WhatsApp | వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు.. టీనేజర్లపై పేరెంట్స్‌కు మరింత కంట్రోల్..
WhatsApp | తాజా భద్రతా ఆందోళనల నేపథ్యంలో ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ టీనేజర్ల కోసం కొత్త పేరెంటల్ కంట్రోల్ ఫీచర్లను ప్రకటించింది. వాట్సాప్ తన బ్లాగ్‌పోస్ట్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. టీన్‌ల కోసం పేరెంటల్ కంట్రోల్స్‌ను పరిచయం చేస్తున్నామని, తల్లిదండ్రులు, టీనేజర్లు కలిసి ఏర్పాటు చేసుకునేలా వీటిని రూపొందించామని తెలిపింది.
Technology | Published On Oct 1, 2026, 11.02 am IST
WhatsApp | తాజా భద్రతా ఆందోళనల నేపథ్యంలో ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ టీనేజర్ల కోసం కొత్త పేరెంటల్ కంట్రోల్ ఫీచర్లను ప్రకటించింది. వాట్సాప్ తన బ్లాగ్‌పోస్ట్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. టీన్‌ల కోసం పేరెంటల్ కంట్రోల్స్‌ను పరిచయం చేస్తున్నామని, తల్లిదండ్రులు, టీనేజర్లు కలిసి ఏర్పాటు చేసుకునేలా వీటిని రూపొందించామని తెలిపింది. కుటుంబాలకు సరైన వాట్సాప్ అనుభవాన్ని ఎంచుకునేందుకు ఇవి ఉపయోగపడతాయని వాట్సాప్ చెప్పింది. తమ టీనేజర్‌కు సరైన ప్రైవసీ సెట్టింగులను తల్లిదండ్రులు ఎంచుకోవచ్చు. టీనేజర్ ప్రొఫైల్ ఫొటోను ఎవరు చూడాలి, వారిని గ్రూపుల్లో ఎవరు యాడ్ చేయవచ్చు వంటి అంశాలను తల్లిదండ్రులు నియంత్రించవచ్చు. టీనేజర్ ఈ సెట్టింగుల్లో దేన్నయినా సడలించాలనుకుంటే, తల్లిదండ్రులు ఏర్పాటు చేసిన పిన్ ద్వారా అనుమతి పొందాల్సి ఉంటుందని వాట్సాప్ తెలిపింది.
ప్రతి చర్యకు నోటిఫికేషన్..
అలాగే టీనేజర్ ఏదైనా గ్రూప్‌లో చేరినా లేదా గ్రూప్ నుంచి బయటకు వచ్చినా తల్లిదండ్రులకు నోటిఫికేషన్ వస్తుంది. ఏదైనా గ్రూప్ సభ్యుల సంఖ్య భారీగా పెరిగినా తల్లిదండ్రులకు సమాచారం అందుతుంది. టీనేజర్ ఛానళ్లను ఎలా ఉపయోగించాలి, ఎవరి స్టేటస్ అప్‌డేట్లను చూడవచ్చు, తమ స్టేటస్‌ను ఎవరు చూడవచ్చు వంటి అంశాలను కూడా తల్లిదండ్రులు నిర్ణయించవచ్చు. మెటా ఏఐ విషయంలోనూ టీనేజర్లకు సరైన అనుభవాన్ని తల్లిదండ్రులు ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఇందులో డిఫాల్ట్ 13 ప్లస్ సెట్టింగ్‌తోపాటు మరింత కఠినమైన లిమిటెడ్ కంటెంట్ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ‘ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, కుటుంబాలు తమకు అవసరమైన అంశాలను తెలియజేస్తున్న కొద్దీ ఈ కంట్రోల్స్‌ను దశలవారీగా అభివృద్ధి చేస్తున్నామని వాట్సాప్ తెలిపింది. ఈ కంట్రోల్స్ ద్వారా తల్లిదండ్రులు, టీనేజర్ల మధ్య వాట్సాప్‌ను ఎలా ఉపయోగించాలనే అంశంపై బహిరంగ చర్చలకు ప్రోత్సాహం లభించేలా చూస్తున్నామని, అదే సమయంలో ప్రతి ఒక్కరి వ్యక్తిగత సందేశాల గోప్యతను కాపాడుతున్నామని తెలియజేసింది.
ఆప్షనల్ మాత్రమే..
ప్రతి కుటుంబ అవసరాలు భిన్నంగా ఉంటాయని పేర్కొన్న వాట్సాప్, టీనేజర్ల కోసం తీసుకొచ్చిన పేరెంటల్ కంట్రోల్స్‌ను పూర్తిగా ఆప్షనల్‌గా ఉంచింది. టీనేజర్‌కు ఎంత మేరకు సహాయం అవసరమో తల్లిదండ్రులు నిర్ణయించుకోవచ్చు. అవసరాన్ని బట్టి ఈ కంట్రోల్స్‌ను ఎప్పుడైనా మార్చుకోవచ్చు లేదా పూర్తిగా ఆఫ్ చేయవచ్చు. పేరెంటల్ కంట్రోల్స్ ఆన్‌లో ఉన్నప్పటికీ టీనేజర్ వ్యక్తిగత సందేశాలు, కాల్స్ మాత్రం ప్రైవేట్‌గానే ఉంటాయని వాట్సాప్ స్పష్టం చేసింది. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ కారణంగా చాట్‌లో ఉన్న వ్యక్తులు మినహా ఇతరులు, వాట్సాప్ కూడా ఆ సందేశాలను చూడలేదని లేదా కాల్స్ వినలేదని కంపెనీ తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలోనే వాట్సాప్ చిన్న వయసు వినియోగదారులు ప్లాట్‌ఫామ్‌ను ఎలా ఉపయోగిస్తున్నారో తల్లిదండ్రులు పర్యవేక్షించేందుకు పేరెంటల్ కంట్రోల్ ఫీచర్‌ను ప్రకటించింది. ఈ టూల్ ద్వారా తల్లిదండ్రులు లేదా సంరక్షకులు కమ్యూనికేషన్ సెట్టింగులను మార్చడంతోపాటు కొన్ని ఆప్షన్లను పరిమితం చేయవచ్చు. దీంతో 13 ఏళ్లలోపు పిల్లలు ప్రధానంగా మెసేజింగ్, కాల్స్ కోసం యాప్‌ను ఉపయోగించేలా చేయడమే ఈ ఫీచర్ ఉద్దేశం.
అందరితో చర్చించి ఫీచర్లు..
కుటుంబాలు, భద్రతా నిపుణులతో నిర్వహించిన సంప్రదింపుల అనంతరం ఈ కార్యక్రమాన్ని అభివృద్ధి చేసినట్లు వాట్సాప్ తెలిపింది. 13 ఏళ్లలోపు పిల్లలకు మరింత నియంత్రిత అనుభవాన్ని అందించడమే దీని లక్ష్యంగా పేర్కొంది. కొత్తగా తీసుకొచ్చిన పేరెంట్-మేనేజ్డ్ అకౌంట్లు ప్రత్యేకంగా 13 ఏళ్లలోపు పిల్లల కోసం రూపొందించినవని వాట్సాప్ తెలిపింది. మెటాకు చెందిన ఈ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ ప్రకారం, ఈ అకౌంట్లను తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తారు. ఇవి పెద్దల సొంత వాట్సాప్ ప్రొఫైల్‌తో అనుసంధానమై ఉంటాయని కంపెనీ బ్లాగ్‌పోస్ట్‌లో వివరించింది.
సంబంధిత వార్తలు

