WhatsApp Web | వాట్సాప్ వెబ్ వాడుతున్నారా? మీ వ్యక్తిగత సందేశాలకు ముప్పు.. కేంద్రం హెచ్చరిక..
WhatsApp Web | కంప్యూటర్లు, సైబర్ కేఫ్‌లు, కార్యాలయాల్లోని షేర్డ్ సిస్టమ్‌లపై వాట్సాప్ వెబ్ ఉపయోగించేవారు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. లాగిన్ చేసిన తర్వాత లాగ్‌అవుట్ చేయకుండా వదిలేస్తే వ్యక్తిగత చాట్లు, కాంటాక్టులు ఇతరుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుందని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) స్పష్టం చేసింది.
Technology | Published On Nov 23, 2026, 6.56 pm IST
WhatsApp Web | కంప్యూటర్లు, సైబర్ కేఫ్‌లు, కార్యాలయాల్లోని షేర్డ్ సిస్టమ్‌లపై వాట్సాప్ వెబ్ ఉపయోగించేవారు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. లాగిన్ చేసిన తర్వాత లాగ్‌అవుట్ చేయకుండా వదిలేస్తే వ్యక్తిగత చాట్లు, కాంటాక్టులు ఇతరుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుందని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) స్పష్టం చేసింది.
సరిగ్గా లాగవుట్ చేయకపోతే అంతే సంగతులు..
కంప్యూటర్‌లో వాట్సాప్ వెబ్ ఉపయోగిస్తున్నారా? అయితే మీ వ్యక్తిగత సందేశాలు, ఇతర సమాచారం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. సోమవారం నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ (ఎన్‌సీటీఏయూ), ఐ4సీ ద్వారా ఈ హెచ్చరిక జారీ చేసింది. వాట్సాప్ వెబ్‌లో లాగిన్ అయిన తర్వాత సరిగ్గా లాగ్‌అవుట్ చేయకుండా వదిలేస్తే ఇతరులు ఆ అకౌంట్‌ను తమ ఆధీనంలోకి తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. ఇలా యాక్సెస్ పొందిన వ్యక్తులు ప్రైవేట్ చాట్లు, కాంటాక్టులు, గ్రూప్ సంభాషణలను చూడడమే కాకుండా, అకౌంట్ యజమాని పేరుతో సందేశాలు పంపవచ్చు. ఈ గుర్తింపును ఉపయోగించి ఆర్థిక మోసాలు, ఫిషింగ్ స్కామ్‌లు, ఇతర సైబర్ నేరాలకు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
పబ్లిక్ పీసీలలో జాగ్రత్త..
ముఖ్యంగా కార్యాలయాల్లోని కంప్యూటర్లు, ఇతరులతో పంచుకునే సిస్టమ్‌లు, పబ్లిక్ డివైజ్‌ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని ఐ4సీ సూచించింది. ప్రభుత్వ, సంస్థాగత, ఆర్థిక, రహస్య లేదా ఇతర కీలక సమాచారాన్ని కంప్యూటర్లలోని వాట్సాప్ వెబ్ ద్వారా పంపించకపోవడమే మంచిదని స్పష్టం చేసింది. అవసరం లేనప్పుడు వాట్సాప్ వెబ్‌ను లాగిన్‌లో ఉంచకూడదని, ముఖ్యంగా సహోద్యోగులతో పంచుకునే కంప్యూటర్లలో ఉపయోగించినప్పుడు తప్పనిసరిగా లాగ్‌అవుట్ చేయాలని సూచించింది. బ్రౌజర్ ట్యాబ్‌ను మూసివేస్తే సరిపోతుందని చాలామంది భావిస్తారని, కానీ అలా చేయడం వల్ల వాట్సాప్ వెబ్ సెషన్ ముగిసిపోదని హెచ్చరించింది. వినియోగం పూర్తయిన వెంటనే మాన్యువల్‌గా సైన్ అవుట్ చేయాలని స్పష్టం చేసింది.
ఈ సూచనలు పాటించాలి..
తప్పనిసరి పరిస్థితుల్లో వాట్సాప్ వెబ్ ఉపయోగించాల్సి వస్తే నమ్మకమైన కంప్యూటర్‌లో ప్రైవేట్ లేదా ఇన్‌కాగ్నిటో బ్రౌజర్ విండోను ఉపయోగించాలని సూచించింది. అయినప్పటికీ బ్రౌజర్ మూసే ముందు తప్పనిసరిగా లాగ్‌అవుట్ కావాలని తెలిపింది. సైబర్ కేఫ్‌లు, పబ్లిక్ కియోస్క్‌లు, హోటళ్ల బిజినెస్ సెంటర్లు, ఇతరుల కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్ ఉపయోగించకపోవడమే మంచిదని హెచ్చరించింది. మీ అకౌంట్ నుంచి మీకు తెలియకుండా సందేశాలు వెళ్లడం, కాంటాక్టుల నుంచి అసాధారణ రిప్లైలు రావడం, అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలని సూచించింది. అలాగే మొబైల్, కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్‌లు, బ్రౌజర్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలని, సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ను తాజా వెర్షన్‌లో ఉంచుకోవాలని, అనుమానాస్పద కంటెంట్, తెలియని ఫైళ్లు, క్రాక్డ్ సాఫ్ట్‌వేర్లను డౌన్‌లోడ్ చేయవద్దని ఐ4సీ సూచించింది.
సంబంధిత వార్తలు

Supreme Court | డిజిటల్ అరెస్టు మోసాలకు చెక్.. వాట్సాప్‌కు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
నవంబర్ 10, 2026

CP Sajjanar | దీపావళి కానుక పేరుతో సైబర్ కేటుగాళ్ల వల.. నకిలీ మెసేజ్‌లతో జాగ్రత్త: సీపీ సజ్జనార్
నవంబర్ 7, 2026

Chamala Kiran Kumar Reddy | సైబర్ బెదిరింపులను అరికట్టడంలో ఏఐ, సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీది కీలకపాత్ర: ఎంపీ చామల
ఆగస్టు 29, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | కృష్ణా నుంచి ఆంధ్రకు ప్రతిరోజూ 13 టీఎంసీలు
- ●Srinath Maganti | విడుదలకు ముందు ట్రోలింగ్ - ఇప్పుడు ప్రశంసలు
- ●Arunachal Karthigai Deepam | రాగి పాత్రలో అఖండ జ్యోతి.. అరుణాచల మహా దీపం వెనుక ఆసక్తికర విషయాలు!
- ●OU PhD Entrance Tests Schedule | ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్డీ ఎంట్రెన్స్ తేదీలు ఖరారు
- ●Dasyam Vinay Bhaskar | దమ్ముంటే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేయ్.. ఎమ్మెల్యే నాయినికి దాస్యం సవాల్
- ●Nitin Nabin Karimnagar Visit | మళ్లీ మోదీనే ప్రధాని.. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే

CM Revanth Reddy | కృష్ణా నుంచి ఆంధ్రకు ప్రతిరోజూ 13 టీఎంసీలు

Srinath Maganti | విడుదలకు ముందు ట్రోలింగ్ - ఇప్పుడు ప్రశంసలు

Arunachal Karthigai Deepam | రాగి పాత్రలో అఖండ జ్యోతి.. అరుణాచల మహా దీపం వెనుక ఆసక్తికర విషయాలు!

OU PhD Entrance Tests Schedule | ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్డీ ఎంట్రెన్స్ తేదీలు ఖరారు



