త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

X Parental Controls | టీనేజర్లపై తల్లిదండ్రుల నిఘా.. ఎక్స్‌లో కొత్త ఫీచర్లు..

X Parental Controls | టీనేజర్ల సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రించేందుకు ఎక్స్ (X) కొత్తగా పేరెంటల్ కంట్రోల్స్ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 13 నుంచి 17 ఏళ్ల వయసున్న పిల్లలు రోజూ ఎంతసేపు ఎక్స్ వినియోగిస్తున్నారో తెలుసుకోవడంతోపాటు, స్క్రీన్ టైమ్ పరిమితులు, కంటెంట్ ఫిల్టర్లు, డైరెక్ట్ మెసేజ్ నియంత్రణ వంటి సదుపాయాలను తల్లిదండ్రులు వినియోగించుకోవచ్చు.

S

Technology | Published On Nov 27, 2026, 5.16 pm IST

X Parental Controls | టీనేజర్లపై తల్లిదండ్రుల నిఘా.. ఎక్స్‌లో కొత్త ఫీచర్లు..
Advertisement

X Parental Controls | టీనేజర్ల సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రించేందుకు ఎక్స్ (X) కొత్తగా పేరెంటల్ కంట్రోల్స్ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 13 నుంచి 17 ఏళ్ల వయసున్న పిల్లలు రోజూ ఎంతసేపు ఎక్స్ వినియోగిస్తున్నారో తెలుసుకోవడంతోపాటు, స్క్రీన్ టైమ్ పరిమితులు, కంటెంట్ ఫిల్టర్లు, డైరెక్ట్ మెసేజ్ నియంత్రణ వంటి సదుపాయాలను తల్లిదండ్రులు వినియోగించుకోవచ్చు.

పిల్ల‌ల ఖాతాల‌పై త‌ల్లిదండ్రుల‌కు మ‌రిన్ని నియ‌త్ర‌ణ‌లు..

టీనేజర్లకు సోషల్ మీడియా వినియోగాన్ని మరింత సురక్షితంగా మార్చే లక్ష్యంతో ఎక్స్ పేరెంటల్ కంట్రోల్స్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫీచర్ల ద్వారా 13 నుంచి 17 ఏళ్ల వయసున్న పిల్లల ఖాతాలపై తల్లిదండ్రులు, సంరక్షకులు కొన్ని నియంత్రణలు విధించవచ్చు. అయితే పిల్లల ఖాతాల యాజమాన్యం వారివద్దే ఉంటుంది. పేరెంటల్ కంట్రోల్స్ ద్వారా చేసే ప్రతి మార్పు వివరాలు టీనేజర్లకు కూడా కనిపిస్తాయి. తల్లిదండ్రులు పిల్లల ప్రైవేట్ మెసేజ్‌లను చదవడం, సెర్చ్ వివరాలు, వీక్షణ చరిత్రను చూడడం లేదా వారి తరఫున పోస్టులు చేయడం సాధ్యం కాదు. గత వారం రోజులుగా పిల్లలు ఎక్స్‌లో ఎంత సమయం గడిపారో తెలుసుకోవడంతోపాటు, రోజువారీ వినియోగ పరిమితిని కూడా నిర్ణయించవచ్చు. కొత్త ఫాలోవర్లు చేరేందుకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేసే అవకాశం ఉంటుంది. ఈ నియంత్రణను అమలు చేస్తే టీనేజర్ల ఖాతా ప్రైవేట్‌గా మారుతుంది.

ఎవ‌రు మెసేజ్‌లు పంపించాలో నియంత్రించ‌వ‌చ్చు..

కంటెంట్ నియంత్రణలో భాగంగా పిల్లలు ఇప్పటికే ఫాలో అవుతున్న ఖాతాల నుంచి మాత్రమే ఫర్ యూ సిఫార్సులు, వీడియోలు కనిపించేలా చేయవచ్చు. నిర్దిష్ట పదాలను ఫిల్టర్ చేయడంతోపాటు సున్నితమైన మీడియా కంటెంట్‌ను పూర్తిగా నిలిపివేయవచ్చు. పిల్లలకు ఎవరు డైరెక్ట్ మెసేజ్‌లు పంపించవచ్చో కూడా తల్లిదండ్రులు నియంత్రించవచ్చు. అలాగే పిల్లలు ఎవరెవరితో వ్యక్తిగతంగా చాట్ చేస్తున్నారో తెలుసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఆ సంభాషణల్లోని మెసేజ్‌లను మాత్రం చదవలేరు. ఒక పేరెంట్ లేదా సంరక్షకుడు గరిష్ఠంగా ఐదు టీనేజర్ ఖాతాలను పర్యవేక్షించవచ్చు. ఒక్కో టీనేజర్ ఖాతాను ఒకేసారి ఒక పేరెంట్ లేదా సంరక్షకుడితో మాత్రమే అనుసంధానించవచ్చు. పర్యవేక్షణ ప్రారంభించడానికి తల్లిదండ్రులు, టీనేజర్లు ఇద్దరూ అంగీకరించాల్సి ఉంటుంది.

క‌నీస వ‌య‌సు ఉండాల్సిందే: ఎక్స్

పిల్లల భద్రత తమకు ప్రాధాన్య అంశమని ఎక్స్ స్పష్టం చేసింది. ఈ ప్లాట్‌ఫామ్‌ను పిల్లల కోసం రూపొందించలేదని, వినియోగదారులకు కనీసం 13 ఏళ్ల వయసు ఉండాలని తెలిపింది. చట్టపరంగా అవసరమైన చోట అంతకంటే ఎక్కువ వయసు నిబంధన కూడా వర్తిస్తుంది. టీనేజర్ల ఖాతాలకు డిఫాల్ట్‌గా ప్రొటెక్టెడ్ మోడ్ అమలులో ఉంటుంది. సున్నితమైన మీడియా కంటెంట్‌పై పరిమితులు, లక్ష్యిత ప్రకటనల నిలిపివేత వంటి రక్షణలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. వీటికి అదనంగా కొత్త పేరెంటల్ కంట్రోల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం 13 నుంచి 17 ఏళ్ల వయసున్న టీనేజర్ల కుటుంబాలకు ఈ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాలను ఎక్స్ హెల్ప్ సెంటర్‌లో తెలుసుకోవచ్చు.

Advertisement
Advertisement