Whatsapp | వాట్సాప్‌లో వస్తున్న మరో అద్భుతమైన ఫీచర్.. నోటిఫికేషన్ బబుల్స్..
Whatsapp | ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం చాట్ ఎక్స్‌పీరియెన్స్‌ను పూర్తిగా మార్చే కొత్త నోటిఫికేషన్ బబుల్స్ ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. యూజర్లు ఇతర యాప్‌లను ఉపయోగిస్తున్నప్పటికీ చాట్స్‌ను సులభంగా యాక్సెస్ చేసే విధంగా ఈ ఫీచర్ ను అభివృద్ధి చేస్తున్నారు.
Technology | Published On Apr 25, 2026, 11.14 am IST
Whatsapp | ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం చాట్ ఎక్స్‌పీరియెన్స్‌ను పూర్తిగా మార్చే కొత్త నోటిఫికేషన్ బబుల్స్ ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. యూజర్లు ఇతర యాప్‌లను ఉపయోగిస్తున్నప్పటికీ చాట్స్‌ను సులభంగా యాక్సెస్ చేసే విధంగా ఈ ఫీచర్ ను అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం ఇది డెవలప్‌మెంట్ దశలో ఉంది, ఇంకా టెస్టింగ్‌కు అందుబాటులోకి రాలేదు. వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WA Beta Info వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్‌లో చాట్స్‌ను ఫ్లోటింగ్ ఐకాన్‌ల రూపంలో చూపిస్తుంది. యూజర్లు బబుల్‌పై ట్యాప్ చేస్తే చిన్న చాట్ విండో తెరుచుకుని, పూర్తి యాప్ ఓపెన్ చేయకుండా వెంటనే రిప్లై ఇవ్వవచ్చు.
ఫేస్‌బుక్ మెసెంజర్ చాట్ హెడ్స్ మాదిరిగా..
ఈ విధానం ఫేస్‌బుక్ మెసెంజర్ లో ఉన్న చాట్ హెడ్స్ ఫీచర్‌ను పోలి ఉంటుంది. అయితే ఇది ఇంకా బీటా వెర్షన్‌లో కూడా అందుబాటులోకి రాలేదు. ముందుగా కొంతమంది ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు అందుబాటులోకి వచ్చి, తరువాత విస్తృతంగా విడుదల అయ్యే అవకాశం ఉంది. ఐఓఎస్‌లో నోటిఫికేషన్ బబుల్స్ సపోర్ట్ లేకపోవడంతో ఐఫోన్ యూజర్లు ఈ ఫీచర్‌ను ఉపయోగించలేరు. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ నోటిఫికేషన్ సిస్టమ్‌పై ఆధారపడి పనిచేస్తుంది. ఒక వ్యక్తిగత లేదా గ్రూప్ మెసేజ్ వచ్చినప్పుడు, యూజర్ ఇతర యాప్‌లో ఉన్నా కూడా ఫ్లోటింగ్ బబుల్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఇందులో పంపిన వ్యక్తి ప్రొఫైల్ ఫోటోతో పాటు వాట్సాప్ లోగో ఉంటుంది. బబుల్‌పై ట్యాప్ చేస్తే చిన్న చాట్ ఇంటర్‌ఫేస్ తెరుచుకుని వెంటనే స్పందించవచ్చు. అవసరమైతే ఈ ఫీచర్‌ను ఆఫ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.
మరింత వేగంగా మెసేజింగ్..
కాగా ఈ మార్పు వల్ల వాట్సాప్‌లో మెసేజింగ్ మరింత వేగవంతంగా కొనసాగుతుంది. సిస్టమ్‌తో సమన్వయంగా మార్చే ప్రయత్నంలో భాగంగా ఈ ఫీచర్‌ను ఇవ్వనున్నారు. యూజర్లు చేసే పనిని అడ్డుకోకుండా చాట్స్‌ను యాక్టివ్‌గా ఉంచడంలో ఈ ఫీచర్ సహాయపడుతుంది. అయితే ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ 11 లేదా ఆపైన వెర్షన్ ఉన్న ఫోన్లలోనే పనిచేస్తుంది. పాత ఆండ్రాయిడ్ వెర్షన్‌లలో డ్రా ఓవర్ అదర్ యాప్స్ అనుమతి అవసరం ఉండటం వల్ల వాట్సాప్ ఈ ఫీచర్‌ను కేవలం సపోర్ట్ ఉన్న డివైస్‌లకు మాత్రమే పరిమితం చేయనుంది. అయితే ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో చూడాలి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






