WhatsApp | వాట్సాప్ యూజర్లకు కొత్త సెక్యూరిటీ ఫీచర్లు.. ఇక అకౌంట్ మరింత సేఫ్..
WhatsApp | ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ తన యూజర్ల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు వరుసగా కొత్త సెక్యూరిటీ అప్‌డేట్లను ప్రకటించింది. యూజర్ అకౌంట్ రక్షణను పెంచడం, అదనపు ఆథెంటికేషన్ విధానాలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే అవాంఛిత కాల్స్, మోసపూరిత కాల్స్‌ను గుర్తించడంలో సహాయపడే ఫీచర్లను తీసుకొచ్చింది.
Technology | Published On Aug 27, 2026, 12.17 pm IST
WhatsApp | ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ తన యూజర్ల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు వరుసగా కొత్త సెక్యూరిటీ అప్‌డేట్లను ప్రకటించింది. యూజర్ అకౌంట్ రక్షణను పెంచడం, అదనపు ఆథెంటికేషన్ విధానాలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే అవాంఛిత కాల్స్, మోసపూరిత కాల్స్‌ను గుర్తించడంలో సహాయపడే ఫీచర్లను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఒక బిలియన్‌కు పైగా యూజర్లు పాస్‌కీలను ఆథెంటికేషన్ కోసం ఉపయోగిస్తున్న నేపథ్యంలో, వివిధ డివైస్‌లు, ప్లాట్‌ఫామ్‌లలో పాస్‌కీ వినియోగాన్ని మరింత విస్తరించేలా వాట్సాప్ ఈ మార్పులు చేసింది.
పాస్‌కీల ద్వారా లాగిన్..
పాస్‌కీల ద్వారా యూజర్లు ఎస్‌ఎంఎస్ వెరిఫికేషన్ కోడ్ అవసరం లేకుండానే ఫింగర్‌ప్రింట్, ఫేస్ రికగ్నిషన్ లేదా డివైస్ స్క్రీన్ లాక్ ద్వారా తమ వాట్సాప్ అకౌంట్‌లోకి సురక్షితంగా లాగిన్ కావచ్చు. తాజా అప్‌డేట్‌లో ఒకే వాట్సాప్ అకౌంట్‌కు ఒకటి కంటే ఎక్కువ పాస్‌కీలను జోడించుకునే అవకాశం కల్పించారు. దీంతో ఐఓఎస్, ఆండ్రాయిడ్ వంటి వేర్వేరు ప్లాట్‌ఫామ్‌లకు చెందిన డివైస్‌లను ఉపయోగించే వారికి మరింత సౌకర్యం కలగనుంది. వేర్వేరు హార్డ్‌వేర్ డివైస్‌లలోనూ బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ద్వారా సురక్షితంగా వాట్సాప్‌ను యాక్సెస్ చేయవచ్చు. ఈ ఫీచర్‌ను వాట్సాప్‌లోని సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్, ఆ తర్వాత పాస్‌కీస్ ఆప్షన్ ద్వారా కాన్ఫిగర్ చేసుకోవచ్చు.
టూ-స్టెప్ వెరిఫికేషన మరింత బలోపేతం..
వాట్సాప్ తన టూ-స్టెప్ వెరిఫికేషన్ వ్యవస్థను కూడా మరింత బలోపేతం చేసింది. ఇప్పటివరకు టూ-స్టెప్ వెరిఫికేషన్‌కు ఆరు అంకెల న్యూమరిక్ పిన్ మాత్రమే ఉండేది. తాజా మార్పుతో అక్షరాలు, సంఖ్యలు, ప్రత్యేక అక్షరాలతో కూడిన పూర్తి ఆల్ఫాన్యూమరిక్ పాస్‌వర్డ్‌ను ఉపయోగించుకునే అవకాశం కల్పించారు. దీంతో పాస్‌వర్డ్ మరింత సంక్లిష్టంగా మారుతుంది. ఒకసారి ఉపయోగించే వెరిఫికేషన్ కోడ్ ఎవరికైనా తెలిసిపోయినా లేదా దుర్వినియోగమైనా, బ్రూట్‌ఫోర్స్ దాడులు, అకౌంట్ టేకోవర్ ప్రయత్నాలను అడ్డుకోవడంలో ఈ అదనపు భద్రతా లేయర్ ఉపయోగపడుతుంది.
తెలియని నంబర్ నుంచి కాల్ వస్తే..
ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ మరో కీలక ఫీచర్‌ను తీసుకొచ్చింది. సేవ్ చేయని కాంటాక్ట్ నుంచి కాల్ వచ్చినప్పుడు, కాల్‌ను ఆన్సర్ చేయడానికి ముందే ఆ నంబర్‌కు సంబంధించిన కొంత సందర్భ సమాచారాన్ని యూజర్‌కు చూపిస్తుంది. ఇందులో ఆ ఫోన్ నంబర్‌కు సంబంధించిన దేశ కోడ్ లేదా నంబర్ ఏ ప్రాంతానికి చెందినదనే సమాచారం కనిపిస్తుంది. అలాగే కాల్ చేస్తున్న వ్యక్తితో యూజర్‌కు ఏవైనా కామన్ గ్రూపులు ఉన్నాయా అనే వివరాలను కూడా చూపిస్తుంది. దీంతో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్‌ను ఆన్సర్ చేయడానికి ముందే యూజర్లు పరిస్థితిని అంచనా వేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్కామ్‌లు, మోసపూరిత కాల్స్, అవాంఛిత కాల్స్‌ను గుర్తించడంలో ఈ ఫీచర్ ఉపయోగపడనుంది. ఈ కొత్త సెక్యూరిటీ ఫీచర్లతో పాటు వాట్సాప్‌లో ఇప్పటికే ఉన్న డిఫాల్ట్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ కొనసాగుతుంది. వాట్సాప్‌లోని వ్యక్తిగత మెసేజింగ్, కాలింగ్ ఫీచర్లకు ఈ ఎన్‌క్రిప్షన్ రక్షణ అందిస్తుంది. కొత్త పాస్‌కీ సపోర్ట్, మరింత బలమైన టూ-స్టెప్ వెరిఫికేషన్, తెలియని కాలర్లకు సందర్భ సమాచారంతో యూజర్ల అకౌంట్ల భద్రతను మరింత పెంచే దిశగా వాట్సాప్ కీలక మార్పులు చేసింది.
సంబంధిత వార్తలు