WhatsApp | ఇక బిల్లులన్నీ వాట్సాప్‌లోనే చెల్లించవచ్చు.. కొత్త అప్డేట్ వచ్చేసింది..
సెప్టెంబర్ 3, 2026

WhatsApp | వాట్సాప్ యూజర్లకు కొత్త సెక్యూరిటీ ఫీచర్లు.. ఇక అకౌంట్ మరింత సేఫ్..
ఆగస్టు 27, 2026

Direct To Cell Service | మొబైల్ టవర్ లేకున్నా వాట్సాప్.. స్టార్‌లింక్‌తో ఎయిర్టెల్ కొత్త సేవలు
ఆగస్టు 16, 2026
తాజావార్తలు
- ●Rahul Gandhi | ఫారమ్-6లో మార్పులు చేయమని టీసీఎస్‌ను ఎవరు ఆదేశించారు..? ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించిన రాహుల్
- ●Nayanthara | సెట్స్‌పై ఐదు సినిమాలు.. అయినా తగ్గని నయన్ జోరు - లేడీ సూపర్ హీరోగా!
- ●Arasavalli | సూర్యనారాయణుడిని తాకని సూర్యకిరణాలు.. అరసవల్లిలో ఆశ్చర్యం
- ●Captain Smit Machchhar | ఆయన పేరు గుర్తుంచుకోండి.. ఇండియన్ పైలట్‌పై ఇజ్రాయెల్ ప్రశంసల వర్షం
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో నష్టాల పరంపర.. భారీ స్థాయిలో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు..
- ●SAIL Apprentices | సెయిల్‌లో 710 అప్రెంటిస్‌లు.. రాతపరీక్ష లేకుండానే..

Rahul Gandhi | ఫారమ్-6లో మార్పులు చేయమని టీసీఎస్‌ను ఎవరు ఆదేశించారు..? ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించిన రాహుల్

Nayanthara | సెట్స్‌పై ఐదు సినిమాలు.. అయినా తగ్గని నయన్ జోరు - లేడీ సూపర్ హీరోగా!

Arasavalli | సూర్యనారాయణుడిని తాకని సూర్యకిరణాలు.. అరసవల్లిలో ఆశ్చర్యం

Captain Smit Machchhar | ఆయన పేరు గుర్తుంచుకోండి.. ఇండియన్ పైలట్‌పై ఇజ్రాయెల్ ప్రశంసల వర్షం



