త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Whatsapp | వాట్సాప్ యూజ‌ర్ల‌కు గుడ్ న్యూస్.. ఇక వెబ్ వెర్ష‌న్ ద్వారా కూడా కాల్స్‌..

Whatsapp | ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త‌న యూజ‌ర్ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త ఫీచ‌ర్ల‌ను అందిస్తూ వ‌స్తోంది. అందులో భాగంగానే తాజాగా మ‌రో నూత‌న ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్‌కు చెందిన వెబ్ వెర్ష‌న్‌లోనూ ఇక‌పై కాల్స్ చేసుకోవచ్చ‌ని స్ప‌ష్టం చేసింది.

S

Technology | Published On Feb 10, 2026, 12.48 pm IST

Whatsapp | వాట్సాప్ యూజ‌ర్ల‌కు గుడ్ న్యూస్.. ఇక వెబ్ వెర్ష‌న్ ద్వారా కూడా కాల్స్‌..
Advertisement

Whatsapp | ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త‌న యూజ‌ర్ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త ఫీచ‌ర్ల‌ను అందిస్తూ వ‌స్తోంది. అందులో భాగంగానే తాజాగా మ‌రో నూత‌న ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్‌కు చెందిన వెబ్ వెర్ష‌న్‌లోనూ ఇక‌పై కాల్స్ చేసుకోవచ్చ‌ని స్ప‌ష్టం చేసింది. ఇందుకు గాను డెస్క్ టాప్ యాప్‌ను ఇన్ స్టాల్ చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని, నేరుగా బ్రౌజ‌ర్ నుంచే వాయిస్ లేదా వీడియో కాల్స్ ను చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది. అయితే ప్ర‌స్తుతం ఈ ఫీచ‌ర్ పూర్తి స్థాయిలో వాట్సాప్ యూజ‌ర్ల‌కు ఇంకా అందుబాటులోకి రాలేదు. వాట్సాప్ వెబ్ ను బీటా వెర్ష‌న్ గా వాడుతున్న వారికి మాత్ర‌మే ఇది ల‌భిస్తోంది. కానీ త్వ‌ర‌లోనే పూర్తి స్థాయిలో యూజ‌ర్లంద‌రికీ దీన్ని అందుబాటులోకి తేనున్నారు. ఈ మేర‌కు ఈ ఫీచ‌ర్ ప్ర‌స్తుతం వాట్సాప్ వెబ్ బీటా వెర్ష‌న్‌లో ప‌నిచేస్తుంద‌ని WABetaInfo గుర్తించింది.

కేవ‌లం వ్య‌క్తిగ‌త చాట్స్‌లోనే..

వాట్సాప్ వెబ్ బీటా ప్రోగ్రామ్‌లో కొద్ది మంది యూజ‌ర్ల‌కు ప్ర‌స్తుతం వెబ్ వెర్ష‌న్ కాల్స్ స‌దుపాయం అందుబాటులో ఉంద‌ని WABetaInfo తెలిపింది. ఇక ఈ ఫీచ‌ర్‌ను ప్ర‌స్తుతం మొద‌టి ద‌శ‌లో భాగంగా ప‌రీక్షిస్తున్నారు. ఇందులో వ్య‌క్తిగత చాట్స్‌లో మాత్ర‌మే వాయిస్ లేదా వీడియో కాల్స్‌ను చేసుకునే వీలు క‌ల్పించారు. వెబ్ వెర్ష‌న్ లో వ్య‌క్తిగ‌త చాట్ ఓపెన్ చేసి అందులో క‌నిపించే వాయిస్ లేదా వీడియో కాల్ అనే ఐకాన్‌పై క్లిక్ చేస్తే నేరుగా కాల్‌ను ప్రారంభించ‌వ‌చ్చు. ఈ ఫీచ‌ర్ వ‌ల్ల వాట్సాప్ డెస్క్‌టాప్ యాప్‌ను వాడ‌ని యూజ‌ర్ల‌తోపాటు లైన‌క్స్ యూజ‌ర్ల‌కు కూడా ఎంతో ఉప‌యోగంగా ఉంటుంది.

త్వ‌ర‌లో గ్రూప్ కాలింగ్ కూడా..

వాట్సాప్ వెబ్ ద్వారా చేసుకునే కాల్స్ కూడా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్ష‌న్ ద్వారా సుర‌క్షితంగా ఉంటాయ‌ని ఆ సంస్థ తెలిపింది. ఇక వీడియో కాలింగ్ స‌మ‌యంలో స్క్రీన్‌ను షేర్ చేసుకునే సౌక‌ర్యాన్ని కూడా అందుబాటులో ఉంచారు. ఇక వెబ్ వెర్ష‌న్‌లోనే గ్రూప్ కాలింగ్ ఫీచ‌ర్‌ను కూడా వాట్సాప్ ప్ర‌స్తుతం ప‌రీక్షిస్తోంద‌ని తెలుస్తోంది. అందువ‌ల్ల కేవ‌లం వ్య‌క్తిగ‌త చాట్‌ల‌లోనే కాకుండా గ్రూప్ ల‌లో కూడా వాట్సాప్ వెబ్ వెర్ష‌న్‌లో కాల్స్‌ను చేసుకునే అవ‌కాశం ల‌భిస్తుంది. ఇక గ్రూప్ కాలింగ్ ఫీచ‌ర్‌లో ఒకేసారి 32 మంది వ‌ర‌కు పాల్గొనే వీలుంటుంది. అలాగే లింక్‌ల‌ను కూడా షేర్ చేసుకోవ‌చ్చు. కాగా ఈ ఫీచ‌ర్ల‌న్నింటినీ అతి త్వ‌ర‌లోనే పూర్తి స్థాయిలో యూజ‌ర్లంద‌రికీ వాట్సాప్ అందించ‌నుంద‌ని తెలుస్తోంది. కానీ బీటా వెర్ష‌న్‌ను వాడుతున్న వారు మాత్రం ఈ ఫీచ‌ర్ల‌ను ఇప్పుడే ఉప‌యోగించుకోవ‌చ్చు.

Advertisement
Advertisement