ●Kavitha | నెల రోజులు గడువు.. మెడికల్ బోర్డు పెట్టకుంటే నిరహార దీక్ష: కవిత
- ●UN Meeting | నోరు మూస్తారా.. యూఎన్ ప్రతినిధిపై ఇజ్రాయెల్ రాయబారి ఫైర్
- ●Turkey Vs Paraguay | తుర్కియేకు షాక్.. ప్రపంచకప్ నుంచి నిష్క్రమణ
- ●NEET UG | నీట్ రీ-ఎగ్జామ్.. మధ్యాహ్నం 1.30 గంట వరకే ఎగ్జామ్ హాల్లోకి అనుమతి..
- ●Gold And Silver Prices Today | అంతర్జాతీయ మార్కెట్లలో భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణమేంటి..?

Budget Laptops 2026 | రూ.40వేల లోపు లభిస్తున్న బెస్ట్ బడ్జెట్ ల్యాప్‌టాప్‌లు ఇవే.. స్టూడెంట్స్, ఉద్యోగులకు టాప్ ఛాయిస్..

Kavitha | నెల రోజులు గడువు.. మెడికల్ బోర్డు పెట్టకుంటే నిరహార దీక్ష: కవిత

UN Meeting | నోరు మూస్తారా.. యూఎన్ ప్రతినిధిపై ఇజ్రాయెల్ రాయబారి ఫైర్

Turkey Vs Paraguay | తుర్కియేకు షాక్.. ప్రపంచకప్ నుంచి నిష్క్రమణ



