Whatsapp | వాట్సాప్‌లో వస్తున్న ఆటో డిలీట్ ఫీచర్.. ఇక మెసేజ్‌లు చదివిన వెంటనే డిలీట్ అవుతాయి..
Whatsapp | ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల ప్రైవసీని మరింత పటిష్టం చేసేందుకు గాను మరో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. అందులో భాగంగానే త్వరలో ఆటో డిలీట్ అనే ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ ఫీచర్‌ను ఇప్పటికే వాట్సాప్ టెస్ట్ చేస్తుండగా, అతి త్వరలో యూజర్లకు అందుబాటులోకి రానుంది.
Technology | Published On Mar 22, 2026, 4.03 pm IST
Whatsapp | ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల ప్రైవసీని మరింత పటిష్టం చేసేందుకు గాను మరో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. అందులో భాగంగానే త్వరలో ఆటో డిలీట్ అనే ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ ఫీచర్‌ను ఇప్పటికే వాట్సాప్ టెస్ట్ చేస్తుండగా, అతి త్వరలో యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్‌లో భాగంగా యూజర్ ఒక మెసేజ్‌ను పంపిన తరువాత అవతలి వ్యక్తి దాన్ని చదివిన అనంతరం కొద్ది నిమిషాలకు ఆ మెసేజ్ ఆటోమేటిగ్గా డిలీట్ అవుతుంది. ఈ వ్యవధిని యూజర్ సెట్టింగ్స్ ద్వారా సెట్ చేసుకోవచ్చు. రిసీవర్ చదివిన తరువాత మెసేజ్ ఎన్ని నిమిషాలకు డిలీట్ అవ్వాలో యూజర్ నిర్ణయించుకోవచ్చు. దీనికి డిఫాల్ట్‌గా 15 నిమిషాల వ్యవధిని ప్రస్తుతానికి సెట్ చేసి టెస్ట్ చేస్తున్నారు. యూజర్లకు మరింత ప్రైవసీని కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ ఫీచర్‌ను వాట్సాప్ ప్రవేశపెట్టనుంది.
సున్నితమైన సమాచారానికి రక్షణ..
వాట్సాప్‌లో ఇప్పటికే disappearing messages అనే ఫీచర్ అందుబాటులో ఉండగా, కొత్తగా ప్రవేశపెట్టనున్న ఆటో డిలీట్ ఫీచర్ అందుకు భిన్నంగా పనిచేస్తుంది. disappearing messages ఫీచర్‌లో ప్రస్తుతం 24 గంటలు, 7 రోజులు లేదా 90 రోజులకు మెసేజ్‌లు డిలీట్ అయ్యేలా సెట్టింగ్స్ చేసుకోవచ్చు. అయితే కొత్తగా రానున్న ఆటో డిలీట్ ఫీచర్‌తో ఓటీపీలు లేదా ఇతర వ్యక్తిగత, సున్నితమైన సమాచారం, అందుకు చెందిన సందేశాలను చదివిన వెంటనే పూర్తిగా మాయం అవుతాయి. దీని వల్ల యూజర్ల ప్రైవసీకి, బ్యాంకింగ్ లేదా ఇతర సున్నితమైన కార్యకలపాలకు మరింత రక్షణ లభిస్తుంది. దీని వల్ల యూజర్ల డివైస్‌లలో చాట్ లు చాలా తక్కువ కాలం పాటు మాత్రమే స్టోర్ అవుతాయి.
డిఫాల్ట్‌గా 15 నిమిషాలు..
ప్రస్తుతం వాట్సాప్ టెస్ట్ చేస్తున్న బీటా వెర్షన్‌లో మెసేజ్‌లు డిలీట్ అయ్యే కాలవ్యవధిని డిఫాల్ట్‌గా 15 నిమిషాలు ఉంచి పరీక్షిస్తున్నారు. దీని వల్ల యూజర్ పంపిన సందేశాన్ని రిసీవర్ చదివిన అనంతరం ఆ మెసేజ్ 15 నిమిషాల్లో ఆటోమేటిగ్గా డిలీట్ అవుతుంది. అయితే మెసేజ్‌ను రిసీవర్ ఓపెన్ చేయకపోతే అది 24 గంటల్లో ఆటో డిలీట్ అవుతుంది. ఆటోడిలీట్ ఫీచర్ read receipts (బ్లూ టిక్స్) ఆప్షన్‌ను ఆఫ్ చేసినా కూడా పనిచేస్తుందని రిపోర్టులో వెల్లడైంది. అంటే, అవతలి వారు బ్లూటిక్ సెట్టింగ్స్‌ను ఆఫ్ చేసినా సరే వారు ఆ మెసేజ్‌ను చదివినా, చదవకపోయినా పంపిన వారికి ఆ విషయం ఈజీగా తెలుస్తుందన్నమాట. ఆటో డిలీట్ ఫీచర్ వల్ల తాత్కాలిక సమాచారం పంపేవారికి ఎంతో వెసులుబాటు ఉంటుంది. ఓటీపీ లేదా పాస్ వర్డ్ వంటివి పంపాల్సి వస్తే కాసేపయ్యాక ఆటోమేటిగ్గా మెసేజ్ డిలీట్ అవుతుంది కనుక సెక్యూరిటీ పెరుగుతుంది.
ముందుగా వీరికే..
ఇక ఈ ఆటో డిలీట్ ఫీచర్‌ను వాట్సాప్ ప్రస్తుతం బీటా వెర్షన్‌లో టెస్ట్ చేస్తుందని వాట్సాప్ అప్‌డేట్ ట్రాకర్ వెబ్‌సైట్ wabetainfo తన పోస్టులో వెల్లడించింది. ఈ ఫీచర్ ముందుగా ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి రానుండగా, తొలుత వ్యక్తిగత చాట్‌లలోనే దీన్ని అందిస్తారని, తరువాత గ్రూప్ చాట్‌లకు కూడా వర్తింపజేస్తారని సమాచారం. అనంతరం ఐఓఎస్ వెర్షన్‌కు కూడా దీన్ని లాంచ్ చేయనున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






