త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Whatsapp Prepaid Mobile Recharge | ఇక వాట్సాప్‌లో యూజ‌ర్లు ప్రీపెయిడ్ మొబైల్‌ రీచార్జి కూడా చేసుకోవ‌చ్చు.. వీరికి అందుబాటులోకి..

Whatsapp Prepaid Mobile Recharge | ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ ఇటీవ‌లి కాలంలో త‌న యూజ‌ర్ల‌కు అనేక నూత‌న ఫీచ‌ర్ల‌ను అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్‌ను వాడ‌డం మ‌రింత తేలిక‌వ‌డంతోపాటు యూజ‌ర్ల డేటా ర‌క్ష‌ణ కోసం అనేక స‌దుపాయాల‌ను అందిస్తోంది.

S

Technology | Published On Apr 24, 2026, 1.51 pm IST

Whatsapp Prepaid Mobile Recharge | ఇక వాట్సాప్‌లో యూజ‌ర్లు ప్రీపెయిడ్ మొబైల్‌ రీచార్జి కూడా చేసుకోవ‌చ్చు.. వీరికి అందుబాటులోకి..
Advertisement

Whatsapp Prepaid Mobile Recharge | ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ ఇటీవ‌లి కాలంలో త‌న యూజ‌ర్ల‌కు అనేక నూత‌న ఫీచ‌ర్ల‌ను అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్‌ను వాడ‌డం మ‌రింత తేలిక‌వ‌డంతోపాటు యూజ‌ర్ల డేటా ర‌క్ష‌ణ కోసం అనేక స‌దుపాయాల‌ను అందిస్తోంది. అయితే ఇక ఈ ప్లాట్‌ఫామ్‌లో యూజ‌ర్లు త‌మ ప్రీపెయిడ్ మొబైల్స్‌కు రీచార్జి కూడా చేసుకోవచ్చు. జియో, ఎయిర్‌టెల్‌, వీఐ ప్రీపెయిడ్ వినియోగ‌దారులు వాట్సాప్‌లోనే రీచార్జి చేసుకునే స‌దుపాయాన్ని అందిస్తున్నారు. యూజ‌ర్లు మొబైల్ డేటాతోపాటు వాయిస్ కాల్ లేదా కంబైన్డ్ ప్లాన్ల‌ను ఇక వాట్సాప్‌లోనే రీచార్జి చేసుకోవ‌చ్చు. అందుకు మ‌ళ్లీ వేరే యాప్‌ల‌ను ఓపెన్ చేయాల్సిన అవ‌స‌రం లేదు. అయితే ఈ ఫీచ‌ర్ త్వ‌ర‌లో వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి రానుంది.

PayU ద్వారా పేమెంట్ల ప్రాసెసింగ్‌..

ఈ ఫీచర్‌ను భార‌త్‌లోని ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు దశలవారీగా రాబోయే వారాల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనివల్ల వాట్సాప్ యాప్‌లోనే వివిధ రీచార్జ్ ప్లాన్లను బ్రౌజ్ చేసి, ఎంపిక చేసుకునే వీలుంటుంది. ఈ సేవకు PayU మద్దతు అందిస్తోంది. డిజిటల్ పేమెంట్ సేవలను వెబ్‌సైట్లు, యాప్‌లతో అనుసంధానించడంలో నిపుణత కలిగిన ఫిన్‌టెక్ కంపెనీగా ఈ సంస్థ పేరుగాంచింది. ఈ క్ర‌మంలోనే వాట్సాప్‌లో యూజ‌ర్లు త‌మ మొబైల్ రీచార్జిల‌కు చేసే పేమెంట్లు ఇక‌పై PayU ద్వారా ప్రాసెస్ అవుతాయి.

కాగా ఫీచర్‌పై వాట్సాప్ మాతృసంస్థ మెటా స్పందిస్తూ వినియోగదారులు వేర్వేరు యాప్‌ల మధ్య మారుతూ ఉండకుండా ఒకే ప్లాట్‌ఫామ్‌లో చెల్లింపులు పూర్తి చేసుకునే విధంగా దీన్ని అభివృద్ధి చేసినట్లు తెలిపింది. రీచార్జ్ సేవలను నేరుగా వాట్సాప్‌లో అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వినియోగదారులు అనేక యాప్‌ల మధ్య మారాల్సిన అవసరం ఉండ‌ద‌ని, సులభంగా కనెక్ట్‌గా ఉండగలుగుతార‌ని మెటా ఇండియా బిజినెస్ మెసేజింగ్ డైరెక్టర్ ర‌వి గార్గ్ పేర్కొన్నారు.

ఇలా వాడుకోవ‌చ్చు..

ఈ ఫీచర్‌ను వినియోగించేందుకు యూజర్లు ముందుగా వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేసి కుడి వైపు పై భాగాన‌ ఉన్న రూపాయి గుర్తుపై ట్యాప్‌ చేయాలి. ఇది కెమెరా, సెట్టింగ్స్ ఐకాన్ల పక్కన ఉంటుంది. తర్వాత సెండ్ మనీ ఆప్షన్ కింద కనిపించే మొబైల్ రీచార్జ్ ను ఎంచుకోవాలి. అనంతరం వాట్సాప్‌కు అనుసంధానమైన ఫోన్ నంబర్ల జాబితా కనిపిస్తుంది. అందులో రీచార్జ్ చేయాల్సిన నంబర్‌ను ఎంచుకున్న తర్వాత, అందుబాటులో ఉన్న ప్లాన్ల జాబితా కనిపిస్తుంది. యూజర్ తనకు నచ్చిన ప్లాన్‌ను ఎంచుకున్న తర్వాత, మొత్తం ఖర్చు వివరాలు, చెల్లించాల్సిన తుది మొత్తం చూపించే బిల్ స్క్రీన్‌లో కనిపిస్తుంది. ఆపై కంటిన్యూ పై ట్యాప్‌ చేసి, తమకు ఇష్టమైన పేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకుని ట్రాన్సాక్షన్‌ను పూర్తి చేయవచ్చు. మెటా తన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ లో ఇటీవ‌లి కాలంలో అనేక‌ సేవలను విస్తరిస్తూ వస్తోంది. ఇప్పటికే యూపీఐ ఆధారిత డిజిటల్ పేమెంట్ వ్యవస్థను ప్రవేశపెట్ట‌గా, యూజర్లు యాప్‌ను వదిలిపెట్టకుండా చెల్లింపులు చేయగలిగేలా ఫీచ‌ర్‌ను ఇచ్చింది. ఇప్పుడు మొబైల్ రీచార్జ్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకురావడం వ‌ల్ల యూజ‌ర్లు ఇంకో యాప్‌కు మారాల్సిన అవ‌స‌రం లేకుండానే త‌మ మొబైల్స్‌ను సుల‌భంగా రీచార్జి చేసుకోవ‌చ్చు.

Advertisement
Advertisement