WhatsApp | వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. అకౌంట్ లేని వారికీ ఈవెంట్ ఆహ్వానాలు..
WhatsApp | వాట్సాప్ తన ఈవెంట్స్ ఫీచర్‌లో కీలక మార్పులు తీసుకొచ్చింది. ఇకపై వాట్సాప్ అకౌంట్ లేని వారిని కూడా ఈవెంట్లకు ఆహ్వానించవచ్చు. వారు యాప్ డౌన్‌లోడ్ చేసుకోకుండానే ఆహ్వాన వివరాలను చూసి తమ హాజరును ధ్రువీకరించవచ్చు. కొత్త ఈవెంట్స్ హోమ్ ద్వారా ఆహ్వానాల రూపకల్పన, హాజరు నిర్వహణ, ప్రత్యేక రిమైండర్లను ఒకేచోట నిర్వహించే సదుపాయం కల్పించింది.
Technology | Published On Nov 6, 2026, 5.16 pm IST
WhatsApp | వాట్సాప్ తన ఈవెంట్స్ ఫీచర్‌లో కీలక మార్పులు తీసుకొచ్చింది. ఇకపై వాట్సాప్ అకౌంట్ లేని వారిని కూడా ఈవెంట్లకు ఆహ్వానించవచ్చు. వారు యాప్ డౌన్‌లోడ్ చేసుకోకుండానే ఆహ్వాన వివరాలను చూసి తమ హాజరును ధ్రువీకరించవచ్చు. కొత్త ఈవెంట్స్ హోమ్ ద్వారా ఆహ్వానాల రూపకల్పన, హాజరు నిర్వహణ, ప్రత్యేక రిమైండర్లను ఒకేచోట నిర్వహించే సదుపాయం కల్పించింది.
అకౌంట్ లేకున్నా ఫీచర్ యాక్సెస్..
వాట్సాప్ తన ఈవెంట్స్ ఫీచర్‌ను మరింత మెరుగుపరిచింది. కొత్త అప్‌డేట్‌లో భాగంగా వినియోగదారులు ఈవెంట్లను సృష్టించడంతోపాటు కవర్ ఫొటోను జోడించి, ఆహ్వాన లింక్‌ను ఇతరులతో పంచుకోవచ్చు. ముఖ్యంగా వాట్సాప్ అకౌంట్ లేని వ్యక్తులు కూడా ఆ లింక్ ద్వారా ఈవెంట్ వివరాలను చూడవచ్చు. యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే తమ హాజరును తెలియజేయవచ్చు. కొత్త ఈవెంట్స్ హోమ్‌లో ఆహ్వానాల తయారీ, హాజరు ధ్రువీకరణ నిర్వహణ వంటి సదుపాయాలను ఒకేచోట అందుబాటులోకి తెచ్చింది. అతిథుల కోసం ప్రత్యేక రిమైండర్లను సెట్ చేసుకోవచ్చు. ఆహ్వానం అందుకున్న వ్యక్తి తనతోపాటు మరో వ్యక్తిని తీసుకొచ్చేందుకు ప్లస్ వన్ ఆప్షన్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు.
యూజర్లకు ప్రత్యేక ఫీచర్లు..
వినియోగదారులు సెట్టింగ్స్‌లోని ఈవెంట్స్ విభాగంలోకి వెళ్లి తాము సృష్టించిన ఈవెంట్లు, ఇతరులు ఆహ్వానించిన కార్యక్రమాలు సహా గతంలో జరిగినవి, రాబోయే ఈవెంట్ల పూర్తి జాబితాను చూడవచ్చు. ఈవెంట్ ఆహ్వానాల్లో గోప్యతకు ప్రాధాన్యత ఇచ్చినట్లు వాట్సాప్ వెల్లడించింది. పరిచయం లేని అతిథులకు యూజర్ ఫోన్ నంబర్ కనిపించదు. వాట్సాప్ అకౌంట్ లేని అతిథులు తమ హాజరును ధ్రువీకరించిన తర్వాత మాత్రమే ఈవెంట్ చిరునామాను చూడగలుగుతారు. వ్యక్తిగత సందేశాలు, కాల్స్ మాత్రం ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ రక్షణతో ప్రైవేట్‌గానే కొనసాగుతాయని సంస్థ స్పష్టం చేసింది. ఈ కొత్త ఈవెంట్స్ ఫీచర్‌ను రానున్న కొన్ని వారాల్లో ప్రపంచవ్యాప్తంగా అందరికీ దశలవారీగా అందుబాటులోకి తీసుకురానుంది.
సంబంధిత వార్తలు

WhatsApp | వాట్సాప్ గ్రూప్‌లలో 4 కొత్త ఫీచర్లు.. ఇక చాటింగ్ మరింత ఈజీ..
నవంబర్ 3, 2026

Instinct AI | వాట్సాప్‌లో ఏఐ అసిస్టెంట్ ఇన్‌స్టింక్ట్‌పై వివాదం.. యూజర్ ఖాతా బ్యాన్..
నవంబర్ 2, 2026

WhatsApp | డిలీట్ చేసిన వాట్సాప్ చాట్స్‌ను తిరిగి పొందడం ఎలా? ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు సింపుల్ టిప్స్!
అక్టోబర్ 31, 2026
తాజావార్తలు
- ●NEHS | ఉద్యోగులకు ఆస్పత్రుల్లో అడ్మిషన్లు నిరాకరిస్తే చర్యలు
- ●Salman Khan | "మాతృభూమి" సెన్సార్ కాకుండా మోదీ ప్రభుత్వం అడ్డుకుందా? - రూమర్లపై సల్మాన్ ఖాన్ రియాక్షన్
- ●Tummal Nageshwar Rao | వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుతాం.. రైతుల ఆదాయం పెంచుతాం..
- ●Cyber Criminals | సైబర్ నేరగాళ్లకు సమాజంలో చోటు లేదు.. జైళ్లలో మగ్గిపోవడమే వారికి సరైన శిక్ష : సుప్రీంకోర్టు
- ●Bhatti Vikramarka | పాత బస్తీ అభివృద్ధికి భారీగా నిధుల కేటాయింపు
- ●IND Vs NZ ODI | రేపు న్యూజిలాండ్‌తో రెండో వన్డే.. మ్యాచ్‌కు వానగండం..?

NEHS | ఉద్యోగులకు ఆస్పత్రుల్లో అడ్మిషన్లు నిరాకరిస్తే చర్యలు

Salman Khan | "మాతృభూమి" సెన్సార్ కాకుండా మోదీ ప్రభుత్వం అడ్డుకుందా? - రూమర్లపై సల్మాన్ ఖాన్ రియాక్షన్

Tummal Nageshwar Rao | వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుతాం.. రైతుల ఆదాయం పెంచుతాం..

Cyber Criminals | సైబర్ నేరగాళ్లకు సమాజంలో చోటు లేదు.. జైళ్లలో మగ్గిపోవడమే వారికి సరైన శిక్ష : సుప్రీంకోర్టు