Direct To Cell Service | మొబైల్ టవర్ లేకున్నా వాట్సాప్.. స్టార్‌లింక్‌తో ఎయిర్టెల్ కొత్త సేవలు
ఆగస్టు 16, 2026

WhatsApp | స్కామర్లకు ఇక చెక్.. వాట్సాప్‌లో ఏఐతో కొత్త సెక్యూరిటీ ఫీచర్..
ఆగస్టు 14, 2026

Meta Platforms | మెటా ప్లాట్‌ఫామ్స్ ఒక పబ్లిక్ న్యూసెన్స్.. న్యూమెక్సికో కోర్టు షాకింగ్ తీర్పు.. సంస్థకు రూ.5400 కోట్ల జరిమానా..
ఆగస్టు 7, 2026
తాజావార్తలు
- ●PM Modi | 2036 ఒలింపిక్స్‌కు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి
- ●PM Modi | ఒలింపిక్స్‌లో భారత భాగస్వామ్యం పెరగాలి : ప్రధాని మోదీ
- ●Revanth Reddy | గవర్నర్‌కు సీఎం రేవంత్ పరామర్శ
- ●Nora Fatehi | ఆ వివాదం నన్ను తీవ్రంగా వేధించింది.. ఎన్నో అవకాశాలను కోల్పోయా : నోరా ఫతేహి
- ●Janhvi Kapoor | బాలీవుడ్ హీరోతో జాన్వీ కపూర్ పెళ్లంటూ రూమర్లు - ఫొటోల వెనకున్న అసలు ట్విస్ట్ ఇదే!
- ●Lunar Eclipse | ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం రేపే.. భారత్‌లో కనిపిస్తుందా..?

PM Modi | 2036 ఒలింపిక్స్‌కు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి

PM Modi | ఒలింపిక్స్‌లో భారత భాగస్వామ్యం పెరగాలి : ప్రధాని మోదీ

Revanth Reddy | గవర్నర్‌కు సీఎం రేవంత్ పరామర్శ

Nora Fatehi | ఆ వివాదం నన్ను తీవ్రంగా వేధించింది.. ఎన్నో అవకాశాలను కోల్పోయా : నోరా ఫతేహి



